top of page
Original.png

బిర్యానీ మాస్టర్


షిరిడీలోని బిర్యానీ హోటల్‌లో ఇరవై ఏళ్ల తర్వాత రణదీప్‌ను కలిసిన ముబారక్

Biryani Master - Telugu Inspirational Story | Harish Babu Pondugula

బిర్యానీ మాస్టర్... తెలుగు ప్రేరణాత్మక కథ | హరీష్ బాబు పొందుగుల

Published in manatelugukathalu.com on 21/08/2026


జీవితంలో మనం చేసే ప్రతి సహాయం వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు. కానీ ఒక మనిషికి సరైన సమయంలో ఇచ్చే అవకాశం, విలువైన సలహా అతని భవిష్యత్తునే మార్చగలదు.

“బిర్యానీ మాస్టర్...” అలాంటి మానవీయత, కృతజ్ఞత, పట్టుదల, జీవితంలో ఎదగాలనే సంకల్పాన్ని చాటిచెప్పే స్ఫూర్తిదాయక తెలుగు కథ.

మన జీవితంలో ఎవరికైనా ఇచ్చే చిన్న అవకాశం, వారికి గొప్ప భవిష్యత్తుకు తలుపు కావచ్చు. మనం చేసిన మంచిని వారు మరిచిపోకపోవచ్చు—అదే ఈ కథ చెప్పే అందమైన సందేశం.


చాలా దూరం షిరిడీలో తన ఇద్దరు కూతుళ్లు, భార్యతో కారులో ప్రయాణం చేస్తున్న రణదీప్, దగ్గర్లో ఏదైనా హోటల్ ఉంటుందేమోనని రోడ్డుకు అటు వైపు చాలాసేపటి నుంచి చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు.


వెళ్లగా వెళ్లగా కుడివైపున ఒక హోటల్ కనిపించింది. బాగా క్లాస్‌గానే ఉంది. యూటర్న్ తీసుకుని వెళ్లి తన కార్ పార్క్ చేసి లోపలికి వెళ్లాడు కుటుంబంతో పాటు. అక్కడ మంచి బిర్యానీ సువాసన వస్తోంది. ఆహా అనుకుని బిర్యానీనే ఆర్డర్ చేశాడు. కొద్దిసేపట్లోనే ఆర్డర్ సర్వ్ చేశారు.


బిర్యానీ తీసుకుని స్పూన్‌తో నోట్లో వేసుకోగానే మంచి టేస్ట్ అనిపించింది.... కానీ ఈ టేస్ట్ ఇంతకు ముందు ఎక్కడో తిన్నట్టు గుర్తు.... ఎక్కడబ్బా ఆలోచిస్తున్నాడు.... రణదీప్. సరే ఎక్కడైతే ఏమిలే అని బిర్యానీ కంప్లీట్ చేశాడు. అందరికీ బిర్యానీ బాగా నచ్చింది... బిల్లు కట్టడానికి అని కౌంటర్ దగ్గరికి వెళ్లినప్పుడు అక్కడ కనిపించాడు ఒక వ్యక్తి.


ఇతడిని నేను ఎప్పుడో చూసినట్టుగా అనిపిస్తోంది అనుకుంటూ ఉండగా అతనే— "సార్, నమస్తే! బాగున్నారా?" అని పలకరించాడు.. అప్పుడు గుర్తు పట్టాడు. ఇతని పేరు ముబారక్ కదూ.... "నువ్వు ఏంటి ఇక్కడ షిరిడీలో?" అంటే అతను చెప్పుకొచ్చాడు.


20 ఏళ్ల క్రితం మాట. రణదీప్ ఒకరోజు ఒక హోటల్లో టీ తాగి బిల్లు కడుతుండగా అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు.... "సార్, ఏదైనా పని ఇవ్వండి సార్.. సార్" అని హోటల్ యజమానిని అడుగుతున్నాడు.


"పని లేదు, ఏం లేదు" అన్నాడు హోటల్ ఓనర్.


అయినా సరే "సార్ ప్లీజ్ సార్, పని ఇవ్వండి... ప్లీజ్ పని ఇవ్వండి సార్" అని బ్రతిమాలుతున్నాడు.


రణదీప్ బయటికి వచ్చాక ఆ వ్యక్తి ప్రాబ్లమ్ ఏంటో కనుక్కున్నాడు. అప్పుడు అతను తన కథ చెప్పుకుంటూ వచ్చాడు.


"నా పేరు ముబారక్ సార్. నేను బాగా బిర్యానీ చేస్తాను సార్. నాకు నలుగురు పిల్లలు. అనుకోకుండా నేను పని చేసిన హోటల్ మూసేశారు... నేను నా కుటుంబంతో రోడ్డు మీద పడ్డాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు" అన్నాడు.


