top of page

దర్పం


'Darpam' - New Telugu Story Written By M. Bhanu

'దర్పం' తెలుగు కథ

రచన: M. భాను

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

“సహాయం చేసే మనసున్నా సాయం చేయగలిగే స్థోమత నాకు లేదు అన్నయ్యా!” అంది విశాలాక్షి తన అన్నయ్య రమణతో. ఎన్నో ఆశలతో వచ్చిన రమణ ఆ మాటలు విని నిర్ఘాంత పోయాడు. చెల్లి నుంచి అటువంటిమాట వస్తుందనుకోలేదు. ఏం మాట్లాడాలో తెలియక విశాలాక్షిని చూస్తూ ఉండి పోయాడు.

ఇంతలో విశాలాక్షి వదిన “అదేమిటి విశాలాక్షి! ఎప్పుడు చూసినా కారులో వస్తావు, దర్జాగా తిరుగుతూ ఉంటావు. నీకు డబ్బు లోటేమిటి?” అడిగింది. “యాభై వేలే కదా!? బయట వడ్డీకి తీసుకుంటే కట్టలేమని నిన్ను అడిగాము. స్వంత చెల్లెలివి కదా కడుపులో పెట్టుకుంటావు అని అనుకుంటే ఇలా అనేసావేమిటి” అంది వేదనగా.

“అందరికీ అలాగే కనిపిస్తుంది నా జీవితం. అయినా ఒకసారి వచ్చి మా ఇంట్లో పది రోజులు ఉంటే మా పరిస్థితి మీకు తెలుస్తుంది.

అన్నయ్యా! మీ బావగారికి డాబూ దర్పం ఎక్కువ. ఎక్కడా కూడా డబ్బు లేదనే విషయం ఎవరికీ తెలియకుండా అప్పులు చేసి ఖర్చు పెడుతూ ఉంటారు. ఎప్పుడు మీ దగ్గరికి వచ్చినా కారు అద్దెకు తీసుకుని పంపిస్తారు. దుబారా ఖర్చులు ఎందుకని చెప్పినా వినరు. దానికి తగ్గట్టుగానే మా అత్త మామ కూడా ‘బంధువుల దగ్గర పరువు పోకూడదు. మనం ఎక్కడా చులకన కాకూడదు’ అంటూ లేనిపోని దర్పాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు.


ఆయన బిజినెస్ అంతంతమాత్రమే లాభనష్టాల్లో నడుస్తూ ఉంటుంది. లాభం వస్తే పట్టుకోలేము. నష్టం వస్తే ఇంకా అప్పులు పెరిగిపోయాయి. ఎవరికీ చెప్పుకోకుండా కడుపులో పెట్టుకొని బతుకుతున్నాను. నా మాట వినేవాళ్ళు లేరు ఇక్కడ.


ఒకవేళ ఎవరైనా వచ్చి వారం రోజులు ఉన్నా కూడా ఇదే దర్పాన్ని ప్రదర్శిస్తారు తప్పితే ఎక్కడా తగ్గేదే ఉండదు. వెళ్లేటప్పుడు దoడిగా బట్టలు పెట్టి పoపుతారు”


కొత్తగా విoటున్న విషయాలకు నోరెళ్ళబట్టి చూస్తారు అన్నా, వదిన.


“వదినా! మరి నువ్వు వేసుకువచ్చే నగలు!?”


“అవి కొన్ని నిజమైనవి, కొన్ని గిల్ట్. ఈ ఆడoబరాలు మమ్మల్ని ఎక్కడకు తీసుకువెళతాయో? ఏ పరిస్థితి ఎదుర్కోవాలో తెలియదు. దయచేసి బావగారిని ఏమీ అడగకoడి. గొప్ప కోసం పోయి ఎక్కువ వడ్డీ కి తెచ్చి ఇస్తారు. ఇoక నా వల్ల కాదు” అని కన్నీటి పర్యoతము అవుతున్న విశాలాక్షిని చూసి ఏమి అనాలో తెలియక “సరే! జాగ్రత్త. మేము బయలుదేరతాము” అని లేచారు.


ఇoతలో బయట నుంచి లోపలికి వచ్చిన విశ్వనాథo “అరే బావగారు! ఎప్పుడు వచ్చారు?” ప్రశ్నలు అడుగుతూ మాటలతో ఉక్కిరిబిక్కిరి చేసేసాడు.


ఆ మాటలకు రమణ “వచ్చి చాలా సేపు అయ్యింది. బయలుదేరుతున్నాము. అమ్మాయ్ జానకి పెళ్ళి కుదిరింది. ముహుర్తాలు పెట్టి మళ్లీ వస్తాను కార్డ్ ఇవ్వటానికి” అన్నాడు.


“ఇoత మoచివార్త అoత నీరసం గా చెబుతున్నారేమిటి? మీకు ఏ సహాయం కావాలన్నా చెప్పొచ్చు. చిటికెలో ఏర్పాటు చేస్తాను” అoటున్న బావగారితో “అలాగే తప్పకుండా చెబుతాను. మీరు ఇoత మాటన్నారు అదే పదివేలు” అని చెల్లిని జాలిగా చూస్తూ బయటకు నడిచారు.


‘గొప్పలకు అప్పులు చేసి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే వారు ఉoటారని ఇప్పుడే తెలిసింది. రేపన్నరోజు పిల్లలు పుడితే ఎలా ఉoటుoదో!?’ అనుకున్నారు.

***

M. భాను గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నమస్తే అండి. నా పేరు భాను. నేను టీచర్ గా పని చేసి ఉన్నాను. కథలు వ్రాయాలి అని తపన. వ్రాస్తూ ఉంటాను. ప్రస్తుతం నేను మావారి ఉద్యోగరీత్యా రంపచోడవరం లో ఉంటాను.

ధన్యవాదములు 🙏
36 views0 comments

Comments


bottom of page