కవి సోమన్న "శతమానం భవతి " - 100వ పుస్తకావిష్కరణ
గద్వాల సోమన్న, శతమానం భవతి, చెంగల్వ పూదండ, పుస్తకావిష్కరణ, బాల గేయ బ్రహ్మ, బాలసాహిత్యం, తెలుగు రచయితలు, సాహిత్య వార్తలు

Kavi Somanna "Sathamanambhavathi" - 100th Book Unveiling ceremony | Gadwala Somanna
కవి సోమన్న "శతమానం భవతి " - 100వ పుస్తకావిష్కరణ | గద్వాల సోమన్న
Published In manatelugukathalu.com On 26/07/2026
తెలుగు బాలసాహిత్యంలో విశిష్ట సేవలందిస్తున్న బాలబంధు గద్వాల సోమన్న మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. ఆయన 100వ గ్రంథం "శతమానం భవతి"తో పాటు 101వ గ్రంథం "చెంగల్వ పూదండ" జూలై 5, 2026న హైదరాబాద్‌లోని శారదా లైవ్ స్టూడియోలో ఘనంగా ఆవిష్కరించబడ్డాయి. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్తలు, విద్యావేత్తలు, సాంస్కృతిక ప్రముఖులు పాల్గొని ఆయనను "బాల గేయ బ్రహ్మ" బిరుదుతో సత్కరించారు.
నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న నూరవ (100 ) పుస్తకం "శతమానం భవతి " మరియు నూట ఒకటవ (101)పుస్తకం "చెంగల్వ పూదండ పుస్తకావిష్కరణలు జూలై 5, 2026న శారదా లైవ్ స్టూడియో, హిమాయత్ నగర్, హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి.
సంగీత సాహిత్య సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ రెండు పుస్తకాల్ని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, ప్రొఫెసర్ కొలకలూరి మధు జ్యోతి, డా. వి. డి. రాజగోపాల్, కళాపోషకులు, విశ్రాంత అటవీ శాఖ అధికారి ఏ. ఎల్. కృష్ణారెడ్డి, డా. వి. డి. రాజగోపాల్, బిక్కి కృష్ణ మరియు రిటైర్డ్ ఐ. ఆర్. యస్. జెల్ది విద్యాధర్ గారల చేతుల మీదుగా ఆవిష్కరించారు.
అనంతరం ఈ సంస్థ బాలసాహిత్యంలో వీరి విశేష కృషికి గాను "బాల గేయ బ్రహ్మ" బిరుదుతో తగురీతిగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత కవులు పోలయ్య, ప్రధానోధ్యాయులు ఆరెకటిక నాగేశ్వరావు, నాగేశ్వరయ్య పాల్గొన్నారు. శతాధిక గ్రంథకర్త, అవార్డు గ్రహీత గద్వాల సోమన్న ను తోటి ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు.
-గద్వాల సోమన్న





Comments