top of page

సైనైడ్ - ఎపిసోడ్ 7

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.







Youtube Video link

'Cyanide Episode 7' New Telugu Web Series




గత ఎపిసోడ్ లో

బి - వన్ మాటలకు లొంగిపోతాడు శేఖర్.

ఆమె అడిగిన రహస్యాలు సేకరిస్తాడు.

సమాచారం లీక్ అవుతున్న విషయం ఇంటెలిజెన్స్ విభాగం గమనించి నిఘా పెడుతుంది.

ఏ - వన్ బి - వన్ లు ఒక పావులా వాడుకున్నారని నిర్ధారించుకున్నాడు శేఖర్.


ఇక సైనైడ్ ఏడవ భాగం చదవండి


శేఖర్ ఎంతో బాధతో,మరొకసారి బి - వన్ కి ఫోన్ చేసి, “నేను సేకరించిన వివరాలు- విశాఖపట్నం లోని నేవల్ బేస్,హెపిసిఎల్ అయిన కేంద్ర ప్రభుత్వ సంస్థల వివరాలను, అన్నీ రికార్డ్ చేసి ఉంచాను! కానీ ఇప్పట్లో నేను ముంబై, ఢిల్లీ వెళ్ళలేను. ఢిల్లీలోని మా ఆఫీస్ లో కూడా తనిఖీలు మొదలుపెట్టారు. నేను ఖచ్చితంగా దొరికి పోతాను! అని బాధపడుతూ చెప్పేసరికి,


బి - వన్ ధైర్యం చెబుతూ, “శేఖర్ ! నీకు ఏమీ కాదు, నువ్వు ఢిల్లీ, ముంబై వెళ్లి ఆ పనులు కూడా ముగించి,రెడీగా ఉండు. నిన్ను కెనడా తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నాను.

నువ్వు భయపడనవసరం లేదు” అని చెప్పగానే,


"ఆర్ యూ మాడ్? ఇక్కడ నా పరిస్థితి గందరగోళంగా ఉంది. గూడచారి విభాగం, అత్యంత రహస్యమైన భారతదేశ రక్షణ వ్యవస్థ కు చెందిన వివరాలు ఎక్కడికో పంపడుతున్నాయి. అందువల్ల ఇంటెలిజెన్స్ విభాగం అన్ని డిఫెన్స్ ఆఫీసులలో హై సెక్యూరిటీ ఎలర్ట్ పెట్టారు. నేను పట్టుబడడం ఖాయం” అంటూ అరుస్తూ, మందు కొడుతూ ఏడుస్తూ మాట్లాడాడు శేఖర్.


ఆ సమాధానం విన్న వెంటనే బి - వన్ ఢిల్లీలో ఉన్న తన సహచరుడు ఏ - వన్ కు ఫోన్ చేసి "హాయ్, ప్లీజ్ లుక్ ఆఫ్టర్ మిస్టర్ శేఖర్. ఆయన చాలా పిరికితనంగా మాట్లాడుతున్నాడు. మన చేతిలో పడబోయే భారతదేశ రక్షణ వివరాలు అతనితోనే ఉన్నాయి. నువ్వు ఎలాగైనా అవి సంపాదించి,నాకు పంపించు. ఇది హైకమాండ్ ఆర్డర్.

" if not possible, finish the so-called character,!"


అత్యంత విషమ పరిస్థితులలో మనం చేయగలిగినది ఏమీ లేదు. అయితే ఆ వివరాలు తీసుకో.. లేదా, శేఖర్ ని క్లూ లేకుండా ఎలిమినేట్ చేసేయి!” అంటూ కంగారుపడుతూ, “ “ఆపరేషన్ అయిపోగానే నువ్వు స్ట్రెయిట్గా వయా దుబాయ్, నుంచి కెనడాకు నీకు టికెట్ పంపిస్తున్నాను. ఈ పనులన్నీ అతి జాగ్రత్తగా చేసి, మన ఆర్గనైజేషన్ ఉనికి ఎక్కడా తెలియకుండా,అన్ని విధాలా శేఖర్ ని చంపి, నువ్వు మాయమైపో వాలి!” అని చెప్పి ఫోన్ పెట్టేసింది బి వన్.

