top of page

సైనైడ్ - ఎపిసోడ్ 4

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Youtube Video link

'Cyanide Episode 4' New Telugu Web Series


Written By Lakshmi Nageswara Rao Velpuri


రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరివేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ధారావాహిక 'సైనైడ్' నాలుగవ భాగం


గత ఎపిసోడ్ లో

తాను చేసిన పోస్ట్ మార్టం వివరాలు రాజశేఖర్ కి చెబుతాడు డాక్టర్ కిరణ్.

తరువాత మాల్ దగ్గరికి వెళతాడు రాజశేఖర్.

చనిపోయిన శేఖర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటాడు.

ఇక సైనైడ్ నాలుగవ భాగం చదవండి..హత్య చేయబడిన శేఖర్ నిజానికి ఒక మంచి విద్యావంతుడు. బిట్స్ పిలానీలో తన కంప్యూటర్ ఇంజనీరింగ్ లో ఎన్నో మంచి ఆవిష్కరణలు చేసి ప్రాక్టికల్స్ లో అందరికన్నా ఎంతో తెలివిగా ర్యాంకులు సాధించడంతో అగ్రగణ్యుడయ్యాడు. క్యాంపస్ సెలక్షన్స్ లో అత్యధిక వేతనంతో ఒక ప్రైవేట్ కంపెనీలో లో నియమింపబడ్డాడు శేఖర్. అలాగే "యూపీ ఎస్సీ గ్రూప్ వన్ "లో సెలెక్ట్ అయ్యి "Defence reaserch development org ."! Delhi లో సీనియర్ ఆఫీసర్ గా అపాయింట్మెంట్ రావడంతో తన జీవిత ధ్యేయం సాధించినట్టు భావించి, అదే ఉద్యోగంలో కొనసాగ సాగాడు.


అన్ని కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ డిపార్ట్మెంట్ లకి ఎలాంటి సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వచ్చినా స్వయంగా శేఖర్ తన నైపుణ్యంతో ఆ సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్స్ ని మళ్లీ ఆక్టివేట్ చేసి ఎంతో చాకచక్యంగా మిలటరీ ఆర్మీ బేస్ లు, నేవల్ బేస్ లు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్న కంప్యూటర్ సాఫ్ట్వేర్.. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అందరి అభిమానాన్ని చూర గొన్నాడు. అంచెలంచెలుగా ఎదిగి గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకింగ్ పొంది అత్యున్నత స్థాయి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కి వెన్నుముకగా నిలిచాడు శేఖర్.


సరిగ్గా అదే సమయంలో తను మొదట పనిచేసిన సాఫ్ట్వేర్ కంపెనీలో శేఖర్ కి ఆత్యంత సన్నిహితంగా మెలిగే స్నేహితుడి పేరు ఏ - వన్ (పేరు రాయడం లేదు). ఆ ఇద్దరూ కలిసి రెండు సంవత్సరాల పాటు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కలిసిమెలిసి ఉండేవారు. శేఖర్ కి డి ఆర్ డి వో లో ఉద్యోగం వచ్చాక కొంచెం ఎడబాటు కలిగింది.


అయినా ప్రతివారం ఇద్దరూ కలుస్తూ బార్ కి వెళ్లి ఓ గంట సేపు హాయిగా కూర్చుని తాగుతూ ఉండేవారు. అసలు ఏ - వన్ ఒక ప్రాజెక్టు పని మీద కెనడా నుంచి వచ్చి, అదే కంపెనీలో శేఖర్ తో కలిసి పనిచేయడం జరిగింది.


అలా వారి స్నేహం ఘాడమై శేఖర్ కు పెళ్లయిన తర్వాత కూడా వారి ఇంటికి వచ్చి ఏ - వన్ మన మన సౌత్ ఇండియా రుచులన్నీ మరిగి ఎంతో క్లోజ్గా ఉండే వాడు.


ఆరోజు ఏ - వన్ ఇంటికి వచ్చి “ఒరేయ్ శేఖర్! ఇవాళ మీ ఆవిడ ఇడ్లీ సాంబారు చేస్తానన్నది కదా! దాన్లో కొబ్బరి చెట్నీ కూడా వేయించు. ఆ రుచి నేను జన్మజన్మలకు మర్చిపోను. ఇదే విషయం మా కజిన్ సిస్టర్ బి - వన్(పేరు పెట్టలేదు) కి కూడా చెప్పాను. ఆమె నీతో ఎలాగైనా మాట్లాడాలి అని అంటున్నది” అంటూ ఫోన్ కలిపి తన కజిన్ సిస్టర్ బి - వన్ చేత మాట్లాడించాడు.


“హాయ్ మిస్టర్ శేఖర్! హౌ ఆర్ యు అండ్ యువర్ వైఫ్? నేను మాంట్రియల్ నుంచి మాట్లాడుతున్నాను. ఏ - వన్ ఆస్తమాను మీ గురించే మాట్లాడుతాడు. నేను ఇండియాకు వచ్చినప్పుడు అన్ని సౌత్ ఇండియన్ డిషెస్ చేయించండి. మా బ్రదర్ అలా చెప్తుంటే నాకు ఇక్కడ నోరు ఊరిపోతోంది” అంటూ సంభాషణ కొనసాగించి శేఖర్ భార్యతో కూడా కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేసింది బి - వన్.


