top of page
Original.png

దైవ దూషణ మానాలి

#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #DaivaDushanaManali, #దైవదూషణమానాలి, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 130


Daiva Dushana Manali- Somanna Gari Kavithalu Part 130 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 10/10/2025

దైవ దూషణ మానాలి - సోమన్న గారి కవితలు పార్ట్ 130 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


దైవ దూషణ మానాలి

-------------------------------------------

దైవమే లేకుంటే

జీవితం కడు శూన్యము

వారి కృప లేదంటే

జీవించడం వ్యర్థము


దేవున్నే దూషిస్తే

సృష్టికర్తను వదిలేస్తే

అపారమైన నష్టము

అవధులు లేని నష్టము


దైవ దూషణ పాపము

చూడంగా దారుణము

దాని కంటే మరణమే

అట్టి వారికి శరణమే


భగవంతుని ప్రేమించు

భక్తితోడ పూజించు

వితండ వాదాలకు స్వస్తి

పలకమని నా విజ్ఞప్తి











గురువు గారి మేటి మాటలు

-----------------------------------------------------

ఆలోచన లేనిచో

అభివృద్ధి ఎండమావి

అప్పులు ఎక్కువైతే

అదే కదా పెద్ద ఊబి


విచక్షణ క్షీణిస్తే

పశు స్వభావం ఖాయము

మానవత్వం నశిస్తే

దానవత్వమిక వశము


సంస్కారం వీడితే

అహంకారం ముదిరితే

జీవితం బద్దలగును

భవిష్యత్తు మాయమగును


కోపమే అధికమైతే

అసూయ ఆవిరిస్తే

ఆరోగ్యం దెబ్బతినను

ఆనందం ఆవిరగును





















చిన్నోడికి సూర్యుని సందేశం

-------------------------------------------------------

అమ్ముకోకు నమ్మకాన్ని

కోల్పోకు గౌరవాన్ని

అవి పోతే తిరిగిరావు

వదలకు సంస్కారాన్ని


తప్పిపోకు న్యాయాన్ని

మరువబోకు ధర్మాన్ని

ఎట్టి పరిస్థితులోనూ

కాదనకు రక్త బంధాన్ని


ముఖమున మందహాసాన్ని

గుండెల్లో ధైర్యాన్ని

ఎప్పుడూ వీడవద్దు

శ్రేష్టమైన స్నేహాన్ని


సాధించిన విజయాన్ని

పెట్టుకున్న ఆశయాన్ని

చులకనగా చూడరాదు

మంచి చేయు దైవాన్ని












కర్తవ్య పాలన

-----------------------------------------

కలం కత్తి పట్టుకుని

అవినీతిని ఖండించుము

అక్షరాలు నేర్చుకుని

తొలగించుము అజ్ఞానము


స్వయం కృషిని నమ్ముకుని

అభివృద్ధిని సాధించుము

సన్మార్గం ఎంచుకుని

మంచినే బోధించుము


విశ్వాసం పెంచుకుని

ఆశయాన్ని నెరవేర్చుము

ఉత్తేజము పుంజుకుని

మేటి పనులు చేపట్టుము


సంశయాలు మానుకుని

పొందుకొనుము ఆనందము

తలంపులు దిద్దుకుని

చాటుకో! ఆదర్శము


కన్నవారు వేల్పులని

కడవరకు ప్రేమించుము

వృద్ధులే మాన్యులని

మనసుతో సేవించుము










కన్పించే వేల్పులు కన్నోళ్లు

----------------------------------------

తల్లిదండ్రుల ప్రేమను

వారు చేసే సేవను

లెక్కింపగ అసాధ్యము

వారి ఋణం తీర్చలేము


త్యాగానికి ప్రతీకలు

పూజింపగ అర్హులు

అమ్మానాన్నలు మహిలో

ఇల తలపోయుము మదిలో


మింటిలోన రవిచంద్రులు

కన్పించే తల్లిదండ్రులు

దేవుని ప్రతిరూపాలు

కుటుంబాన దీపాలు


ప్రేమతో పలకరించు

వారి మదులు పులకరించు

సాటిలేరు కన్నోళ్లకు

ప్రేమగల హృదయాలకు


-గద్వాల సోమన్న

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page