డబ్బుతో కొనలేనివి
- Gadwala Somanna

- Dec 10, 2025
- 2 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Dabbuthokonalenivi, #డబ్బుతోకొనలేనివి, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 151
Dabbutho Konalenivi - Somanna Gari Kavithalu Part 151 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 10/12/2025
డబ్బుతో కొనలేనివి - సోమన్న గారి కవితలు పార్ట్ 151 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
డబ్బుతో కొనలేనివి
--------------------------------------
అమూల్యమైన కాలము
స్వర్గంలాంటి సంతసము
డబ్బుతో కొనలేనివి
సృష్టిలో విలువైనవి
పవిత్రమైన స్నేహము
ఆత్మీయుల అనుబంధము
డబ్బుతో కొనలేనివి
తల్లిదండ్రుల ప్రేమలు
మహనీయుల సూచనలు
సాటిలేని అనుభూతులు
డబ్బుతో కొనలేనివి
చిన్ని చిన్ని ఆనందాలు
గురుదేవుల బోధనలు
వారి ఘనమైన వాక్కులు
డబ్బుతో కొనలేనివి
అమ్మానాన్నల మనసులు

పేదల బ్రతుకులు అంతేలే!!
-----------------------------
జీవితమంతా కన్నీళ్ళే
అడుగడుగునా కష్టాలే
పేదల బ్రతుకులు అంతేలే!!
చూడ నిరాశానిస్పృహలే
ఆకలితో ఆరాటమే
జీవితాల్లో పోరాటమే
పేదల బ్రతుకులు అంతేలే!!
ధనవంతులకు ఊడిగమే
చూడు దౌర్జన్య పీడితులే
కాయ కాష్టం వారసులే
పేదల బ్రతుకులు అంతేలే!!
తలరాతలే మారవులే
ఇంతేనా ఈ జీవితాలు
ప్రసరించేనా రవి కిరణాలు
కొండపై కట్టిన కోటలై
ఉండేనా ప్రగతి బాటలై

శ్రేష్టమైనది స్నేహము
----------------------------------------
సృష్టిలోన తీయనిది
భేదాలే లేనిది
పరిశోధన చేయగా
స్నేహమే విలువైనది
త్యాగంతో కూడినది
క్షేమాన్నే కోరునది
ఆలోచన చేయగా
స్నేహమే శ్రేష్టమైనది
అసమానతలు ఎరుగనిది
వెన్నుపోటు పొడవనిది
గమనించి చూడగా
స్నేహమే సాటిలేనిది
ప్రేమలు వెదజల్లునది
వెన్నంటే ఉండునది
స్నేహమే లోకంలో
భుజం తట్టి నడుపునది

వినయంతో ఒదగాలి
-----------------------------------------
హృదయాలను భగవంతుడు
పరిశీలన చేయువాడు
అహంకార హృదయులను
అట్టడుగుకు తొక్కువాడు
జాగ్రత్త దేవునితో
ఆడరాదోయ్! ఆటలు
ఉండాలోయ్! భయంతో
బాగుండును కుటుంబాలు
భక్తిలేని జీవితాలు
కాల్చబడిన కాగితాలు
చివరికి మిగులును భస్మము
ఉండనే ఉండదు క్షేమము
దైవ నామ ధ్యానంలో
వారు ఇచ్చు జ్ఞానంలో
జీవితంలో ఎదగాలి
వినయంతో ఒదగాలి

ఆమని కోయిల కూసింది!
-------------------------------------------
వసంత కాలం వచ్చింది
క్రొత్తదనమే తెచ్చింది
ఆమని కోయిల గొంతెత్తి
స్వాగత గీతం పాడింది
ప్రకృతి అందమే పెరిగింది
నయనానందము పంచింది
ఎటుచూసినా పచ్చదనము
చాటిందోయి గొప్పదనము
చూడు చూడు మధుమాసము
చెట్ల కొమ్మల సింగారము
ఆశలెన్నో రేకిత్తిస్తూ
అరుదెంచెను మన కోసము
లేత చిగురులు తొడుగుకుని
కొత్త దుస్తుల్లా వేసుకుని
పరుగు పరుగున వచ్చె ఆమని
కొత్తగా తోచెను యామిని
ఆమని వచ్చిన వేళలో
పండుగ వచ్చెను జగతిలో
కోయిల గొంతు విన్నంతనే
మోదం పొంగెను మనసులో
కోయిల గాత్రమే తీయన
ఆమని రూపమే చక్కన
వెరసి మనమంతా మహిలో
తరిమి తరిమి కొడుదాం వేదన

గద్వాల సోమన్న




Comments