చిన్న కథా - చింతలు తీర్చే కథ
- Eruvanti Naga Durga Madhuri Devi

- Jan 16
- 3 min read

Chinna Katha Chinthalu Teerche Katha - New Telugu Story Written By Nagini
Published In manatelugukathalu.com On 16/01/2026
చిన్న కథా - చింతలు తీర్చే కథ - తెలుగు కథ
రచన: నాగిని
"అభినందనలు శ్రీ ముఖీ!", హాస్పిటల్ లో 3 రోజుల క్రితం బాబును ప్రసవించి ఉన్న శ్రీముఖిని చూడటానికి వచ్చారు ఆమె కొలీగ్స్ అందరూ, పళ్ళూ, బొకేలూ తీసుకుని.
ఉషారుగా నవ్వుతున్న శ్రీముఖిని చూసి, "నార్మల్ డెలివరీ అంట కదా, అందుకే ఈ ఉత్సాహం", అంటూ ఆనందంగా పక్కన నిల్చుంది ఆమె స్నేహితురాలు మైత్రేయి.
"అయితే రేపేనా డిశ్ఛార్జ్", శ్రీముఖికి మాట్లాడే అవకాశమే ఇవ్వట్లేదన్న విషయం కూడా గుర్తింౘకుండా, గాంగ్ లో మరో ఫ్రెండ్ అందుకుంది, ఉత్సాహంగా.
"ఆ ఆ రేపే డిశ్ఛార్జ్, కానీ, శ్రీ ముఖి ఇటు తన తల్లి గారి ఇంటికీ, బాబేమో ఏ... ", అంటూ, ఆ పై పూర్తి చేయలేక, ఆగి పోయింది, మనసు కఠినం చేసుకోలేని సున్నిత మనస్కురాలు, శ్రీ ముఖి వయస్కురాలూ శ్రీ హిత.
అందరూ ఒక్క సారిగా అటు చూశారు, "ఎవరా ఆ మాట అందీ", అసలింతకీ 'విషయం' ఏఁవిటా అంటూ ఒకింత అయోమయంగానూ.
శ్రీ ముఖి మొహంలో కూడా అదే కన్ఫ్యూౙన్ కనపడే సరికి, తననేమడగాలో కూడా అర్థం కాక, అంతా మౌనంగా ఉండి పోయారు. ఆమె పేరు కూడా తెలియదు శ్రీ ముఖికి, తల నెమ్మదిగా త్రిప్పి మాట వచ్చిన వైపుకు ఒక సారి చూసింది. అంతలోనే విన్న మాటల వలన కలిగిన వ్యథకు తల పోటుగా అనిపింౘటంతో కనులు మూసుకుంది.
ఐ.సి.యు నుంచీ వచ్చేక "షేర్డ్ రూం" తీసుకున్న శ్రీ ముఖికి ఓ నిముషం తరువాత అర్థం అయింది, ఆ వచ్చిన ఆమె పక్క బెడ్ మీద ఉన్న పేషెంట్ తాలూకా వ్యక్తి అని. ఆ పేషెంట్ అమృతకి కూడా డెలివరీనే, పాప పుట్టింది, అని ఈ 3 రోజులుగా పక్క వారి మాటలను బట్టీ అర్థమైంది.
ఇంతలో శ్రీహితనే కలుగ చేసుకుంది. "మా ఇంట పుట్టింది ఆడపిల్లనే, కాబట్టీ మాకేమీ దిగులు లేదు, మీ ఫ్రెండ్ కే పాపం, ఇప్పటి నుంచీనే ఫైనాన్సెస్ ని ప్లాన్ చేసుకోవాలి, లేక పోతే రేపు పెద్దయ్యాక కొడుకు కొశ్చన్ వేస్తాడు, 'మమ్మల్నడిగి కన్నావా, మా కోసం ఖర్చు పెట్టలేదు నువ్వూ, నీ వృద్ధాప్యంలో నిన్ను లోటు లేకుండా చూసుకోవటానికోసమని నాకు రావలసిన సంపాదన కోసం నన్నుు ౘదివించావు, అంతే కానీ ప్రేమతో కాదు", అంటూ మాటలు పేలనూ వచ్చు, అలాగే మీ ఫ్రెండ్ మరొక సంతానాన్ని కనటానికీ వీలు లేదు, ఎందుచేతనంటే కోడలు వచ్చే వేళకు ఆమెకు బాధ్యతలూ ఉండకూడదంటే తోబుట్టువులూ, బాదరబందీ ఉండకూడదు, "మా అమ్మ నన్ను శ్రమపడి పెంచిందీ" అని ఈమె కొడుకు అతని భార్య వద్ద నసగకూడదంటే ఇప్పటి నుంచీనే ఒకరికొకరు... ఈ పై ఇక పూర్తి చేయలేక పోయింది, శ్రీహిత.
