బాస్ పీడా నివారణ
- Mohana Krishna Tata
- May 17
- 3 min read
#MohanaKrishnaTata, #తాతమోహనకృష్ణ, #BossPidaNivarana, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Boss Pida Nivarana - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 17/05/2025
బాస్ పీడా నివారణ - తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
హింసరావు ఒక పెద్ద కంపెనీకి బాస్..తండ్రి తర్వాత అతని కంపెనీకి ఆటోమేటిక్ గా బాస్ అయిపోయాడు. తన ఆఫీస్ లో స్టాఫ్ అందరిచేత చాకిరీ చేయించుకుంటే గాని ఆయన మనసు శాంతించదు. ఇంట్లో పెళ్ళాన్ని మాత్రం ఏమీ అనలేని ఆయన, ఆఫీస్ లో ఆడవారి చేత ఇది చెయ్యి, అది చెయ్యి అని ఆఫీస్ పనులన్నీ ఎక్కువ అప్పగించేసేవాడు. ఇంట్లో మాత్రం పెళ్ళాం చేతుల్లో పిల్లి. ఎప్పుడూ వంటింట్లో గరిట..పెరడులో బట్టలతో సావాసమే అతనికి. పెళ్ళాన్ని తిట్టుకుంటూ రోజూ ఆఫీసులో కాలు పెడతాడు.
ఇంట్లో మొగుళ్ళతో చాకిరీ చేయించే ఆడవారంటే, అతనికి వొళ్ళు మంట. వారికి ప్రమోషన్ ఇవ్వడు..ఇంక్రిమెంట్ తగ్గించేస్తాడు. వారిచేత బండ చాకిరీ చేయించుకుంటాడు.
ఆఫీస్ లో ఆడవారంతా బాస్ పెట్టే టార్చర్ భరించలేక, అందరూ కలిసి అతని గురించి చేయని పూజలు లేవు. గుడిలో పూజారి సలహా మేరకు, అందరూ చందాలు వేసుకుని 'బాస్ పీడా నివారణ' హోమం కూడా ఘనంగా చేయించారు.
ఇంట్లో పెళ్ళానికి భయపడి, ఇంట్లో పనంతా చేసే మగాలందరికీ కూడా అదే పరిస్టితి..వారికీ నో ఇంక్రిమెంట్, నో ప్రమోషన్. ఇలా మగవారందరికీ కూడా ఆయనంటే అయిష్టం ఏర్పడింది. మగవారు ఆడవారంత పూజలు చేయకపోయినా.. ఒక స్వామిజీ చెప్పిన ఒక 'బాస్ పీడా నివారణ మంత్రం' రోజూ ఆఫీస్ కి వచ్చిన వెంటనే అందరూ నూట ఎనిమిది సార్లు జపించేవారు.
బాస్ తండ్రి మీద ఉన్న గౌరవంతో ఎవరూ ఆఫీస్ వదిలి వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు. ఎప్పటికైనా, మంచి రోజులు వస్తాయనే నమ్మకంతో..'ఉందిలే మంచికాలం ముందు ముందు నా..' అంటూ పాడుకుంటూ కాలం గడుపుతున్నారు అంతా..!
ఒక రోజు ఉదయం కంపెనీ బాస్ ని ఎవరో కిడ్నాప్ చేసారన్న వార్త బయటకు వ్యాపించింది. ఆఫీసులో పని మానేసి అంతా ఇదే చర్చకు దిగారు. ఒక పండుగు వాతావరణమే ఆఫీసులో అంతా.
"ఏమైంది..ఆఫీస్ ఇంత హడావిడిగా ఉంది..బాస్ లేడా? " అని లేట్ గా వచ్చిన క్లర్క్ రాము పక్కన ఉన్న ఇంకో క్లర్క్ రవిని అడిగాడు
"మన బాస్ హింసరావును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసారు..ఎవరో ఇంకా తెలియట్లేదు. అతనికి అందరూ శత్రువులే..ఏమో ఎవరు చేసారో..? బాస్ భార్య అతనితో పడక ఇలా చేసిందని టాక్..ఎవరు చేసినా అంతా మన మంచికే"
"అయితే కొన్ని రోజులు ఆఫీస్ లో ప్రశాంతంగా ఉండొచ్చు. కిడ్నాపర్ల డిమాండ్స్ ఏమైనా తెలిసాయా?"
"తెలిసాయి.. పదిలక్షలు ఇస్తే మన బాస్ ని విడిచిపెట్టేస్తారంట.."
"కిడ్నాప్ చేసిన వారికి కూడా తెలిసిపోయింది మన బాస్ వేల్యూ గురించి..చీప్ గా పది లక్షలా..? డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తారో..?" అడిగాడు రాము
"బాస్ పై పెట్రోల్ పొసి, భోగిమంటలు వేసుకుంటారని తెలిసింది" అన్నాడు రవి
"అయితే ఆఫీస్ లో అందరూ ఏం డిసైడ్ చేసారో మరి? భోగీ మంటలా..? లేకపోతే మన గుండెల్లో మంటలా..?"
"ప్రతివారూ చందాలు వేసుకుంటున్నాము, మొత్తం అంతా పోగుచేసి ఒకేసారి ఆ కిడ్నాపర్లకు అందిస్తాము"
"ఒక్కొక్కరు ఎంత వేసుకుంటున్నారో చెబితే.. నా వంతు కూడా ఇచ్చేస్తాను" అన్నాడు రాము
"ఎంత..! ఒక్కొక్కరు ఒక లీటరు" అని చెప్పారు అంతా ఏక స్వరంతో
"ఎక్కడ పదిలక్షలు ఇచ్చేస్తారో అని భయపడి చచ్చాను..! అలాగైతే.. నేను నా బావమరిది పెట్రోల్ బంకులో డిస్కౌంట్ ఇప్పిస్తాను..డబ్బులు ఎవరికీ ఊరికే రావు.." అంటూ ఆనందపడుతూ అన్నాడు రాము
డిస్కౌంట్ వస్తుందన్న ఆనందంతో ఆడవారంతా బాస్ పేరు చెప్పుకుని 'ఒక శారీ కొనుక్కోవచ్చని' సంబరపడ్డారు.
******************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
コメント