top of page

సైనైడ్ - ఎపిసోడ్ 5

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Cyanide Episode 5' New Telugu Web Series




వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ధారావాహిక 'సైనైడ్' ఐదవ భాగం


గత ఎపిసోడ్ లో

హత్య చేయబడిన శేఖర్ కంప్యూటర్ మేధావి.

అతను డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఆర్మీలోనూ, నేవీలోనూ, ఎయిర్ ఫోర్స్ లోనూ వాడుతున్నారు.

అతనికి పాత స్నేహితుడు ఏ - వన్ తో పరిచయం పెరుగుతుంది.

అతని ద్వారా బి - వన్ అనే యువతి పరిచయమవుతుంది.

ఆమె అతన్ని ఆకర్షిస్తుంది.

ఇక సైనైడ్ ఐదవ భాగం చదవండి.


ఒకరోజు బి - వన్ ఫోన్ చేసి తన తియ్యని మాటలతో, “శేఖర్! ఈ జీవితంలో అనుకోని అదృష్టం వచ్చింది, మీ డిపార్ట్మెంట్ లోని సాఫ్ట్వేర్, ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ లో డెవలప్మెంట్ అప్డేట్ చేస్తున్న కంపెనీలు 'eastern naval command,(navalbase),Hpcl,Indian Air force, Atomic reserch centres, Artillery departments.


'DRDO', ఇలాంటి వాటికి, భారతదేశపు రక్షణ వ్యవస్థకు అంత మంచి సాఫ్ట్వేర్ ఇచ్చి, దిగ్విజయంగా నడిపిస్తుంది, దాన్లో 'DRDO' ఎంతో ఎక్కువ టెక్నాలజీ తో డెవలప్ చేసిన 'ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ missiles' కూడా 'లాంగ్ రేంజ్ ఫైరింగ్' లో మీ 'కంప్యూటర్ టెక్నాలజీతో' బాగా అభివృద్ధి చెందింది.


కనుక నువ్వు ఈ అన్ని డిపార్ట్మెంట్ల కి వెళుతూ, సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తూ చాలా బిజీగా ఉన్నావు! అదే టైంలో లో నువ్వు చేసిన ప్రోగ్రామింగ్, వాటి సమర్ధత, నువ్వు చేసే విధానం.. నాకు గాని ఇవ్వగలిగితే, నేను కూడా మరో 'రెండు దేశాలకు ఆ టెక్నాలజీ ఇస్తాను. భారతదేశంలో లాగే వారు కూడా అభివృద్ధి చెందుతారు. ఇందులో దేశద్రోహం ఏమీ లేదు. జస్ట్ నాకు నువ్వు ఎలా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అప్ డేట్స్ చేస్తావో, ఆ విషయాలు నాకు అందజేస్తే, నేను ఆ దేశాలకి అదేవిధంగా తయారు చేసి ఇస్తాను.


దానివల్ల మనకు ఆఫర్ చేసిన మొత్తం 100 కోట్లు. ఇలాంటి అవకాశం మరి ఎప్పుడూ, ఎక్కడా రాదు! నువ్వు ఆ సాఫ్ట్వేర్ డీటెయిల్స్ అన్నీ నాకు పంపించి, ఆ తర్వాత నీ భార్యకు విడాకులు ఇచ్చి, కెనడాకు వచ్చేయి. నువ్వు రాగానే మనం పెళ్లి చేసుకుని, ఆ డీటెయిల్స్ తో ప్రాజెక్ట్ తయారుచేసి, ఆ దేశాలకు ఇస్తే ముందుగా మనకు 50 కోట్లు ఇస్తారు.


ఆ తర్వాత మరో 50 కోట్లు ఆ ప్రోగ్రామ్స్ ని వాళ్ల దేశాలలో మనం ఇన్స్టాల్ చేసి, సక్సెస్ ఫుల్ గా నడిపిస్తే ఇస్తారు. ఈ డబ్బు మనకు జీవితంలో కూర్చొని తిన్నా, పది తరాలకు సరిపోతుంది. కనుక బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో!