చిత్తరువులలా అక్కడ అందరూ నిలబడి పోయి వింటున్నారు, అందరికీ ఆ వాగ్బాణాలు అంతర్లీనంగా ఎక్కడో తగలటంతో!
ఈ లోపు మందులు తేవటానికని బయటకు వెళ్ళిన శ్రీ ముఖి తల్లి లోపలకు వస్తూ, శ్రీ హితను చూసి అనుకుంది, తాము ఇంతకుముందు 'బంధుగణం ఎక్కువ' అంటూ వదులుకొన్న సంబంధం తాలూకా వారి చుట్టాలమ్మాయని, పెళ్ళి మాటల కోసమని తాము ఆ సంబంధం వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె కూడా అక్కడ ఉందనీ గుర్తు పట్టింది. తన గారాల పట్టి శ్రీముఖి ఆమెను చూడనందుకే గుర్తు పట్టలేదని కాస్త స్థిమితపడింది, ఈ లోపు ఇక్కడ పేలిన మాటల తూటాల సంగతి తెలియక! ఆ తూటాలైతే ఎక్కడ తగలాలో అక్కడ తగిలాయి కద! శ్రీహిత మాత్రం శ్రీ ముఖి తల్లి అంతక్రితం బయటకు ఆ వార్డు నుంచీ వెళ్ళటం చూసింది, లోపల ఉన్న ఆమెకు ఈమె ఏమవుతుందో గ్రహించింది, అందుకే ఆ నాలుగు మాటలతోటీ కడిగేసింది శ్రీ ముఖిని!
అటు శ్రీ హిత కూడా తను వచ్చిన పని పూర్తి అయి అక్కడి నుంచీ బయట పడింది. వచ్చింది ఒక పనికైనా అనుకోకుండా మరో పని ౙరిగింది!
"నాణేనికి రెండవ వైపున" అన్నట్లూ, ఇటు తన అత్తగారి వంటి వారేమో ఉద్యోగం చేస్తున్న కోడలి నుంచీ నెల జీతం రాబట్టుకుంటూనే, పెళ్ళికి ముందర సంపాదనా, ఇంకా కట్నం, లాంఛనాలూ అంటూ లాక్కోవటమూ, కొడుకూ-కోడలు మధ్యన తంపులు పెట్టటమూ, 'కోడలూ తన కూతురు వంటిదే' అనో, 'తానూ ఒకప్పటి కోడలినే' అనో ఆలోచింౘక, నానా రభసా చేస్తూ, గొడ్డు చాకిరీలూ చేయిస్తూ, కోడలికి కాకపోయినా, మనవలకైనా ఏనాడూ కడుపు నిండా తిండైనా పెట్టకుండా, కనీసం మమత లేకుండా అనుబంధాలు తెంచేస్తుంటే, మనవలకు తన కొడుకులతోనూ అనుబంధాలు తెంచివేసే అత్త, మామలున్నంత కాలం ఇదుగో, ఆడపిల్లలు ఇలాగే తయారవుతారు! ",
'ముందు ముందు తరాలు ఇంకెలా ఉంటుందో సమాజం!' అనుకుంటూ ఇంటి దారి పట్టింది, ఆలస్యమైతే అత్తగారు చేసే రభస గుర్తుకు వచ్చి!
సమాప్తం
నాగిని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :
63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నా పేరు: ఇరువంటి నాగ దుర్గా మాధురీ దేవి
కలము పేరు: నాగిని
ఊరు: హైదరాబాద్
వృత్తి: సాఫ్ట్వేర్ రంగము
పరిచయ వాక్యాలు: వృత్తి ఇష్టమైన సాఫ్ట్వేర్ రంగము, ప్రవృత్తి ప్రాణప్రదమైన పద్య సాహిత్యము, ఇతర ప్రక్రియలలైన కథలు, నానీలు, కవితలు, పరిమిత సంఖ్యలో గౙల్స్ రచనలు.




Comments