top of page

సైనైడ్ - ఎపిసోడ్ 8

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Youtube Video link

'Cyanide Episode 8' New Telugu Web Series
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ధారావాహిక 'సైనైడ్' ఎనిమిదవ భాగం


గత ఎపిసోడ్ లో

ఏ - వన్, శేఖర్ తో మాట్లాడాక బి - వన్ కి కాల్ చేస్తుంది.

శేఖర్ ని ఫినిష్ చెయ్యమని చెబుతుంది.

తాను సేకరించిన వివరాల తాలూకు హార్డ్ డిస్క్ ను భార్యకు అప్పగించి, బి - వన్ ని కలుస్తాడు శేఖర్.

శేఖర్ చేత సైనైడ్ కాప్సూల్ మింగిస్తాడు బి - వన్.


ఇక సైనైడ్ ఎనిమిదవ భాగం చదవండి

ఆ తర్వాత జరిగిన సంఘటనలలో 'శేఖర్ మృతదేహం', ‘హత్య ఉదంతం’ అన్నీ బయట పడిన వెంటనే, శేఖర్ భార్య ఆ విషయాలన్నీ పేపర్లలో చదివి, టీవీలో చూసి, విపరీతమైన వేదనతో, వెంటనే మిగతా విషయాలన్నీ పక్కన పెట్టి, అతి రహస్యంగా దాచిన 'హార్డ్ డిస్క్' 'ను ఒక సుత్తి తో ముక్కలు ముక్కలుగా కొట్టేసి, అది పిండి అయిపోయిన వరకు, తన మనస్సులోని బాధ అంతా కలిపి, ఆ గుండ ని కొంచెం పెట్రోల్ పోసి తగలబెట్టి, మసి అయిపోయిన తర్వాత, అంతా ఒక ప్లాస్టిక్ బ్యాగులో పెట్టి, ఆ సాయంత్రమే ఒక ఆటో చేయించుకుని, 'ఆర్కే బీచ్ 'లో కి వచ్చి, ఆ బూడిద అయిపోయిన మసిని బ్యాగ్ లోంచి తీసి, సముద్రపు కెరటాలలో పోస్తు, శేఖర్ ని తలుచుకుంటూ వెక్కివెక్కి ఏడుస్తూ, “చూసారా అండీ! మీ చివరి కోరిక 'భారతదేశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ శత్రువుల చేతిలో పడకుండా’ మీరు చెప్పినట్టే సముద్రంలో కలిపేసాను.


మీరు నిజంగా దేశద్రోహి కాదు, 'దేశభక్తుడు ' అని నిరూపించుకున్నారు !! మీ ఆత్మకు సదా శాంతి కలగాలని మీ భార్య గా, నేను కూడా సముద్రంలో కలిసి పోదాం అన్నా మన చిన్న పాప భవిష్యత్తు దృష్ట్యా మీ గుర్తుగా ఆ పాపను కూడా ఒక 'దేశ భక్తురాలు గా' చేసే బాధ్యత నాకు ఉంది!

గనక నేను సర్వశక్తులు ఉపయోగించి, మన పాపని బాగా చదివిస్తాను!” అంటూ ధైర్యం తెచ్చుకుని కళ్ళనీళ్ళు తుడుచుకుని, ఒక మొక్కవోని ధ్యేయం తో ఇంటికి వచ్చి, పాపని ఎత్తుకొని తనను తాను సముదాయించు కొంది దిగవంత శేఖర్ భార్య రేణుక.


'ఇంటిలిజెన్స్ చీఫ్' మిస్టర్ రాజశేఖర్ గారు ఎంత తల బద్దలు కొట్టుకున్నా, ఎలాంటి క్లూ దొరకక సతమతమవుతున్న ఆ సమయంలో, పోస్టుమార్టం చేసిన డాక్టర్ గారి దగ్గరనుంచి ఒక ఫోన్ వచ్చింది.


