top of page

సైనైడ్ - ఎపిసోడ్ 3

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link


'Cyanide Episode 3' New Telugu Web Series


Written By Lakshmi Nageswara Rao Velpuri


రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి


వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ధారావాహిక 'సైనైడ్' మూడవ భాగం


గత ఎపిసోడ్ లో

ఈ కేసుని పరిశోధించడానికి ప్రభుత్వం క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారిని నియమించింది.

పోస్టుమార్టం చేసిన డాక్టర్ కిరణ్ ని పూర్తి వివరాలు అడుగుతాడు రాజశేఖర్.



ఇక సైనైడ్ మూడవ భాగం చదవండి..


రాజశేఖర్ గారు మాట్లాడుతూ, “డాక్టర్ గారూ! ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయమై మన దేశ భద్రత కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, ఇంకా దేశం లోకి ఇలాంటి నిషేధ పూరితమైన మందులు రాకూడదని, నన్ను ఈ కేసుని కూలంకుషంగా పరిశీలించమని పంపించారు! కనుక మీరు మొత్తం పోస్టుమార్టం ఎలా జరిగిందో వివరించండి” అన్నారు.


డాక్టర్ కిరణ్ గారు తన గొంతు సవరించుకుని, “సార్! పోస్టుమార్టంలో సాధారణంగా, బాడీలో ఎక్కడైనా కత్తి గాట్లు, బుల్లెట్ రంధ్రాలు, ఉన్నాయా? అని పరీక్ష చేస్తాను. ఆ తర్వాత మెడ దగ్గర 'ఉరి వేయడం' వల్ల చనిపోయాడా! అనే పరీక్ష చేస్తాను. కానీ ఒక ఆరోగ్యంగా ఉన్న శేఖర్ అనే వ్యక్తికి ఎలాంటి దెబ్బలు గాని, కత్తిపోట్లు, గాని ఉరి లాంటివి గాని ఏమీ జరగలేదు. అసలు ఎలా చనిపోయాడో? అని నిశితంగా పరిశీలించాకే, ఆయన మెడ దగ్గర నుంచి హార్ట్ వరకు రంగు నీలంగా మారి ఉంది. ఇది విష ప్రయోగం అని , అదే రోజు కెమికల్ టెస్ట్ చేశాను. అప్పుడు తెలిసింది, ఇది ఏ పాముకాటు కాదు, అత్యంత విషపూరితమైన ద్రవం శరీరం లోకి వెళ్లి మొత్తం 3 నిమిషాలలో శరీరాన్ని పారలైజ్ చేస్తుంది. గుండె ఆగిపోతుంది.


ఆ చేసిన కెమికల్ టెస్ట్ లో మందుల్లో వాడే ప్లాస్టిక్ రేణువుల వల్ల ఇది సైనైడ్ క్యాప్సిల్ గా నిర్ధారించుకున్నాము, అదే రిజల్ట్స్ డిల్లీ ల్యాబ్ నుంచి కూడా వచ్చేసరికి దిగ్భ్రాంతి చెందాము” అంటూ డాక్టర్ గారు నుదిటి మీద పడ్డ చెమట తుడుచుకుంటూ, ఏకబిగిన మాట్లాడడం వలన, దాహంతో గ్లాసుడు నీళ్లు తాగి స్థిమిత పడ్డారు.


"ఓకే డాక్టర్ గారు! నేను అన్ని విషయాలు పరిశీలిస్తాను, థాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్” అని చెప్పగానే డాక్టర్ గారు వెళ్లిపోయారు.


ఆ తర్వాత రాజశేఖర్ గారు అన్ని సీసీ కెమెరాస్ ఫుటేజ్ లు అణువణువు పరిశీలించాక, మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత పోలీస్ కమిషనర్ గారి తో మాట్లాడుతూ, “నన్ను ఒక్కసారి హత్య జరిగిన ప్రాంతానికి.. అదే.. షాపింగ్ మాల్ కు తీసుకు వెళ్ళండి!” అని అనగానే ఇద్దరు 'సీనియర్ ఆఫీసర్స్' ని పంపిస్తూ 'చూడండి, రాజశేఖర్ గారికి ఆ ప్రాంతంలో అన్ని చూపించి, ఏ అవసరం ఉన్న కాల్ చేయండి” అని చెప్పి “సార్! నాకు మీటింగ్ ఉంది, మీరు అన్ని సావకాశంగా పరిశీలించండి” అని ఒక రెడ్ లైట్ వెలుగుతున్న అఫీషియల్ పోలీస్ కార్ లో వారిని పంపించారు.


