top of page

చెత్త బుట్టలో చరిత్ర


'Chettha Buttalo Charithra' New Telugu Story

Written By Pitta Gopi

'చెత్త బుట్టలో చరిత్ర' తెలుగు కథ

రచన: పిట్ట గోపి

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


రాము పట్టు బట్టి మరీ పోలీసు ఉద్యోగం సాదించి ఐదేళ్లు అయినా..


తన కంటే వెనుక వచ్చిన వాళ్ళు పదోన్నతులు పొందారు కానీ అతను మాత్రం కానిస్టేబుల్ గానే కొనసాగుతున్నాడు.


బహుశా నిజాయితీ గా ఉండటమే కారణం కావచ్చు.

పొలిటిషియన్ తో సంబంధాలు ఉన్న వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుకోవటంతో సస్పెండ్ అయి ఇంటికి వెళ్ళాడు రాము.


ఇంట్లో తన ఇద్దరు కవల కుమారులు అనారోగ్యంతో ప్రాణాలు విడవగా భార్య రాధ స్పృహ తప్పి పడి ఉంది.


రాము కి విషయం అర్థం అయి ఎంతో శోకంతో భార్యకు సవర్యలు చేసి ఓదార్చాడు. లోలోపల కుమిలిపోతు చేరొకరు తమ చేతులతో విగతజీవులైన పిల్లలను ఎత్తుకొని స్మశానవాటికకు వెళ్లి, పూడ్చి పెట్టి తిరిగి వస్తుండగా.. ముళ్ళ పొదల్లో పసిబిడ్డ అరుపు వినిపించింది రాముకు.


దుఃఖం లో ఉన్న రాము తన పిల్లల అరుపు గుర్తుకు వచ్చినట్లు బావించుకుని బాదపడుతూ ముందుకెళ్ళగా మరలా ఏడుపు వినిపిస్తుంది.


భార్యభర్తలు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని కవలలను కప్పిన ప్రదేశానికి వెళ్తారు.


తర్వాత ఏడుపు శబ్దం వినిపించిన వైపు వెళ్ళి చూడగా అప్పుడే పుట్టిన ఒక ఆడబిడ్డ ముళ్ళ తుప్పల్లో ఏడుస్తూ కనపడింది.


క్షణం ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్ళి రక్షించారు రాము దంపతులు.


" ఏవండీ! దేవుడే మగపిల్లలను కాదని ఆడపిల్ల ని మనకిచ్చాడు. పెంచుకుందామండీ " కొంగుతో కన్నీరు తుడుచుకుని అంటుంది.


"నాకూ అదే కోరిక " అన్నాడు రాము.


తల్లి పేరు పోలిన పేరే రాధిక అని పెట్టి పెంచారు.


పదేళ్ల వయసుకి వచ్చిన రాధిక ఒక రోజు పాఠశాల లో తన తోటి విద్యార్థి ఐన ఒక అబ్బాయిని కొట్టడంతో వాళ్ళ తండ్రి వచ్చి రాధికను వారిస్తాడు.


"ఏమే.. ఆడపిల్లవై ఉండి మగాడి మీద చేయి వేస్తావా".. గద్దించి అడుగుతాడు అతడు.


"తప్పు చేస్తే ఆడపిల్ల మగాడిని కొట్టకూడదని ఎక్కడైనా రాసి ఉందా? అయినా ఆడదాన్ని మగాడిని వేరేగా చూస్తున్నావు. నీ కూతుర్ని, కొడుకుని ఒకేలా పెంచటం లేదా.. అసలు మీ అబ్బాయి ని పాఠశాల కు పంపిస్తుంది ఆడపిల్లను ఏడిపించమనా".. దైర్యంగా అంటుంది రాధిక.


ఆ మాటలకు ఫిదా అయిన ఆ వ్యక్తి "భవిష్యత్ లో ఐపీఎస్ అవుతావని" అన్నాడు.


ఆ మాటలు దూరం నుండి గమనించిన తండ్రి రాము ఎంతోగానో ఆనందించాడు.


దేవుడు రాముకి జరిగిన అన్యాయానికి కరిగాడేమో..


రాధిక ఐపీఎస్ సాధించింది.


తండ్రి తన గతాన్ని రాధికకు తెలియనివ్వలేదు.తండ్రి నుండి సంక్రమించిన ధైర్యం, నీతి నిజాయితీ, మొక్కవోని పట్టుదలతో పోలిసు శాఖలో దూసుకుపోయి ఆ శాఖని నిజాయితీగా తయారు చేసింది.


ఎందరో అవనీతిపరులను ఎదిరించింది. ఆడపిల్లల అక్రమ రవాణా ని అరికట్టి మగవాళ్ళకి ధీటుగా ఉద్యోగం చేసింది.


ఈ క్రమంలో చిన్నగాయంతో ఆసుపత్రిలో చేరింది. గర్భిణిగా ఉన్న ఒక యువతి తన భర్త ని బతిమాలటం, భర్త ఆమెను తోసేయటం చూసింది.


"ఏమైంది.. ఏంటి గొడవ?" ఆరాతీసింది


"ఆడబిడ్డ పుట్టబోతుందని ఇంటికి రావద్దు అంటున్నాడండి" చెప్పిందామె.


"ఆడబిడ్డ అని మీకు ఎలా తెలిసింది.. " ప్రశ్నిస్తూ వారి వద్ద సర్టిఫికెట్ లు తీసుకుంది రాధిక.