‘ హలో!’ అనగానే “సార్! మనకు ఒక చిన్నక్లూ దొరికింది. శేఖర్ ని చంపిన హంతకుడి ప్రతి అడుగును, సీసీ కెమెరా ఫుటేజ్లో ఒక డిఫరెన్స్ కనబడ్డది. అదేమిటంటే అతనికి పొడుగాటి జుట్టు ఉండటం, దాని వెనకాల రబ్బరు బ్యాండు పెట్టి ఉండడం, హంతకుడు హడావిడిగా మాలు బయటకు వెళుతున్నప్పుడు, ఆయన అడుగులు ఒక ఫుటేజ్లో క్లియర్గా కనబడ్డాయి. అది ఏమిటంటే, ఎడమ కాలు పాదం, కుడికాలు పాదం కన్నా 2 అంగుళాలు ఎక్కువగా ఉంది.


నడుస్తున్నప్పుడు కూడా 'చిన్నకుంటి ' గా నడవడం, ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప తెలియలేదు! ఈ రెండు క్లూ లు మీకు ఏ విధంగా ఉపయోగపడతాయో!?, అనే నేను' పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ కి' వస్తున్నాను. మీరు త్వరగా వస్తే case ఛేదించడానికి, ఎక్కడైనా ఒక మంచి కారణం దొరుకుతుంది! ప్లీజ్.. త్వరగా వస్తే, మీకు అన్ని వివరాలు సీసీ ఫుటేజ్ కవరేజ్ లో చూపిస్తాను!” అని ఫోన్ పెట్టేశారు డాక్టర్ గారు.


అంతే! ఆ మరుక్షణం ఎంతో హడావిడి గా రాజశేఖర్ గారు తయారై, పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ కి వచ్చి అన్ని విషయాలు పరిశీలించి, ఒక రకమైన ఉత్సాహంతో, వెంటనే 'పోలీస్ ఆర్టిస్ట్ ని పిలవండి! నేను మాట్లాడాలి!’ అంటూ బయటకు వచ్చి కాఫీ తాగుతూ, ఒక చేతిలో సిగరెట్ ని ఘాటుగా పీలుస్తూ, ఎన్నో ఆలోచనలతో మునిగిపోయారు రాజశేఖర్ గారు.


'విశాఖపట్నం లోని అన్ని ప్రధాన కూడళ్లలో, ఆసుపత్రుల దగ్గర, హోటల్స్ దగ్గర, సినిమా హాల్స్ దగ్గర, 'గాజువాక' లాంటి పారిశ్రామిక ప్రదేశంలో అన్నిచోట్ల 'హంతకుడి ఊహా ముఖచిత్రం’, దానికిందన ఎర్రని అక్షరాలతో, "ఒక పొడుగాటి జుట్టు గల వ్యక్తి, కుంటి గా నడుస్తూ, ఆరడుగుల పొడుగు తో, ఉన్న ఈ హంతకుడి వివరాలు ఎవరికైనా దొరికిన, చూసిన, వెంటనే 'పోలీస్ కమిషనరేట్ 'కాల్ చేయ వలసింది” అంటూ పోలీస్ హాట్ లైన్ నెంబర్ ఇచ్చి, ‘ఈ వివరాలు ఇచ్చిన వ్యక్తులకు 'భారీ పారితోషకం ' కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. అన్న ఊహ ముఖచిత్రం, దాని కింద వివరాలతో, పెద్ద పెద్ద పోస్టర్లు వేయించి, విశాఖపట్నం లో అన్ని ప్రధాన జంక్షన్లలో, ఆ రాత్రికి రాత్రి ప్రింట్ చేయించి, మరీ పెట్టించారు రాజశేఖర్ గారు.

ఆయన కూడా ఇద్దరు 'హైయర్ అఫీషియల్ ని' తీసుకుని, అన్ని ప్రధాన జంక్షన్లలో ముఖ్యంగా 'మధురవాడ ఏరియాల్లోనూ' క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లను, మఫ్టీలో ఉంచి, పరిశోధించ సాగారు.