ముందు నువ్వు వైజాగ్ లో ఉన్న naval base, HPCL లో ఉన్న 'కంప్యూటర్ సాఫ్ట్వేర్ 'ఎలా పనిచేస్తుంది?, నేవల్ బేస్ లో ఎన్ని వార్ షిప్స్ ఉన్నాయి,? అందులోనే ‘న్యూక్లియర్ submarines’ ఎన్ని ఉన్నాయి? వాటి కెపాసిటీ, ఒకవేళ యుద్ధం వస్తే ఎన్ని రకాల ‘Torpedos’ (నీటిలో ప్రయోగించే యుద్ధ బాంబులు) వాడతారు? అలాగే మొత్తం 'అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్' కూడా కావాలి.


ఇంకా "HPCL "లో ఎన్ని క్రూడ్ ఆయిల్ బoకర్స్ ఉన్నాయి,? వాట్ కెపాసిటీ ఎంత, అలాగే మొత్తం 'అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ 'అన్నీ పంపించు. ఇది కష్టమైన పని అయినా ఇదే మన బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుతుంది.


ఇలాంటి డీటెయిల్స్ తో మనం ప్రాజెక్ట్ తయారుచేసి ఇస్తే, ఆ దేశాలు కూడా అభివృద్ధి చెందుతాయని,వారు నాకు ఈ 'ప్రాజెక్టు ', అప్పగించారు. అంతకన్నా మరి ఏమీ లేదు.

నువ్వు చాలా తెలివైనవాడివి. కనుక మొత్తం అన్నీ 'హార్డ్డిస్క్ 'లో పెట్టి ఉంచు. నేను చెప్పినప్పుడు పంపిద్దు గాని!” అని వరుసగా చెబుతున్న' 'బి - వన్ 'మాటలు వింటూ ఆశ్చర్యపోయాడు మందు మత్తు లో ఉన్న శేఖర్.


'శేఖర్! వైజాగ్ పని అయిపోయాక, నువ్వు మహారాష్ట్ర వెళ్లి భారతదేశపు అణు రియాక్టర్ లు ఎక్కడెక్కడ ఉన్నాయి? వాటి సామర్థ్యం ఎంత? అన్న విషయాలు కూడా సేకరించాలి. ఇవేమీ నీకు కొత్త కాదు, ఎందుకంటే 'డి ఆర్ డి వో ' లో నీకే అన్నిటికీ వెళ్ళగలిగిన పర్మిషన్ ఉంది. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ నువ్వు తప్ప ఇంకొకరు చెయ్యరు. అందుకే నీకు ఇవన్నీ చెప్తున్నాను!


నన్ను నమ్ము. మన బంగారు భవిష్యత్తు కోసం నేను చేస్తున్న ఈ ప్రాజెక్ట్ కి నీ సహాయం అందజేయి. 'ఏ - వన్ ' కు ఈ విషయాలు ఏమీ చెప్పొద్దు! నీకు నాకు మధ్యనే ఈ ప్రాజెక్టు విషయాలు ఉండాలి! అందుకే నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నీ పనులు అయిన వెంటనే, ఇంకో రెండు నెలల్లో నువ్వు రిజైన్ చేసెయ్యి. హాయిగా నీకు వర్క్ పర్మిట్ పంపిస్తాను. కెనడా వచ్చేయి. ఇక్కడ మనిద్దరం అంతులేని ఆనందం అనుభవిద్దాం!” అంటూ ఏకధాటిగా బి - వన్ చెప్తున్న మాటలు, శేఖర్ లో కూడా ఆశలు రేకెత్తించాయి, తన ప్రేయసి కోసం ఎలాంటి పని అయినా చేయడానికి సిద్ధ పడ్డాడు శేఖర్.


(సశేషం: శేఖర్ బి - వన్ మాటలను విశ్వసించాడా, ఏమైనా అనుమానాలు ఉన్నాయా ?అన్నది 6 భాగం లో చదవండి.)

వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.



13 views0 comments
bottom of page