top of page

సైనైడ్ - ఎపిసోడ్ 6

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Youtube Video link

'Cyanide Episode 6' New Telugu Web Series
వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ధారావాహిక 'సైనైడ్' ఆరవ భాగం


గత ఎపిసోడ్ లో

బి - వన్ తన తియ్యని మాటలతో శేఖర్ ని లోబరుచుకుంటుంది.

మన దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన రహస్యాలు తెమ్మని అడుగుతుంది.

తనకు సహకరిస్తే వంద కోట్లు సంపాదించుకోవచ్చని ఆశ పెడుతుంది.


ఇక సైనైడ్ ఆరవ భాగం చదవండి.


శేఖర్ ఎంతో ఆలోచించిన పిమ్మట, 'బి - వన్ చెప్పినది ఏమీ కష్టమైనది కాదు. నేను ఎలాగో అన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం, కొత్త డి ఆర్ డి ఓ అప్డేట్స్ కోసం వెళ్తూ వుంటాను. అవి చాలా గోప్యంగా చేయవలసిన ప్రాజెక్టుల గనుక నాకు ఒక్కడికే ఆ పర్మిషన్స్ ఉన్నాయి. అందులోని కొన్ని బి - వన్ అడిగిన వివరాలు నేను తేగలను. అవన్నీ రికార్డ్ చేసి ఒకవేళ నేను బి - వన్ కి ఇస్తే.. దాని వల్ల దేశానికి ఏమైనా ఆపద వాటిల్లుతుందా.. ? అదేమైనా దేశద్రోహమా?..' అన్న విధంగా కూడా ఆలోచించి. తనలో తానే ‘పర్వాలేదులే! నేను బి - వన్ ని వదిలి ఉండలేను. ఆమాత్రం వివరాలు సేకరించి, నా భార్యకు విడాకులు ఇచ్చి, కెనడా వెళ్లి ఆ వివరాలతో బి - వన్ తో కలిసి ఆ ప్రాజెక్టులు చేసి 100 కోట్లు సంపాదించవచ్చు. దానివల్ల ఆ దేశాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి పరవాలేదు! నా జీవితం ఆనందమయం అవుతుంది..' అనుకుంటూ తనలో తానే సమర్ధించుకుంటూ, తాను బి - వన్ తో కలిసి స్వర్గసుఖాలు అనుభవించవచ్చు! అన్న ఆలోచనలు తప్ప మరి ఏ ఇతర విషయాలు ఆలోచించలేదు శేఖర్.


శేఖర్ అలాగే విశాఖపట్నం లోని నేవల్ బేస్ సాఫ్ట్ వేర్ ప్రాజెక్ట్ అప్డేట్ కోసం ఆ తర్వాత ముఖ్యమైన HPCL refinery లో అనుకోకుండా గ్యాస్ లీకై, స్టోరేజ్ ట్యాంకులు రెండు పేలి పోవడంతో ఆ పక్కనే ఉన్న అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో మొత్తం కంప్యూటర్ సాఫ్ట్వేర్ కాలిపోవడంతో మళ్లీ వాటిని రిస్టోర్ చేయడానికి, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి కూడా వెళ్లాలి. అంటూ తన కంపెనీ చెప్పడంతో ఒక నెల రోజుల పాటు ఆ పనుల మీద విశాఖపట్నం వచ్చాడు. అంతకుముందే తన సొంత ఊరైన విశాఖపట్నంలో డెలివరీ కోసంభార్య ను పంపించాడు శేఖర్.


ఎంతో హుషారుగా తన పనులన్నీ చేసుకుంటూ భార్యతో కూడా అన్యోన్యం నటిస్తూ పాపం.. ‘భార్య డెలివరీ అయిపోయిన తర్వాత మెల్లిగా విడాకులకు అప్లై చేసి.. కెనడా వెళ్ళిపోవచ్చు!’ అనుకుంటూ ముందుగా నేవల్ బేస్ లో సాఫ్ట్వేర్ పనులు చేస్తూ తన హార్డ్ డిస్క్ లో ఎవరూ చూడకుండా కొన్ని అంతర్గత విషయాలు దేశ రక్షణ కు సంబంధించినవి కూడా సేకరించి బివాన్ చెప్పిన విధంగా నేవల్ వార్ షిప్స్ డీటెయిల్స్ న్యూక్లియర్ submarines లోని ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి? ఎలా ప్రపంచంలోనే అగ్రగామిగా భారతదేశం గర్వంగా చెప్పుకునే విధంగా అవి తయారౌతున్నాయో.. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోకి వెళ్లి అక్కడ ఎంతమంది నేవల్ ఫోర్స్ వారి వివరాలు అన్ని ఎవరికీ తెలియకుండా రికార్డు చేశాడు.


