top of page
Original.png

చీకటి

#VeereswaraRaoMoola, #వీరేశ్వరరావుమూల, #చీకటి, #Cheekati, ##TeluguHeartTouchingStories, #కొసమెరుపు

ree

Cheekati- New Telugu Story Written By Veereswara Rao Moola

Published In manatelugukathalu.com On 25/12/2025

చీకటి - తెలుగు కథ

రచన: వీరేశ్వర రావు మూల


కామాటిపురా కామ కేంద్రం గా ప్రసిద్ధి. రాజేష్ నడుస్తున్నాడు. నిన్నటి నుండి చెవిలో ఒకటే రజాక్ రొద. 

' ఓ సారి అక్కడికి వెళ్ళి మగతనం పరీక్షించుకుంటే తప్పు లేదని.'


రజాక్ గొడవో, హార్మోన్ల గొడవో తెలియదు కాని రాజేష్ కాళ్ళు అటే లాక్కు వెళ్ళాయి.

రజాక్,రాజేష్ ఒక చోట టైలర్ కొట్లో పనిచేస్తున్నారు.


                   *******''

చివరి దాకా కాలిన సిగరెట్ నలిపి, అక్కడ చిన్న సందులో ఉన్న చీకటి గది లోకి వెళ్ళాడు రాజేష్.


'బిస్తర్ అందర్ హై' అని పలికింది ఒక స్త్రీ స్వరం.


కొద్దిగా వెలుతురు ఉన్న ఆ మంచం మీదకి చేరాడు. ఆ అమ్మాయి పక్కనే కూర్చుంది. చీకటి కాబట్టి అంతగా పరిశీలించ లేక  పోయాడు. ఆమె అందాల్ని తడిమి చూసాక అందగత్తె అనుకున్నాడు. అతని లో మోహం పడగ విప్పింది. వాళ్ళిద్దరూ చాలా కాలానికి కలిసిన నాగుల్లా, పెనవేసుకు పోయారు. అత్తరు వాసనతో ఉతకని దుప్పటి కొత్త గా అనిపించింది.


సుఖం శిఖరాలకు చేరాక, జలపాతం నది లా మారాక, అతను మంచం మీద కూర్చున్నాడు.


ఎందుకో ఒక అశ్రువు కంట్లోంచి జారి ఆమె చేతి మీద పడింది.

'కుచ్ దర్ద్ హై (బాధ గా ఉందా?)' అడిగింది. 


                 *******

రాజేష్ ఆమె తో తన కధ చెప్పడం మొదలు పెట్టాడు. 


                  ********

అది ఆంధ్ర లో పల్లెటూరు. కమల విరిసిన కలువ లా ఉంటుంది. కాలువ మీద నున్న బల్లకట్టు దాటి కాలేజీ కి వెడుతుంది. రాజేష్ తండ్రి బల్లకట్టు నడిపే వాడు. ఆరోగ్యం బాగుండక పోవడం తో కొడుకు రాజేష్ కి ఆ పని అప్పజెప్పాడు. 


ఇష్టం లేక పోయినా, తండ్రి మాట కాదనలేక వెళ్ళాడు. అప్పుడు కలిసినది కమల. ముద్ద మందారం లా ఉంది. ఆ అందాన్ని చూస్తూ ఉండిపోయాడు. ఒక రోజు బల్లకట్టు ఎక్కేటప్పుడు కాలు జారితే, కాలువ లో పడకుండా రాజేష్ నడుము దగ్గర చెయ్యి వేసి పెట్టుకున్నాడు. 


ఆమె ఒంటి పరిమళం  అతని మనసును చుట్టేసింది. రాజేష్ రోజూ ఒక గులాబి ని కమలకి  ఇచ్చేవాడు. తలలో పెట్టుకుని సాయంత్రం అదే పువ్వు తో తిరిగి వచ్చేది. ఏదైనా ఒక రోజు కమల కనబడక పోతే రాజేష్ మనసు గిలగిల లాడేది. శిశిరం వెళ్ళింది వసంతం వచ్చింది. వసంతం వెళ్ళింది. శిశిరం వచ్చింది. శిశిరం ఉండ గానే బల్లకట్టు ఎక్కిన కమల కాలేజీ కి వెళ్ళింది. తిరిగి రాలేదు. ఏమయ్యిందో తెలియలేదు. పోలీసు కేసు పెట్టినా ఏమి తెలియలేదు. ప్రజలకు ఆ ఊరి మోతుబరి మంగరాజు మీద అనుమానం.కాని ఎక్కడా ఋజువులు లేవు. కమల తండ్రి గుండెలు బాదుకున్నాడు. కమల లేని ఆ ఊర్లో ఉండలేనని రాజేష్ ముంబాయి వచ్చేసాడు.


                 ********

"ఏదో బరువు దించుకోవడానికి, ఒళ్ళు అమ్ముకునే నీకు నా ప్రేమ కధ చెప్పాను.ఒళ్ళు అమ్ముకునే నీకు ఏమి అర్థమవుతుంది? " 


"అందర్ ఔరత్ కా దిల్ రహతా హై" 


మళ్ళీ  ఓ సారి కౌగలించుకున్నాడు. రెండు ట్రిప్పుల డబ్బు ఇస్తా లే అన్నాడు చెవిలో. 


పావుగంట పోయాక ఇద్దరూ బట్టలు సర్దుకున్నారు. రాజేష్ లైటర్ వెలిగించి, సిగరెట్ ముట్టించాడు. ఐదు వందల నోటుని ఆమె  ఎడమ చేతి వైపు  విసిరాడు.


బయటికి వచ్చాడు. లైటర్ వెలుతురు లో, ఆమె ఎడమ చేతి మీద ఉన్న  పచ్చబొట్టు ని  అతను చూడలేదు. పచ్చబొట్టు లో అక్షరాలు, "రాజేష్". 


అతను చూస్తే కధ ఇంకోలా ఉండేది. కిడ్నాపయిన  రోజు నుండి, ఆమె అశ్రువు ఒకటి, జాతర లో వేయించుకున్న

 ఆ పచ్చ బొట్టు మీద పడుతూ ఉంటుంది! కామాటిపురా లో పెరుగుతున్న కామం లా చీకటి చిక్కబడుతోంది! 


సమాప్తం  


వీరేశ్వర రావు మూల  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

క‌వి, ర‌చ‌యిత‌. నిర్మాణ రంగంలో ఐటీ విభాగం మేనేజర్ గా ప‌నిచేసి పదవీ విరమణ తీసుకున్నారు. 1985 నుంచి రాస్తున్నారు. వివిధ పత్రికల్లో క‌థ‌లు, కవితలు, కార్టూన్‌లు, ఇంగ్లిష్‌లో కూడా వంద‌కు పైగా క‌విత‌లు వివిధ వెబ్ ప‌త్రిక‌ల్లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.నిధి చాల సుఖమా నవల సహరి డిజిటల్ మాసపత్రిక లో ప్రచురణ జరిగింది. 






bottom of page