కవి సోమన్న "స్వర్ణ కమలాలు" పుస్తకావిష్కరణ
- Gadwala Somanna

- 3 hours ago
- 1 min read
స్వర్ణ కమలాలు, గద్వాల సోమన్న, బాలబంధు గద్వాల సోమన్న, పుస్తకావిష్కరణ, విశాఖపట్నం సాహిత్య కార్యక్రమం, తెలుగు సాహిత్యం, తెలుగు పుస్తకాలు, సాహితీ సభ, Visakhapatnam literary event, Telugu book launch, Swarna Kamalalu book, Gadwal Somanna, Telugu writer, literary news Telugu, book release function

Swarna Kamalalu - Book Unveiling ceremony | Gadwala Somanna
Published In manatelugukathalu.com On 16/06/2026
కవి సోమన్న స్వర్ణ కమలాలు - పుస్తకావిష్కరణ | గద్వాల సోమన్న
తెలుగు సాహిత్య రంగంలో విశిష్ట స్థానం సంపాదించుకున్న బాలబంధు గద్వాల సోమన్న రచించిన 96వ పుస్తకం "స్వర్ణ కమలాలు" విశాఖపట్నంలోని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఘనంగా ఆవిష్కరించబడింది. విశాఖ సంస్కృతి మాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు, సామాజిక సేవకులు, కళాకారులు, పాత్రికేయులు పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ అనంతరం రచయిత గద్వాల సోమన్నను ఘనంగా సన్మానించడం విశేషం.
నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న 96వ పుస్తకం "స్వర్ణ కమలాలు" పుస్తకావిష్కరణ పౌర గ్రంథాలయం, ద్వారకా నగర్, విశాఖలో ఘనంగా జరిగింది.విశాఖ సంస్కృతి మాస పత్రిక ఆధ్వర్యంలో ముఖ్య అతిథి అడపా రామకృష్ణ, చల్లా రాంబాబు, శిరేల సన్యాసిరావు, పద్య కవి చిన సూరి, మస్తాన్ రెడ్డి, సామాజిక సేవకులు పలకలూరి శివరావు మరియు విచ్చేసిన పుర ప్రముఖుల చేతుల మీదగా ఆవిష్కరించారు.అనంతరం ఈ పుస్తకాన్ని శివరావు పలకలూరి వారికి అంకితమిచ్చారు.పిదప బహు గ్రంథకర్త గద్వాల సోమన్నను సన్మానించారు.ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సాలూరు మాధవరావు, నూకరాజు,సాహితీవేత్తలు కూచిమంచి నాగేందర్,,కళాకారులు, శ్రేయోభిలాషులు మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు.
-గద్వాల సోమన్న














Comments