ఆ తర్వాత HPCL రిఫైనరీలో కూడా కావలసిన విషయాలన్నీ సేకరించి ఎన్ని క్రూడ్ ఆయిల్ బంకర్స్ ఎంత క్రూడాయిల్ స్టోరేజ్ లో ఉంది.. ఆ బంకర్ లొకేషన్స్ ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోని మెయింటెనెన్స్ వివరాలు అన్నీ సేకరించి ఎంతో స్వేచ్ఛగా హుషారుగా ఆ "హార్డ్ డిస్క్ ని" జాగ్రత్తగా ఉంచి బి - వన్ కు ఫోన్ చేశాడు శేఖర్.


కెనడా లో ఉన్నబి - వన్ ఆరోజు విశాఖ నుంచి ఫోన్ రావడంతో ఆనందంగా “హాయ్ హాయ్ శేఖర్! హౌ ఆర్ యు? నీ దగ్గర్నుంచి ఏప్పుడు ఫోన్ వస్తుందా! అని ఎదురు చూస్తూ నాకు నిద్ర కూడా పట్టడం లేదు. నువ్వు ఎంత తొందరగా కెనడా వచ్చి నాతో కలిసి ఉంటావో? అని ఎదురు చూస్తున్నాను. ప్లీజ్ తొందరగా వచ్చేయ్! నేను ఉండలేక పోతున్నాను” అంటూ ఎంతో తియ్యనైన మాటలతో శేఖర్ ని ఊరించిoది బి - వన్.


శేఖర్ ఆ రోజు ఎంతో హుషారుగా మందు తాగుతూ “హాయ్ డార్లింగ్! మన దారి సుగమం అయ్యింది. వైజాగ్ లోని నీకు కావలసిన వివరాలన్నీ సేకరించాను. అవి దేశ భద్రతకు సంబంధించినవి. నేను పర్సనల్గానే వచ్చి నీకు అందజేస్తాను! . దీని తర్వాత నువ్వు చెప్పిన విధంగా.. ఢిల్లీ. ముంబాయి వెళ్లి ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అటామిక్ రీసెర్చ్ సెంటర్ విభాగం లో సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం వెళ్తాను! అవన్నీ కూడా రికార్డ్ చేస్తాను. నువ్వు కంగారు పడకు. మన ఇద్దరం కలిసి నువ్వు చెప్పిన రెండు దేశాలకు.. కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి భారతదేశం లాగానే వారిని కూడా అభివృద్ధి చేద్దాం! అందులోనూ మన జీవితాల్లో సంపాదించ లేనంత ధనం ఈ ప్రాజెక్టు వల్ల వస్తుంది! అని నువ్వు అనగానే నాకు ఎంతో ఆనందం, ఉత్సాహం వచ్చాయి. అందులోనూ ప్రపంచమంతా హాయిగా మనిద్దరం తిరుగుతూ స్వర్గసుఖాలను అనుభవిస్తాము! అన్న మాటలు నన్ను ఈ పని చేయడానికి ప్రోద్బలం చేశాయి. అయినా నువ్వు మా భారత దేశ రక్షణకు ఎలాంటి ఆపద వాటిల్లదని చెప్పావు. గనుక నేను స్వయంగా చేస్తున్నాను. ఏ గవర్నమెంటు ఉద్యోగి ఇంత సాహసానికి పూనుకోడు. నీ అమూల్యమైన ప్రేమ కోసం, ఆ తర్వాత మన బంగారు భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తూ.. నీకోసమే చేస్తున్నాను డార్లింగ్” అంటూ అప్పటికే అర సగం స్కాచ్ విస్కీ తాగుతూ, బివాన్ ప్రేమపూరితమైన మాటలు వింటూ, మంచి మత్తులో మునిగిపోయాడు శేఖర్.


అలా ప్రేమలోకంలో ఇద్దరూ మునిగిపోతున్న వేళ అనుకోని విధంగా భారతదేశ ఇంటెలిజెన్స్ విభాగం అన్ని ప్రభుత్వ రంగాల లోనూ హయ్యర్ అఫిషియల్స్ మీద నిఘా మొదలు పెట్టింది. ఎందుకంటే వారికి దేశ భద్రతకు ముప్పు వచ్చే కొన్ని విషయాలు లీక్ అవుతున్నాయి అన్న సమాచారం ఢిల్లీ హోమ్ మినిస్త్రీ నీ కుదిపేసింది.

ప్రతి గవర్నమెంటు ఆఫీస్ డిఫెన్స్ కి సంబంధించినది అయి ఉంటే వెంటనే తనిఖీలు చేపట్టింది భారత దేశ ఇంటెలిజెన్స్ విభాగం.

ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండటం చేత ఎలాంటి చిన్న సమాచారమైనా పూర్తిగా జల్లెడ పట్టి దాని మూలాలను కనుక్కోవడం లోను, ప్రపంచంలోనే పేరు ఉన్నది.. భారత ఇంటెలిజెన్స్ విభాగం.


ముఖ్యంగా ఆరోజు శేఖర్ కి ఢిల్లీ నుంచి DRDO ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ‘mr.sekhar! pl stop entire software development programme in vizag due to some differences. Thanq’ అన్న మాటలు వినబడగానే శేఖర్ కి కాళ్ళు చేతులు వణికిపోయాయి.


అసలు ఏమైంది ? ఎందుకు హెడ్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది.. అన్న విషయాలు ఆలోచిస్తున్న సమయంలో ఆ రోజు టీవీ లో కూడా న్యూస్ చూస్తూ “దేశ రక్షణకు సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అవుతున్నాయి. అందువల్ల మన దేశ నిఘా విభాగం ప్రత్యేక చర్యలు చేపడుతుంది” అన్న వార్త విని తను తాగుతున్న విస్కీ గ్లాసు నేలకేసి కొట్టి, “అయిపోయింది.. నా బతుకు అయిపోయింది!” అంటూ ఏడుస్తూ బి- వన్ కి ఫోన్ చేసి, “చూసావా ! నేను చెప్పింది జాగ్రత్తగా విను! కొన్ని దేశ భద్రతకు ముప్పు ఉన్న వివరాలు సేకరించ బడుతున్నాయని. భారత దేశ నిఘా విభాగం అన్ని కోణాలలో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది. నాకు తెలుసు, ఇది నా వల్లే జరిగిందని. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా తప్పించుకోవాలి? నా హార్డ్ డిస్క్ తో కెనడా ఎలా రావాలి ! డి ఆర్ డి ఓ ఆఫీస్ లో కూడా ప్రతి ఒక్క విషయం సేకరిస్తున్నారు. నేను దొరికిపోయాను అంటే మొత్తం నీ గురించి, ఏ- వన్ గురించి. అన్ని విషయాలు తెలిసి, మిమ్మల్ని కూడా దేశద్రోహ నేరం కింద ఉరి శిక్ష..


నాకు ఎలాగో చావు తప్పదు. నన్ను ఏ విధంగా అయినా కాపాడు! !” అంటూ మందు మత్తులో ఏడుస్తూ చెప్పేసరికి బి - వన్ కూడా ఆ వార్త విన్న వెంటనే మొత్తం కుట్ర బయటపడి పోతుందేమోనని భావించి “శేఖర్! నువు భయపడకు. ఈ విషయం నేను, ఏ - వన్ కలిసి పరిష్కరిస్తాం! నిన్ను కెనడా తీసుకు వస్తాను. నువ్వు ఏ - వన్ తో కాంటాక్ట్ లో ఉండు’ అని చెప్పే సరికి శేఖర్ కి మందు మత్తు వదిలి ‘ఇప్పుడు అర్థమైంది. ఇది డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కాదని తనను ఒక పావుగా వాడుకుని, దేశ భద్రతకు విఘాతం కలిగించే వివరాలతో నా మాతృభూమిని అన్ని విధాల ధ్వంసం చేయగల.. టెర్రరిస్ట్ ప్లాన్’ అని నిర్ధారించుకున్నాడు శేఖర్.


ఎందుకంటే బి - వన్, ఏ - వన్ ను ఇన్నాళ్ల తర్వాత నేను పూర్తిగా ప్రేమలో పడి దేశ రక్షణ వివరాలు సేకరించాక మళ్లీ ఏవన్ కలిసి మాట్లాడమనటం తో తన అనుమానం రెట్టింపయింది.


"ఛీ. జీవితంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు. తగిన హోదా ఇచ్చిన నా మాతృభూమిని తీవ్రవాదుల చేతిలో పెట్టడమా. ! నేను ఎలాగో చస్తా. నాతో పాటే ఆ రహస్యాలు దేశ సరిహద్దులు దాటకుండానే మాడి మసి అయిపోవాలి” అని నిర్ధారించుకుని. తూలుతూ ఇంటికి చేరుకున్నాడు భారమైన హృదయంతో శేఖర్.


( సశేషం: శేఖర్ ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు? తను భారతదేశాన్ని ఈ తీవ్రవాద ముష్కరుల నుంచి ఎలా కాపాడుకోవాలి అన్న ఆలోచనలు 7 భాగం లో చదువుదాం.)

వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.22 views0 comments

Comments


bottom of page