top of page

'చెత్త' అనుభవం


'Chettha Anubhavam - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 27/10/2023

''చెత్త' అనుభవం' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


నా రక్తపోటు 120/80 ఉన్న రోజులవి. ఎంతో ఆరోగ్యంగా, హుషారుగా ఉన్న బ్యాచ్‌లర్ నేను. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయిన నేను... ఒక మంచి ప్యాకేజీ కోసం కంపెనీ మారడం జరిగింది. ఇప్పుడు ఉన్న ఇల్లు కొత్త ఆఫీస్ కు దూరం.. అందుకే కొత్త ఇల్లు కోసం వేట మొదలుపెట్టాను.


ఆన్లైన్ లో ఒక రెంట్ హౌస్ కోసం చూస్తున్నాను. అనుకోకుండా.. ఒక ఇల్లు చాలా తక్కువ రెంట్ కు కనిపించింది. నిజమా!.. కలా! అని వెంటనే కాల్ చేశాను. ఓనర్ ఫోన్ ఎత్తిన తర్వాత తెలిసింది అది నిజమే అని. హౌస్ తక్కువ రెంట్ అని, వెంటనే వెళ్ళి ఇల్లు చూసాను. చూసిన తర్వాత అర్ధమైంది.. ఇల్లు చాలా రోజులు గా ఖాళీ గా ఉండడం చేత, రెంట్ తక్కువ అని.. వెంటనే ఓకే చేసి, అడ్వాన్సు పే చేసేసాను. ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ లో అని చెప్పాడు ఓనర్. బ్యాచ్‌లర్ కి ఎక్కడైతే ఏమిటని పెద్దగా పట్టించుకోలేదు. కింద పోర్షన్ లో ఒక ఫ్యామిలీ రెంట్ కి ఉంటారు. పక్కనే, ఓనర్ ఉంటారు.


చాలా ఆనందంగా, ఫస్ట్ డే ఆఫీస్ లో జాయిన్ అయ్యాను. ఆ వీకెండ్ కొత్త ఇంటికి షిఫ్ట్ అయి, సామానులు అన్నీ నేనే సర్దేసుకున్నాను. పని వాళ్ళు అవసరం లేదు కదా! ఒక్కడికీ.


ఇప్పుడే అసలు కథ మొదలు...


నా ఇంటికి డస్ట్ బిన్ గ్రౌండ్ ఫ్లోర్ లో నే ఉంటుంది. రోజూ, ఉదయాన్నే కిందకు వెళ్లి చెత్త వెయ్యాలి. ఈ విషయం ఓనర్ ముందే చెప్పినప్పటికీ పెద్దగా ఇబ్బంది అనుకోలేదు. రోజూ, మెట్లు దిగి చెత్త కింద ఉన్న డస్ట్ బిన్ లో వేసేవాడిని. కొంత సేపటికి మున్సిపాలిటీ బండి వచ్చి చెత్త పట్టికేల్తారు. కింద రెంట్ కున్న వారిది, ఓనర్ ది డస్ట్ బిన్.. కిందనే ఉంటాయి. నాలుగు రోజులు బాగానే ఉంది, కానీ ఐదవ రోజు నుంచి చాలా కష్టం అనిపించింది. అసలే చుట్టు పక్క ఇంట్లో అందమైన అమ్మాయిలు అందరూ నన్నే చూస్తుంటారు.. నేను చెత్త వెయ్యడం. అసలే సాఫ్ట్వేర్... చాలా బాధ వేసింది.


ఇలా కాదని, ముందు రోజు రాత్రే ఎవరూ చూడని టైం లో వెళ్లి చెత్త వేసి వచ్చేవాడిని. మర్నాడు.. ఇంటి కాలింగ్ బెల్ మోగింది. ఎవరా? అని తలుపు తీసాను. చూస్తే, హౌస్ ఓనర్.


"ఏమిటి ఆనంద్! చెత్త అంతా.. రాత్రే వేసినట్టు ఉన్నావు! చూడు రాత్రి పిల్లులు చెత్త అంతటినీ మా ఇంటి ముందర ఎలా పడేసాయో! అసలే మా పక్కన ఉండే ఆంటీ కి మడి, ఆచారాలు చాలా ఎక్కువ.. వచ్చి క్లీన్ చెయ్యమంటుంది. పదవయ్యా!.. తప్పక చెత్తంతా క్లీన్ చేయాల్సి వచ్చింది.


