కవి సోమన్న "చిరునవ్వు" పుస్తకావిష్కరణ
- Gadwala Somanna

- 1 hour ago
- 1 min read
చిరునవ్వు, గద్వాల సోమన్న, బాలబంధు గద్వాల సోమన్న, చిరునవ్వు పుస్తకం, తిరుపతి పుస్తకావిష్కరణ, తెలుగు సాహిత్యం, తెలుగు పుస్తకాలు, సాహిత్య సభ, Tirupati Press Club, Telugu book launch, Chirunavvu book, Gadwal Somanna, literary event Telugu, Telugu writer, book release function

Chirunavvu - Book Unveiling ceremony | Gadwala Somanna
Published In manatelugukathalu.com On 16/06/2026
కవి సోమన్న "చిరునవ్వు" - పుస్తకావిష్కరణ | గద్వాల సోమన్న
తెలుగు సాహిత్య రంగంలో విశేష కృషి చేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న రచించిన "చిరునవ్వు" పుస్తకం తిరుపతి ప్రెస్ క్లబ్‌లో ఘనంగా ఆవిష్కరించబడింది. పాత్రికేయ మిత్రుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు అరవ జైపాల్, డా. శివకుమార్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ అనంతరం రచయిత గద్వాల సోమన్నను ఘనంగా సన్మానించడం విశేషం. సాహిత్య, సామాజిక రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై రచయితకు అభినందనలు తెలిపారు.
నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న పుస్తకం "చిరునవ్వు" పుస్తకావిష్కరణ ప్రెస్ క్లబ్,తిరుపతిలో ఘనంగా జరిగింది. పాత్రికేయ మిత్రుల ఆధ్వర్యంలో ముఖ్య అతిథి, జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు అరవ జైపాల్, డా. శివకుమార్,మరియు విచ్చేసిన పుర ప్రముఖుల చేతుల మీదగా ఆవిష్కరించారు.అనంతరం ఈ పుస్తకాన్ని గుండ్లూరు సుబ్రమణ్యం గారికి అంకితమిచ్చారు.పిదప బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను సన్మానించారు. ఈ కార్యక్రమంలోఆత్మీయ అతిథులు రెడ్డి కుమార్, పోతాని సుధాకర్, ఆవుల రవీంద్ర, సువర్ణ ఆనంద, మేజర్ నాగరాజు, సాహితీవేత్తలు అర్. సి. కృష్ణస్వామి రాజు, కళాకారులు, శ్రేయోభిలాషులు మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.
-గద్వాల సోమన్న














Comments