వైజాగ్ లో శేఖర్ మొత్తం మందుకు బానిసై పోయాడు. ఎక్కడో తెలియని బెంగ, తనను టెర్రరిస్టులు చంపుతారని, తన వద్ద ఉన్న భారత దేశ రక్షణ వ్యవస్థ కు సంబంధించిన వివరాల కోసం టార్చర్ పెట్టి మరీ తీసుకుంటారని, అనుక్షణం భయపడుతూ,విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఒంటరిగా ఇసుకతిన్నెల మీద నడుస్తూ, ఎలాగైనా అన్ని వివరాలు ఉన్న "హార్డ్ డిస్క్" దాచేయాలి, లేదా నాతో పాటే వాటి దహనం కూడా జరగాలి!’ అంటూ పిచ్చివాడు లా తనలో తనే మాట్లాడుకుంటూ, ఒక "కేంద్ర ప్రభుత్వ సీనియర్ మోస్ట్ ప్రాజెక్ట్ మేనేజర్DRDO", ఇంత దీనమైన పరిస్థితిలోకి రావడానికి, ఉగ్రవాదుల చేతిలో కీలుబొమ్మ అవ్వడానికి, ఒక ఆడది ఆడించిన నాటకం లో, ఒక పావుగా మిగిలిపోయాడు.


ఎలాగైనా ఆ హార్డ్ డిస్క్ ఉగ్రవాదుల చేతిలో పడనీయకుండా, నా భారత మాత ను రక్షించుకోవాలి! అన్న కృతనిశ్చయంతో వేగంగా ఇంటికి వెళ్లి చిన్న పాప తో ఉన్న భార్య రేణుక ను దగ్గరకు తీసుకుని, కౌగిలించుకుని, చూడు ! నీలాంటి పుణ్యాత్మురాలికి అన్యాయం చేసాను. దేశ ద్రోహానికి పాల్పడ్డాను. మన పాప సాక్షిగా నీ దగ్గర తప్పు ఒప్పుకుంటున్నాను!” అంటూ తను చేసింది చెప్పి, ఏడుస్తున్న భార్యను ఓదారుస్తూ "నా కోసం నువ్వు బెంగ పడకు, నా ప్రాణం పోయినా, నా దేశానికి అన్యాయం చేయను! ఇదిగో ఈ హార్డ్ డిస్క్ చాలా జాగ్రత్తగా ఎవరికీ కనబడకుండా దాచు. రేపు నా స్నేహితుడు ఏ వన్ వైజాగ్ వస్తున్నాడు. నాకు ‘అతను కూడా, ఒక సీక్రెట్ ఏజెంట్ తీవ్రవాదులకు, అని నా నమ్మకం! అయినా ఫ్రెండ్లీగా రేపు నేను వెళ్లి అతనిని కలుస్తాను. ఒకవేళ ఏమైన నాకు ప్రాణాపాయం జరిగితే నీకు తెలిసిన ఆ మరుక్షణం, ముందుగా నేను నీకు ఇస్తున్న హార్డ్ డిస్క్ పెట్రోల్ పోసి తగలబెట్టి, ఆ బూడిదను కూడా సముద్రం లో కలిపేయి!” అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూన్న భార్యను సముదాయిస్తూ, నీకు, పాపకి మొత్తం నా ఆస్తి అంతా వీలునామా ఎప్పుడో రాసేశాను. నన్ను మనసారా క్షమించు! ఒకవేళ నేను బతికి బట్ట కడితే, నాకు నేనే స్వయంగా భారత ప్రభుత్వానికి ఆ హార్డ్ డిస్క్ ఇచ్చి వారు వేసిన శిక్ష అనుభవిస్తాను.


ఏదైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి! ఒకవేళ నా కోసం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ పోలీస్ ఎవరైనా వచ్చి అడిగితే, నా వివరాలు ఏమి తెలియనివ్వకు!”అంటూ మొత్తం చెప్పి, భార్యను, పాపను ముద్దాడి, ఆ రాత్రికి రాత్రి వేరే చోట ఉంటూ, ఏ వన్ ఫోన్ రాగానే, విశాఖపట్నం లో ఉన్న ఆ పెద్ద మాల్ లో బార్ అండ్ రెస్టారెంట్ లో కూర్చుని ఏ వన్ కోసం ఎదురు చూడసాగాడు శేఖర్.


ఎంతో హడావిడి గా ఏవన్ వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో దిగి నేరుగా, శేఖర్ కు ఫోన్ చేసి, విశాఖపట్నం లో పేరుగాంచిన ఆ పెద్ద మాల్ కు వచ్చి శేఖర్ ని చూడగానే, ఆశ్చర్యంతో “ఏంటి? శేఖర్.. అలా అయిపోయావ్? నీకోసం బీ వన్ చాలా కంగారు పడుతుంది, నీ ప్రేమ కోసం ఎంతో ఆశగా కెనడాలో ఎదురుచూస్తుంది” అంటూ ఇద్దరికీ రెండు లార్జ్ పెగ్గులు స్కాచ్ విస్కీ ఆర్డర్ చేసి, తాగుతూ అన్నాడు బివన్.

