top of page

చింతలు - తగలబెట్టు నిప్పులు

Updated: Feb 22

#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #ChinthaluTagalabettuNippulu, #చింతలుతగలబెట్టునిప్పులు, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu


Chinthalu Tagalabettu Nippulu - New Telugu Poem Written By Gadvala Somanna

Published In manatelugukathalu.com On 16/02/2025

చింతలు తగలబెట్టు నిప్పులు - తెలుగు కవిత

రచన: గద్వాల సోమన్న


చింతలతో బ్రతుకులు

నీరుగారి పోవును

శాంతి లేక మనసులు

యాతనకు లోనగును


ఆదిలో చింతలను

అణచివేస్తే మేలు

తగలబెట్టు నిప్పులు

దూరముంటే చాలు


చింత లేక ఎవరూ

పుడమిలోని ఉండరు

ఆత్మవిశ్వాసంతో

జయిస్తారు కొందరు


చింత వలన నష్టము

వృక్షమైతే కష్టము

వదిలిపెడితే కనుక

అమితమైన లాభము


-గద్వాల సోమన్న


コメント


bottom of page