top of page
Original.png

చెట్టు చెప్పిన సత్యాలు

Updated: Jan 21, 2025

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ChettuCheppinaSathyalu, #చెట్టుచెప్పినసత్యాలు


Chettu Cheppina Sathyalu - New Telugu Poem Written By - Gadwala Somanna

Published In manatelugukathalu.com On 05/01/2025

చెట్టు చెప్పిన సత్యాలుతెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


కోపంతో నష్టము

శాంతంతో లాభము

ఏది కావాలో!

నీదే నిర్ణయము!


అసూయ పెనుముప్పు

విడిచిపెడితే ఒప్పు

ఇకనైనా కలుగదా!

బ్రతుకులో కనువిప్పు


మానసిక ఒత్తిడి

రేపుతుంది అలజడి

తగ్గించుకో! మేలు

లేకున్న అది తేలు


చెడ్డవారి స్నేహము

కలుగజేయు కష్టము

సజ్జనుల సాంగత్యము

ఎంతైనా అగత్యము


కన్నవారి సేవలు

వారు చూపు ప్రేమలు

ఎంతో విలువైనవి

చూడ తీపి గురుతులు


మహిని తోబుట్టువులు

వెలలేని బహుమతులు

ఇల పోగొట్టుకోకు!

ఈ సత్యం మరువకు!


-గద్వాల సోమన్న



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page