ఇలా కుడా కాదు.. చెత్త వ్యాన్ వచ్చినప్పుడే వేస్తాను అనుకుని... మర్నాడు వ్యాన్ కోసం చూసాను.. ఈలోపు బాత్రూం అర్జెంటు. బాత్రూం లో ఉంటుండగా, చెత్త వ్యాన్ వాడు వచ్చి విజిల్ వేసాడు. ఏం చెయ్యను మరి! టవల్ కట్టుకుని చెత్త వెయ్యడానికి బయటకు వచ్చేసాను. నన్ను చూస్తే, నాకే సిగ్గేసింది.


చెత్త వాడు ఎప్పుడు వస్తాడో తెలియట్లేదు. ఒకోసారి ఆఫీస్ కు వెళ్ళిన తర్వాత వస్తున్నాడు.. చెత్తంతా ఇంట్లోనే ఉండిపోతుంది.. వారానికి ఒకసారే వేస్తే, కంపు వస్తుందని కింద ఆంటీ చెడా మడా తిట్టేస్తుంది. అందుకే, చెత్త వెయ్యడానికి ఒక పని అమ్మాయిని పెట్టుకోవాల్సి వచ్చింది. ఇలా, ఆమె రావడం చాలా మంది చూసి ఓనర్ కి కంప్లైంట్ చేసారు. అందరూ అపార్ధం చేసుకున్నారు.. తప్పదని విరమించుకున్నాను. నా ఐడియా ఫ్లొప్.


మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారికి మున్సిపాలిటీ లో తెలిసిన వాళ్ళు ఉన్నారంటే, వెళ్లి మా ఇంటికి పక్కన... చెత్త కుండీ ఏర్పాటు చేయించాను. ఇంక నా లైఫ్ హ్యాపీ అనుకున్నాను. ఎప్పుడైనా.. చెత్త వెయొచ్చు కదా! నాకు టైం ఉన్నప్పుడు. నాలుగు రోజులు నో కంప్లైంట్స్. ఒక వారం పోయాక.. మళ్ళీ ఓనర్ వచ్చి, మున్సిపాలిటీ వ్యాన్ మూడు రోజుల నుంచి రావట్లేదని.. చెత్త చేత కంపు వస్తుందని.. ఎక్కువ చెత్త నాదేనని.. అందుకే, ఈ ప్రాబ్లం నేనే సాల్వ్ చెయ్యాలని అడిగాడు. దానికి కింద ఆంటీ వంత పాడింది. బ్యాచ్‌లర్ కదా! కొంచం వేస్ట్ ఎక్కువే మరి.. ఏం చేస్తాం అనుకుని.. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని అడిగాను. వరుస హాలిడేస్ చేత.. మూడు రోజుల తర్వాత వస్తానని చెప్పారు.


మా ఓనర్ సీనియర్ సిటిజెన్ అవడం చేత, ఆయనను గట్టిగా అడగలేకపోయాను. ఆ బిల్డింగ్ లో ఉన్న ఏకైక యంగ్ మ్యాన్ నేనే కావడం చేత అందరూ నా వైపే చూసారు. ఈ పని చెయ్యడానికి అక్కడ పని వాళ్ళు కుడా ముందుకు రాలేదు. చేసేదేమీ లేక, నేనే బయట ఉన్న చెత్త తీసుకుని వెళ్లి సందు చివర కుండీ లో వేయాల్సి వచ్చింది.


ఇదంతా... రెంట్ తక్కువని భరించాను. నెలకు ఒక నాలుగు వేలు మిగిలితే.. గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ కి వస్తాయని చిన్ని ఆశ. ఇలా, చాలా సార్లు జరిగిన తర్వాత, కొంచం తల తిరుగుతుందని డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. చెక్ చేసి బ్లడ్ ప్రెషర్ ఉందని అన్నారు. మెడిటేషన్, యోగ స్టార్ట్ చేసి కూల్ గా ఉండాలని చెప్పారు.. లేకపోతే మందులు వాడాల్సి వస్తుందని చెప్పారు. సాఫ్ట్వేర్ జాబ్ వల్ల ఎలాగో టెన్షన్ తప్పదు. ఈ టెన్షన్ తగ్గించుకోకపోతే కష్టం అనిపించింది. పైగా, ఎలా కాదన్నా, మందులకి నెలకు ఎక్కువే అవుతాయి అని కుడా అర్ధమైంది. ఇల్లు ఖాళీ చెయ్యాలని డిసైడ్ చేసి, వేరే ఇంటికి నాలుగు వేలు ఎక్కువైనా చెత్త ప్రాబ్లం లేకుండా చూసుకున్నాను.


******


తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:

Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు తాత మోహనకృష్ణ


33 views0 comments

Comments


bottom of page