అన్ని విధాల పరిశీలిస్తున్న రాజశేఖర్ గారికి ఈ కేసు ఎలా ముగుస్తుందో కూడా తెలియక సతమతమవుతున్న వేళ 'పోలీస్ కమిషనరేట్ 'నుంచి ఒక కాల్ వచ్చింది.


“సార్! మీ కోసం ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు మీ తోనే మాట్లాడాలి అట మేము ఎంత అడిగినా ఏమీ చెప్పడం లేదు! ప్లీజ్ ఒకసారి రాగలరా.. అంటూ ఒక ఇన్స్పెక్టర్ ఫోన్ చేసేసరికి, ‘ఏమో? ఏ పుట్టలో ఏ పాముందో!’ అనుకుంటూ అమితమైన వేగంతో ఆఫీస్ కి వచ్చారు రాజశేఖర్ గారు.


“నమస్తే సార్! నాకు మధురవాడ లో ఒక హెయిర్ కటింగ్ సెలూన్ ఉంది. మీ పోస్టర్లు చూసిన తర్వాత, అలాంటి ఒక వ్యక్తి ఎన్నో రోజులుగా మా వీధిలో నుంచే వెళుతుండటం, నిన్న రాత్రి ఏడు గంటలకు వచ్చి తన పొడుగాటి జుట్టు ను, నీటుగా కత్తిరించు కొని వెళ్ళాడు. అప్పటికీ నేను అతన్ని అడిగాను. ఆయన వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతూ, “చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నీ సెలున్ లో జుట్టు కత్తిరించు కుందామని! కానీ నాకు వీలుపడలేదు” అంటూ 500 రూపాయల నోటు ఇచ్చి, నా దగ్గర చిల్లర కూడా తీసుకోకుండా నవ్వుతూ, “ఉంచుకో!” అంటూ ఏదో ఫోన్ రాగానే చాలా హడావిడిగా వెళ్ళిపోయాడు.


ఈ విషయం ఇక్కడ చెప్పిన ఎవరు నమ్మరు గనుక, మీకే స్వయంగా చెప్పాలి. ఈ హంతకుడి ఫోటోని, చూసి అచ్చు అదే పోలికలో ఉన్నదని మీకు చెప్పడానికి వచ్చాను, ఇంతకన్నా మరేం లేదు సార్!” అనగానే, ఒక్కసారిగా రాజశేఖర్ గారు లేచి, “నీ పేరేమిటి? నువ్వు దేశానికి ఎంత సేవ చేశావో, ఇప్పట్లో నీకు తెలీదు, హంతకుడు దొరికిన తరువాత, నీకు 'కేంద్ర ప్రభుత్వం ' నుంచి పారితోషకం వచ్చేలా నేను చూస్తాను ! నువ్వు జాగ్రత్తగా వెళ్లి పో’ అంటూ భుజం తట్టి అతన్ని పంపించేశారు.


వెంటనే నలుగురు కానిస్టేబుల్స్ ని పిలిచి, 'మధురవాడ ఏరియా ' అంతా గాలించిమని, మరో పదిమంది కూడా వెళ్లి ప్రతి ఒక్క రోడ్డు, అక్కడ ఉన్న జోళ్ల దుకాణాలు కూడా వెతకమని చెప్పండి. ఈ పోస్టర్స్ చూసిన తర్వాత, హంతకుడు ఎక్కడైనా షూస్ కొన్నాడు ఏమో ? అలాంటి వ్యక్తులు ఎవరైనా కుంటి గా నడుస్తూ వచ్చి రెండు సైజుల షూస్ కొన్నారా! అన్న విషయాలు కనుక్కోండి’ అంటూ తను కూడా కారులో బయలుదేరారు రాజశేఖర్ గారు.


(సశేషం; రాజశేఖర్ గారు తనకు దొరికిన ఒక క్లూ తో హంతకుడిని పట్టుకోగలిగారా.. ఈ లోపల హంతకుడు వేరే ప్రదేశాలకు పారిపోవడానికి ఎలా ప్రయత్నించాడు.. అన్నది 9వ భాగం లో చదవండిl)


వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం :

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.25 views0 comments

Comments


bottom of page