top of page

చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో


'Chinnari Snehama Chirunama Thisuko' New Telugu Story Written By Anjani Gayathri

'చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో' తెలుగు కథ

రచన : అంజనీగాయత్రి


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


లోకంలో స్నేహానికి మించిన బంధం మరొకటి లేదు. అరమరికలు లేని స్నేహం ఎన్ని కష్టాలు తోడైనా విడిపోదు. కష్టాలకు ఎదురొడ్డి ఒకరి కోసం మరొకరు అండగా నిలబడే వాళ్ళు, కష్టంలో తమ స్నేహ హస్తం అందిస్తూ మిత్రులను ఆదుకునే వాళ్లే అసలైన స్నేహితులు. "స్నేహంతో హితం కోరుకునే వాళ్ళు స్నేహితులు" కాబట్టి స్నేహితులు అనే పదానికి అసలు సిసలైన నిర్వచనం ఆపద లో అండగా నిలిచే స్నేహమే నిజమైన స్నేహం. ఇప్పుడు చిన్ననాటి స్నేహితులు పెద్దయ్యాక కూడా ఎలా ఉన్నారో ఒక చిన్న కథ చెప్పుకుందాం. మురళి, రాధ, ప్రణయ్, లహరి ప్రైమరీ క్లాస్ నుండి హై స్కూల్ వరకు ఒకే స్కూల్ లో చదువుతూ ప్రణయ్, రాధ ఒకే వీధిలో పక్క పక్క ఇంట్లో ఉంటారు. మురళి మరో వీధిలో ఉంటాడు. లహరి వెనక వీధిలో ఉంటుంది. స్కూల్ కి వెళ్లేటప్పుడు అంతా కలిసే నడిచి వెళ్తారు.. మధ్య తరగతి కుటుంబాలు కావడం నలుగురు తల్లిదండ్రులకి స్కూల్ బస్సులు ఫీజులు కట్టలేక, ఆటో వాళ్లడిగే ఎక్కువ మొత్తం చెల్లించలేక ఒక అరగంట ముందే బయలుదేరి ఎపుడూ నడిచి వెళ్లేవారు. ప్రణయ్, మురళి మగ పిల్లలు కావడంచేత చెట్లెక్కి మామిడి కాయలు, జామకాయలు కోయడం, రాధ, లహరి ఉప్పుకారం తేవడం, నలుగురు పంచుకు తినడం చేస్తుండేవారు. ఒకసారి చెట్టునుండి కాయలు కోస్తూ ఉండటం చూసి చెట్టు యజమానులు గొడవలకి దిగటం, స్కూల్ కి దగ్గర్లో తోటలోని చెట్లు అవడం మూలంగా వీళ్ళ గురించి స్కూల్ టీచర్లకు కంప్లైంట్ చేస్తే, క్లాస్ టీచర్స్, ప్రిన్సిపాల్ కలిసి పేరెంట్స్ ని పిలిచి మాట్లాడటం, ఇంటికి వెళ్ళాక తల్లిదండ్రులుచే తిట్లు, దెబ్బలు తినడం జరిగేవి. స్కూల్ బ్రేక్ లో తినడానికి ఒకరు తెచ్చిన తినుబండారాలు తక్కువగా ఉన్నా కానీ నలుగురు తినే విధంగా కాకిఎంగిలి చేసుకుని తినేవారు.. నలుగురు ప్రాణప్రదంగా మసలు కొంటూనే ప్రైమరీ క్లాస్ నుండి హై స్కూల్ కి వచ్చారు. ప్రైమరీ క్లాస్ లో ఉండగా భోజనానికి కూడా ఇంటికి నడిచి వచ్చేవారు. భోంచేసిన తర్వాత మళ్లీ ఆడుతూ పాడుతూ నడిచి వెళ్లేవారు. హై స్కూల్ కి రావడం తోటే నలుగురు తిని వెళ్లడానికి టైం సరిపోదని స్కూలు కొంచెం దూరం కూడా అని క్యారేజీలు తీసుకెళ్లేవారు. లంచ్ బ్రేక్ లో అన్నం తిన్నాక స్కూల్ దగ్గరలోనే ఉన్న చిల్లరకొట్టు దగ్గరికి వెళ్లి తాటి తాండ్ర, మామిడి