సరిగ్గా ఆ సమయంలో వైజాగ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉన్నా, పోలీస్ ఎస్కార్ట్ తో వస్తున్న కార్ కి సిగ్నల్స్ ఆపి సెల్యూట్ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ని చూస్తూ తిరిగి తను కూడా సెల్యూట్ చేస్తూ, "ఆహా.. వైజాగ్ ఎంత అభివృద్ధి చెందింది!, ఎంతో సుందరమైన నగరం, రిటైర్మెంట్ అయిపోయాక వైజాగ్ లోనే ఇల్లు కట్టుకొని స్థిరపడతాను” అన్న ఆలోచనలతో రాజశేఖర్ గారు తనలో తనే ఆనంద పడసాగారు.


సరిగ్గా 20 నిమిషాలలో షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చేసరికి, అంతా మూసివేయబడి, కనీసం పది మంది సెక్యూరిటీ గార్డు లు, ఒక సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారు రాగానే, సెల్యూట్ కొడుతూ, షాపింగ్ మాల్ తలుపులు తెరిచారు.

ఆయన మొదట మూడవ అంతస్తులో ఎక్కడైతే శేఖర్ చివరి క్షణాలు గడిపాడో, అదే బార్ అండ్ రెస్టారెంట్ అంతా పరికించి చూశారు.

అడుగులో అడుగు వేసుకుంటూ, మొత్తం క్షుణ్ణంగా పరిశీలిస్తు, పక్కనే ఉన్న పోలీస్ ఆఫీసర్ తో “చూడండి! హంతకుడు మొదట ఇక్కడినుంచే శవాన్నిఎస్కలేటర్ మీద గా ఈడ్చుకు వెళ్లడం సీసీ ఫుటేజ్ లో చూశాను!” అన్నాడు.


“ఎస్ సర్! ఇదిగోనండి, మృతదేహం పడి ఉన్న చోటు. చుట్టూ 'తెల్లని మార్కింగ్ 'శవం పడి ఉన్న చోట గీశాము” అన్నాడు పోలీస్ ఆఫీసర్.


“ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్, వారికి ఏమైనా వేలిముద్రలు, ఆయుధాలు, గాని దొరికాయా, ఎలాంటి క్లూలు లభించాయి?” అని అడిగాడు రాజశేఖర్.

“సార్ !అంతా చూశారు, ఎలాంటి ఆయుధము దొరకలేదు. 'డాగ్ స్క్వాడ్ ' కూడా వచ్చి చూశాక, అవి మాల్ బయటకు వచ్చి, 'మధురవాడ వెళ్లే రోడ్డుమీద సగం వరకు వెళ్లి ఆగిపోయాయి. మరి ఆ తర్వాత ఎలాంటి క్లూలు దొరకలేదు. ఆ ఒక్క 'సీసీ ఫుటేజ్ 'తప్ప మరి ఏమీ లేవు” అని వినయంగా వివరించాడు పోలీస్ ఆఫీసర్.


“ఆ తర్వాత శేఖర్ గారు ఢిల్లీ లో పనిచేసే 'DRDO ' ఆఫీసులో కూడా ఎంక్వయిరీ చేశాము. అక్కడున్న స్టాఫ్ కూడా ఆయన చాలా మంచివాడు అని, మితభాషి అని, ఎలాంటి అనుమానం ఉన్న వ్యక్తులు రాలేదని, నెల రోజులు సెలవు మీద 'వైజాగ్ వచ్చారని చెప్పారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా 'శేఖర్' చాలా రిజర్వుడ్ గా ఉంటాడని, అవసరమైతేనే మాట్లాడతాడని చెప్పారు! ఇది సార్, ఈ నెల రోజుల్లో మేము సంపాదించిన సమాచారం!” అని చెప్పాడు ఆ ఆఫీసర్.


“ఓకే.. లెట్స్ గో. నేను కొంచెం పేపర్ వర్క్ చేయాలి. రేపు మళ్ళీ వద్దాం !’ అన్నాడు రాజశేఖర్.

“ఎస్ సార్!” అంటూ అందరూ కార్లో గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కి బయలు దేరారు.

(సశేషం: రాజశేఖర్ గారు, మొత్తం హత్య జరిగిన సీన్ అంతా, తన డైరీలో రాసుకుంటూ, అసలు శేఖర్ 'డి ఆర్ డి ఓ కి ' ఎలా అప్పాయింట్ అయ్యాడు? శేఖర్ 'బ్యాక్ గ్రౌండ్ ' అంతా తెలుసుకోవాలనుకుని, ఆ కోణంలో ఆలోచిస్తూన్న విషయాలు 4వ భాగం లో చదవండి. )


వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.



18 views0 comments
bottom of page