“ఏం లేదు! పరిస్థితులు బాగోలేక, నేను నా ఉద్యోగానికి రిజైన్ చేశాను. ఇక నేను విశాఖపట్నం లోనే ఉంటాను” అనేసరికి,


“అదేంటి? నీకు ఏదో ప్రాజెక్టు పనులు చెప్పానని, వాటి డీటెయిల్స్ తో ఉన్న "హార్డ్ డిస్క్" ఇస్తావని, నన్ను తీసుకు రమ్మని అర్జంటుగా పంపించింది. అది ఎక్కడ పెట్టావు? తొందరగా తెస్తే నేను రేపే నాతోపాటు తీసుకువెళ్లి బీ వన్ కు అందజేస్తాను!” అని అనగానే శేఖర్ కి ఏ వన్ కూడా ఒక తీవ్రవాది అని, వీరిద్దరూ కలిసి, నన్ను ఒక పావులా చేసి, నా దేశ భద్రతకు ఆపద తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారని రుజువయ్యింది.


శేఖర్ వెంటనే తల పట్టుకొని కూర్చొని “నాకు చాలా తలనొప్పిగా ఉంది! నేను మాట్లాడలేను !” అంటూ మరి కొంచెం మందు తాగి, టేబుల్ మీద తలవాల్చుకోనేసరికి, ఏ వన్ మాట్లాడుతూ, “ఉండు !నీ కోసం ఒక తల నొప్పి టాబ్లెట్ తెస్తాను. అది వేసుకుని తగ్గిన తర్వాత మాట్లాడుకోవచ్చు!” అంటూ బయటకు వచ్చి బివన్ కి ఫోన్ చేసి అసలు విషయం చెప్పాడు.


ఏవాన్, వెంటనే రిపీట్ గా, "ప్లీజ్ ఎలిమినేట్ ది క్యారెక్టర్. hurry up" అని ఫోన్ పెట్టేసింది బివన్..


అప్పటికే రాత్రి 9:30 అవుతున్న సమయంలో “ఇదిగో ఈ తలనొప్పిమందు, వెంటనే వేసుకో. తలనొప్పి తగ్గిపోతుంది’ అని నల్లని capsule ఇచ్చి, గ్లాసులో నీళ్ళు అందించాడు ఎవాన్.

అప్పుడు అసలే మందు నిషాలో ఉన్న శేఖర్ “ఒరేయ్.. మీఎత్తుగడ తెలిసిందిరా! నువ్వు బి వన్ కలిసి, నన్ను ట్రాప్ చేసి దేశ భద్రతకు సంబంధించిన వివరాలు సేకరించడానికి.. ప్రేమాయణం సృష్టించి, నన్ను ఒక పావు లాగా వాడారు. అయినా మీ లాంటి నరరూప రాక్షసుల కు నా దేశాన్ని తాకట్టు పెట్టను. ఆ వివరాలన్నీ రేపే వెళ్లి ఇంటెలిజెన్స్ విభాగానికి ఇచ్చి లొంగిపోతాను. నా దేశం నాకు ఏ శిక్ష వేసిన ఆనందంగా అనుభవిస్తాను. నేను చేసిన పనికి నాకు ఆ శిక్ష పడాల్సిందే !!” అంటూ అనే సరికి, ఇక లాభం లేదు అనుకొని, చుట్టుపక్కల చూసి ఏవన్ సైనేడ్ క్యాప్సిల్ ను తల నొప్పి ముందుగా నమ్మించి, బలవంతంగా శేఖరు చేత మింగించాడు.

అంతే! మూడే మూడు నిమిషాలలో శేఖర్ ప్రాణం నురగలు కక్కుతూ అనంత వాయువుల్లో కలిసిపోయింది. ఈ అసలు కథ చేదించడానికే, ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి రాజశేఖర్ గారు అన్ని కోణాల్లోనూ శేఖర్ హత్యపై పరిశోధించ సాగారు.


( సశేషం: రాజశేఖర్ గారు హంతకుడి ఆచూకీ ఎలా తెలుసుకుంటారు?, హంతకుడి కదలికలను విశాఖపట్నం సరిహద్దులు దాటకుండా ఆపగలిగారా! అన్న విషయాలు 8వ భాగం లో చదువుదాం. )


వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.



23 views0 comments
bottom of page