లింంగనిర్దారణ పరీక్షలు చేసి ఉండటం గమనించి వారికి నచ్చజెప్పి పంపి, ఆసుపత్రి పై చర్యలకు రంగం సిద్దం చేసి విజయం సాదించింది.


ఈ క్రమంలో రాధిక పని తీరుకు సత్కారాలు, పతాకాలు వచ్చాయి. అయినా అవి ఆమెకు కొత్త కాదు..


ఇంత ఎత్తులో ఉన్నా.. రాధిక ఇంట్లో మాత్రం తానింక చిన్న పిల్లలాగానే అల్లరి చేస్తూ, తల్లిదండ్రులను ఆటపట్టిస్తూ.. సింపుల్ గా ఉంటుంది.


ఒక రోజు తన కింద పనిచేసే వ్యక్తి కి రోడ్డు ప్రమాదం జరిగిందని ఆసుపత్రికి వెళ్ళి తిరిగి వస్తుండగా..


పేషెంట్ కి ఎక్కించాల్సిన రక్తం బాటిల్ పొరపాటున కింద పడేసిన నర్స్ ని డాక్టర్ తిడుతుండగా చూసి తానే రక్తం ఇచ్చి వెళ్ళింది.


ఆ డాక్టర్ రక్తం బాటిల్ తీసుకెళ్ళిన పేషెంట్ విమల కూడా రాధికలా ఉండటం చూసి షాక్ అయి విషయం విమల కి చెప్పింది.


‘తాము గతంలో ఆడబిడ్డ పుట్టిందని చెత్తలో పడేశా’మని చెప్పగా


"ఇప్పుడు ఆమె ఐపీఎస్. కోర్టులో కేసు వేస్తే మీ కూతురు అని తేలిపోతుంది" అని సలహ ఇచ్చింది డాక్టర్.


అనుకున్నట్లుగా పిటీషన్ వేశారు రాధిక సొంత తల్లిదండ్రులు.


దీంతో విషయం తెలిసి ఇంటికి వెళ్ళి రాముని నిలదీసింది రాధిక.


తన గతాన్ని పూసగుచ్చినట్లు చెప్పాడు రాము.


అనంతరం మౌనంగా వెళ్ళిపోయింది రాధిక. డి ఎన్ ఏ పరీక్షలు చేసేవరకు రాధికను వేరేగా ఉంచాలని ఆదేశాలు వచ్చాయి.


కోర్టు నుంచి బయటకు వెళ్తున్న రాధిక సొంంత తల్లిదండ్రులతో కొద్ది సేపు మాట్లాడినా..

రాము, రాధల వైపు కన్నెత్తి చూడలేదు.


రాధ ని ఓదార్చడం తప్ప రాము ఏమీ చేయలేకపోయాడు.


డి ఎన్ ఏ పరీక్షలు అనంతరం కోర్టులో


విమల దంపతులే సొంత తల్లిదండ్రులు అని, రాధిక విమలకే పుట్టిందని నిర్దారణ జరిగింది.


అయితే..


"రాధిక ఇప్పుడు చిన్న పిల్లేం కాదు కాబట్టి ఎవరి వద్ద ఉండాలనే విషయం ఆమెకే వదిలేస్తున్నాం కానీ.. ఆమె నిర్ణయం కోర్టు వద్దనే తేలాలి " అని ఆదేశాలు ఇచ్చింది కోర్టు.


సొంత తల్లిదండ్రులు అంటే ఎవరికైనా ఇష్టమే కదా.. ఇంకేం.. విమల దంపతుల వద్దకే రాధిక వెళ్తుందని కోర్టు లో అందరూ ఊహించుకున్నారు.


విమల దంపతులు కూడా సంబరపడిపోయారు.


"యువరానార్.. నన్ను కన్న తల్లిదండ్రులు కంటే.. పెంచి పెద్ద చేసి ఈ స్థాయిలో నిలబెట్టిన తల్లిదండ్రుల వద్దే నేను ఉంటాను" ఆంటుంది.


అందరూ షాక్ అవుతారు.

రాము రాధ లు ఆనందం పట్టలేకపోతారు.


"అవును యువరానార్..

ఆడబిడ్డ పుట్టిందని, ప్రయోజనం ఉండదని, పెంచటం వృధా అని ముళ్ళపొదల్లో కనికరం లేకుండా పడేసి, ఇప్పుడు ప్రయోజకురాలినని నన్ను దక్కించుకోవాలని చూసే ఇలాంటి వారి వద్దకు నేను చేరితే సమాజానికి తప్పుడు సంకేతం పంపినట్లే అవుతుం”దని చెప్పి రాము రాధల వద్దకు వెళ్ళి పాదాభివందనం చేసి వారి వెంట వెళ్ళిపోయింది రాధిక.


అనంతరం అక్రమంగా సస్పెన్షన్ కి గురైన తండ్రి విషయంలో కోర్టులో పోరాడి తండ్రి మరో పదేళ్లు విధులు నిర్వహించేలా చేసింది.


కొద్దీ రోజుల కే గణతంత్ర వేడుకల్లో తండ్రి రాధిక కు సెల్యూట్ చేస్తాడు. రాధిక తన తల పై టోపిని తండ్రి కి పెట్టి తండ్రి ఎదలో కన్నీరు పెట్టుకుని వాలిపోతుంది.


అక్కడ ఉన్న తండ్రి తోటి సిబ్బంది, అదికారులు సైతం రాధిక గొప్పతనం గుర్తించి, ఆభినందనలతో కన్నీరు కారుస్తూ చప్పట్లు కొట్టసాగారు.

శుభం


పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం :

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం

51 views0 comments

コメント


bottom of page