తాండ్ర, జంతికలు, చెకోడీలు, ఎండు బఠానీలు కొనుక్కుతినేవారు. ఆనాడు పల్లెటూరులో పరిస్థితులు అలాగే ఉండేవి. మురళి మ్యాథ్స్ బాగా చేసేవాడు. ప్రణయ్ కి ఇంగ్లీష్ గ్రామర్ అంటే ఇష్టం, ఇంగ్లీష్ లో మంచి మార్కులు వచ్చేవి. లహరి, రాధ సైన్సు, సోషల్, తెలుగు బాగా చదివేవారు.. ఇంగ్లీషులో డౌట్లు మిగతా ముగ్గురికి ప్రణయ్ చెప్పేవాడు. మ్యాథ్స్ లో డౌట్ లన్ని మురళి వివరించేవాడు. సెలవు రోజు కూడా నలుగురు కలిసి ఒక చోట చదువుకునేవారు. ఒక రోజు ఒక ఇంట్లో మరొక రోజు మరొక ఇంట్లో, అలా నలుగురు ఇళ్లలో కలిసి చదువుకునేవారు. వాళ్ల స్నేహం విడదీయరానిదిగా టెన్త్ క్లాస్ వరకు కొనసాగింది. ఇంటర్మీడియట్ లో కి వచ్చాక తండ్రులకు ఉద్యోగ బదిలీ రీత్యా ప్రణయ్, రాధ వేరే ఊర్లు వెళ్ళిపోయారు. మురళి, లహరి ఓకే ఊర్లో ఉన్నారు. మురళి గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుకేషన్ చేశాడు. లహరి గ్రాడ్యుయేషన్ తర్వాత పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయింది. ఒకసారి పాత విద్యార్థుల యూనియన్ అందరూ స్కూల్ దగ్గర కలుసుకోవాలని నిర్ణయించుకుని, ఒక తేదీని నిర్ణయించుకుని కలిసారు. అందరూకూడా వారు ఇప్పుడు ఏమేమిఉద్యోగాలు చేస్తున్నారు, భార్య పిల్లలు ఎంతమంది, పెళ్లి కాని వారు కాలేదని ఒకరి తర్వాత ఒకరు వివరాలు చెప్పుకుంటూ సరదాగా గడిపిన తర్వాత, లంచ్ చేసి, అంత్యాక్షరి లాంటి ఆటపాటలతో బిజీగా గడిపేసి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా, చిన్నతనం నాటి రోజులు గుర్తు తెచ్చుకుంటూ, వారు చేసిన చిలిపి పనులు నెమరువేసుకుంటూ, ఫోన్ నెంబర్లు తీసుకుని, వాట్సాప్ లో గ్రూప్ ఏర్పాటు చేసుకొని, గ్రూపులో అందరూ కలిసేలా, నెంబర్లు తీసుకున్నారు, ఆరోజు మర్చిపోలేని రోజు అని చెప్పుకుంటూ, ఆనందంగా వీడ్కోలు చెప్పుకున్నారు. సంవత్సరానికి ఒకసారి వారు చదివిన స్కూల్ దగ్గర కలుస్తూ, వారికి విద్యాభ్యాసం నేర్పిన గురువులను కలుసుకుంటూ, క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ స్నేహానికన్నా మిన్న లోకానేమీ లేదని తెలియజేస్తూ, “చిన్నారి స్నేహమా, చిరునామా తీసుకో" అని ఒకరికొకరు వారి చిరునామాలు తెలుపుకున్నారు. ఆనందంగా సాగిపోయారు. స్నేహానికి కులమత బేధం లేదు. అంతా ఒక్కటే. 🌹🌹🌹🌹🌹🌹🌹.

అంజనీగాయత్రి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Anjani Gayatri,

Writer, teacher,

రాజమహేంద్రవరం,

రచనలపై ఆసక్తితో కవితలు, కథలు, నవలలు, జోక్స్ రాస్తూ ఉంటాను. నేను రాసిన కథలలో బహుమతులు పొందిన కథలు అనేకం. గత మూడు సంవత్సరాలుగా అనేక మాధ్యమాలలో రచనలు చేస్తున్నాను.


60 views0 comments
bottom of page