అలా పరిచయమైన బి - వన్ వారానికి రెండు సార్లు గంటలు గంటలు శేఖర్ తో మాట్లాడుతూ బాగా క్లోజ్ అయిపోయింది. ఆమె తేనెలొలికే మాటలు, నవ్వు తెప్పించే జోకులు శేఖర్ కి బాగా అలవాటు అయిపోయి ఎప్పుడు బి - వన్ ఫోన్ వస్తుందా! అని ఎదురు చూడడం శేఖర్ వంతు అయిపోయింది.


ఆ రోజు బి - వన్ ఫోన్ చేసి “శేఖర్! మీలాంటి కంప్యూటర్ టెక్కీతో మాట్లాడుతూ ఉండడం వల్ల నేను కూడా ఎన్నో నేర్చుకున్నాను. నీతో మాట్లాడుతూ ఉంటే నాకెందుకో అనుక్షణం నీతో ఉండాలని ఉంటుంది” అంటూ తేనెలొలికే పలుకులతో శేఖర్ కి ఎంతో దగ్గర అయ్యింది.


అలా ఇద్దరు ఏ - వన్ కి తెలియకుండా కూడా పర్సనల్గా బాగా దగ్గర అయిపోయారు. శేఖర్ తన భార్య రేణుక గర్భవతి అని తెలిసి కూడా ఆమెతో ఎక్కువ సేపు మాట్లాడే వాడు కాదు. ఎంతసేపు ఫోన్ లో బి - వన్ తో మాట్లాడుతూనే ఉండేవాడు.


భర్త శేఖర్ ముభావ స్వభావం గమనించిన రేణుక కూడా బాధ పడ సాగింది. ఎప్పుడైనా బి - వన్ ఫోన్ రాగానే శేఖర్ జాక్ పాట్ కొట్టిన వాడిలా సంతోషం తో మాట్లాడుతూ ఉండడం ఆమెకు బాధ కలిగించింది.


అలా రెండు నెలలు గడిచేసరికి ఆ ఇద్దరికీ ఒకరినొకరు వదిలి ఉండలేని పరిస్థితి వచ్చింది ఆరోజు బి - వన్ ఫోన్ చేయగానే శేఖర్ మాట్లాడుతూ “నేను నిన్ను వదిలి ఉండలేను! రేపు మా ఆవిడ విశాఖపట్నం డెలివరీ కి వెళ్ళిపోతుంది. నేను ఒంటరి వాడిని అయిపోతాను. ఏ - వన్ కూడా ఏదో పని మీద అన్ని ఊర్లు తిరుగుతున్నాడు.


నేను నా భార్య డెలివరీ అయ్యాక విడాకులకు అప్లై చేస్తాను. మనిద్దరం కలిసి కెనడాలో ఉందాము” అంటూ ఒంటరిగా మందు తాగుతూ నిషా తలకి ఎక్కి అన్న మాటలు బి - వన్ కు ఎంతో సంతోషం కలిగి “అలాగే చేద్దాం! ఈ లోపల నేను రెండు కొత్త ప్రాజెక్టులు తయారు చేస్తున్నాను. దానికి నీ సహకారం కావాలి” అంటూ తన ప్రేమ వలయంలో శేఖర్ గిలగిలా కొట్టుకునేటట్టు చేసింది బి - వన్.


అలా ఒకరికొకరు ఎన్నో గిఫ్ట్లు పంచుకుంటూ మరింత దగ్గరయ్యారు శేఖర్ బి - వన్ లు. రోజు ఆఫీస్ అయ్యాక ఏ - వన్ తో కూడా తిరగడం మానేసి ఒక్కడే కూర్చుని మందు తాగుతూ బి - వన్ కు మందు నషా లో తన పని గురించి కూడా ఎంతో రహస్యంగా ఉంచవలసిన విషయాలు కూడా చెప్పేవాడు శేఖర్.


ఒకరోజు బివాన్ ఫోన్ చేసి “శేఖర్! మనం ఎంతో అదృష్టవంతులం. నేను 2 ప్రాజెక్టులు విదేశాలకు తయారు చేయాలి. అది కూడా భారతదేశ రక్షణకు నీ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది? వాటి అన్ని విషయాలు నాకు ఎవరికీ తెలియ కుండా నువ్వు ఇవ్వగలిగితే మీ దేశానికి ఏ ముప్పు రాకుండా అదే సాఫ్ట్వేర్ పరిజ్ఞానాన్ని ఆ దేశాలకు నేను తయారు చేస్తాను!


దానికి మనకు వచ్చేది 50 కోట్ల రూపాయలు. నీకు ఇష్టమైతే మనిద్దరం కలిసి మరో పది తరాలు కూర్చుని తిన్న తరగని సంపద సంపాదిస్తాం. ఆ తర్వాత నువ్వు హాయిగా మీ భార్యకు విడాకులు ఇచ్చి కెనడా వచ్చేయి. ఇక్కడ మన కోసం ఒక బంగళా కూడా కొన్నాను. అంతా నీ కోసమే శేఖర్!” అంటూ ఎంతో తీయగా మాట్లాడుతూ శేఖర్ కి ఎలా పని చేయాలో వివరించింది బి - వన్.


(సశేషం: బి - వన్ తన ప్లాన్ ని శేఖర్ కి ఏమని చెప్పింది? మందు మత్తులో ఉన్న శేఖర్ ఎలా ఒప్పుకున్నాడు? అన్న విషయాలు 5 వ భాగంలో చదువుదాం.)


వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.32 views0 comments

Comentarios


bottom of page