దానికి రణదీప్ "సరే, నేను ఒక చిన్న హోటల్ లాంటిది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. కానీ అందులో కేవలం బిర్యానీ మాత్రమే అందుబాటులో పెడదామని అనుకుంటున్నాను.. నువ్వు మంచిగా, టేస్టీగా బిర్యానీ చేస్తాను అంటే తప్పకుండా నీకే ఆ హోటల్ అప్పగిస్తాను" అని చెప్పాడు.


అయితే ఒక చిన్న షరతు పెట్టాడు. ఏంటంటే... ఒక వారం రోజుల పాటు తన బిర్యానీ రుచి చూసి, అద్భుతం అనిపించాక మాత్రమే తను ఆ బిర్యానీ సెంటర్ ఓపెన్ చేస్తాను అని చెప్పాడు.


అలా ప్రతిరోజూ రణదీప్ వచ్చి ఆ హోటల్లో బిర్యానీ టేస్ట్ చేసేవాడు.... ఇలా కాదు ఉప్పు తగ్గించు, కారం పెంచు, మసాలా తగ్గించు, వాటర్ కొంచెం పెంచు/తగ్గించు, ఆయిల్ తగ్గించు... ఇలాంటి రకరకాల సలహాలు ఇస్తూ ఉండేవాడు.... ఒక వారం రోజుల్లో చూసిన ముబారక్ విసుగెత్తి పోయి, రణదీప్‌ను వదిలేసి వెళ్లిపోయాడు.


ఆరోజు వెళ్లాక ముబారక్ మళ్లీ ఇక్కడ... ఇవాళ కనిపించాడు రణదీప్‌కి...

"మీ దగ్గర నుంచి వెళ్లిపోయిన తరువాత చాలా చాలా చోట్ల తిరిగాను. చివరికి ఒక చెట్టు కింద నేను ఒక బండి పెట్టుకుని బిర్యానీ స్టాల్ ఏర్పాటు చేశాను. మీరు చెప్పిన సలహాలు ఎలా చెప్పారో అలాగే బిర్యానీ తయారు చేశాను... అది బాగా క్లిక్ అయింది. దాంతో నా బిర్యానీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది.. అలా వచ్చిన డబ్బుతో... తర్వాత ఒక ఈ హోటల్ పెట్టుకుని బాగానే డబ్బు సంపాదించాను... మీరు గనుక ఆ రోజు నాకు ఆ సలహాలు ఇచ్చి ఉండకపోతే, నేను ఎప్పటికీ అలా ఏదో ఒక చోట పనిచేస్తూ ఉండేవాడినేమో" అన్నాడు.


"చాలా మంచిది. నిన్ను కలుసుకున్నందుకు చాలా సంతోషం. ఇదిగో మా బిల్లు" అన్నాడు రణదీప్.


"మీ దగ్గర నేను బిర్యానీ నేర్చుకుని, మీ దగ్గర డబ్బులు తీసుకుంటానా సార్... ఇంకో నాలుగు పార్సళ్లు తీసుకోండి సార్... మీరు ఇంటికి వెళ్లే వరకూ ఇది ఉపయోగపడుతుంది" అని కార్ వరకు వచ్చి దిగబెట్టి వెళ్లాడు ముబారక్.

అది కథ...


✍️ హరీష్


హరీష్ బాబు పొందుగుల గారి కొన్ని ఇతర రచనలు:



హరీష్ బాబు పొందుగుల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



హరీష్ బాబు పొందుగుల

పరిచయం: హరీష్ బాబు పొందుగుల


ఆయన పుట్టింది పెరిగింది హైదరాబాదు. కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హరీష్ గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఆయన తన వృత్తే కాకుండా చిత్రలేఖనంలోనూ మరియు కథలు, నవలా సాహిత్యం మీద ఎంతో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. యండమూరి గారు, మరియు మాలతీ చందూర్ గారి రచనలని ఇష్టపడతారు. ఆ ఆసక్తితోనే రెండు కథల సంపుటాల్ని అమెజాన్లో "షార్ట్ స్టోరీస్ ఆన్ పాజిటివ్ థింకింగ్" మరియు "నువ్వు అనుకుంటే ఏదయినా సాధ్యమే" పేరిట పబ్లిష్ చేసి ఉన్నారు. కథారచనే కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఈయన నెటిజన్లకి సుపరిచితులు.   వ్రాసినవి కొన్ని కథలే అయినప్పటికీ కథా రచన మీద ఆసక్తితో ఇంకా మరెన్నో కథలు వ్రాసి మెప్పించాలని అభిలాష . 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page