top of page

దాటిన మలుపు'Datina Malupu' - New Telugu Story Written By Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 03/07/2024

'దాటిన మలుపు' తెలుగు కథ

రచన: యశోద గొట్టిపర్తి


అప్పుడప్పుడు చిలిపి తగాదాలే కానీ చీదరింపులు ఎన్నడూ రావు.. వచ్చినా శ్రావణ మేఘాల్లా విడిపోతాయి. కల్యాణం అనే పదంలోనే "కయ్యం "అను శబ్దం కొంచెం ఉంది.. మరి ఇన్నాళ్ళ తర్వాత కొంతైనా కిరికిరి కనిపిస్తుంది అని చూద్దామంటే చిన్న కారణం కూడా దొరకలేదు.. 


 మా మమ్మీ.. డాడీని అంతగా ప్రేమించిందో.. లేదో .. అర్థమయ్యేది కాదు కానీ, నా మీద చూపించిన అంత గొప్ప ఆ ప్రేమతో నాకు అలాంటి ఆలోచనలేదు, అర్థంకాదు, కాకపోయేది కూడా.. ఇలా ఇంతవరకు తీసుకు వచ్చింది అమ్మ ప్రేమ అంటూ.. 

 రెండు చేతులతో చుట్టేసి.. 

 

 “నిన్ను పెళ్లి చేసుకున్న పుణ్యమే జీవా ఇదంతా..” 


“మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయకు? నా ప్రమేయం ఏం లేదు”

 

“లేదా? ఇరవై ఏళ్ల ప్రేమకి దూరం చేసి నిన్ను పెళ్లి చేసుకుని నీకు దగ్గరయ్యాను.. అంటే ఇప్పుడు మీపై ఎంత ప్రేమ చూపిస్తున్నానో.. నన్ను ఈ విధంగా ఆలోచింపచేస్తుంది. 


ఇప్పుడు ఉదయాన్నే నా ముఖమే మీకు వెలుగు బాట.. నా అందాన్ని మెచ్చుకుంటూ ప్రేమజల్లులతో పరవశింప చేస్తుంటే చిన్న పిల్లనైనా పెరిగిన పసి గుణాలను పంచు కుంటున్నా. 


ఆనాటి పిల్లను అమ్మ చాటు బిడ్డను మాత్రమే నాన్నకు.. కానీ.. 


 టీ అందించడంతో.. స్నానానికి నీళ్లు, భోజనం వడ్డించడం ప్రతీది అమ్మ చేతులతో అన్నీ చేయించుకున్న.. నాన్నను చూశాను.. కానీ అమ్మను నిజంగా ప్రేమించేవాడా ?ఇప్పుడైతే నా జీవా నన్ను ఒక్కపని చేయనివ్వడు.. 


 నా చేతులు కందిపోతాయేమో? అని తనే అందిస్తున్నాడు. 

 ‘డార్లింగ్ ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు’ అని.. 

 లో లోపల అనుకుంటూ ఉండగా


 నడుము చుట్టూ చేతులేసి “విడవ లేను నిన్ను” అనగానే 

 “జీవా, నువ్వా!” అంటూ అలాగే పైన ఒదిగి “నాన్న అనురాగం చూపించావు" అన్నది.. 


“నీకు పెళ్లయింది. ప్రతిదీ అమ్మానాన్న అని గుర్తు చేసుకుంటే నువ్వు అక్కడే ఉన్నట్టుంది. సరేలే నువ్వు కళ్ళు మూసి తెరిచే లోగా నీకు మంచి కాఫీ తెస్తాను”. 


“ఉహూ! వద్దండీ” అంటూ తను ముందుగా వెళ్లి స్టవ్ వెలిగించి చిక్కటి కాపీ కప్పుతో వచ్చింది.. 


“మరి నీకు?”


“నేను తెచ్చుకుంటా..”


“వద్దు.. ఇప్పుడు రెండు చేస్తాను చూడయితే”..


 సాసర్లో పోసి నోటికి అందించాడు. 


“ఈరోజుకు నీవు చేయడం చాలు, ఇక అంతా నేనే చేస్తాను”. 


“నువ్వు నేను ఇద్దరం కలిసి చేసుకుందాం”.

 

“మా చిన్నతనం నుండి చూసా. మా నాన్న ఎప్పుడూ హాల్లో ఉంటే అమ్మ కిచెన్లో పనిచేసేది. ఇద్దరూ కలిసి ఏ పనీ చేయలేదు. చేసిన పనిని మెచ్చు కొనక పోయినా మౌనంగా లొట్టలేసుకుంటూ తినేవాడు..”

*** 


 కొన్ని నెలల తర్వాత.. 

 “సీమా, ఏమిటి.. నూనె గిన్నె ఈ డైనింగ్ టేబుల్ పైన పెట్టావు? అది స్టవ్ పక్కన ఉండాలి కదా..” 


 “ఏమైందో.. నాకు అలవాటు లేదు మర్చిపోయాను..”

 

“అప్పుడే ముసలి దానివైనట్లు ఆ మతిమరుపు ఏంటి? చేసే పని మీద ఏకాగ్రత పెట్టు’. 


“మీరు వంటగదిని మర్చిపోతే నేను అన్నీ గుర్తుపెట్టుకుంటాను. ఎంతసేపు నా వెనకనే సర్డుతూ, పెట్టిన వస్తువు మరిచిపోయేలా చేస్తున్నారు. నాకు వంట రాదనా?

లేక నచ్చటం లేకనా?” అంది సీమ. 


“ఇన్నాళ్లు మీరు నన్ను ప్రేమిస్తున్నారు అని మురిసి పోయాను.. కానీ నాకన్నా ఎక్కువగా అన్నిటిని గుర్తుంచు కుంటున్నారు. అయినా నాకన్నా ముందు మీకు వంటలే ఎక్కువగా పరిచయం కదూ.. అన్నీ అందరికీ బాగా కావలసినవి అయినా అమ్మ లాంటి వాళ్లకు మాత్రం అనుకూలం”. 


“సీమా! నువ్వు ముందునుండే అన్ని పనులు నేర్చుకుంటే నువ్వు చేయాలనుకున్నవన్నీ నీకు భారం అనిపించవు".. 


అలానే అంటారు కదా.. 

‘ఎన్నిసార్లు చెప్పినా పెడ చెవిన పెట్టినావు’ అంటుంది మా అమ్మ కూడా.. ఈ విషయాలు స్వతంత్రంగా అమ్మకు చెప్పుకునే అవకాశం కూడా కోల్పోయాను.. ఒకవేళ చెప్పినా నాకే వంట తెలియదని వడ్డింపులు పడతాయి.. 


 నా స్నేహితురాలు సుకన్యకు చెబితే కొంత ఉపశమనం దొరుకుతుంది. కాస్త సంతోషము దొరుకుతుంది.. అనుకొంది.


తన ఊర్లో ఉన్న సుకన్యకు ఫోన్ చేసి, “హలో సుకన్య! ఎలా ఉన్నావే ? ఫ్రీ గా ఉన్నావా?" అంది.

“చెప్పవే సీమా మీ ఇంటి సంగతులు..”

 

“నా సమస్యకు పరిష్కారం ఏమిటో నీకు మాత్రమే తెలుసు” అన్నది టెన్షన్ గా.. 


“కొత్త కాపురం, భర్త ప్రేమతో ఉన్న నువ్వు సమస్య అంటున్నావు?”


“నాకు వంట రాదని అస్తమానం ఏదో వంక పెడుతూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. మా వారు అన్నీ తనే దగ్గరుండి చేస్తున్నారు. నాకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మా ఇంటికి వెళ్లి, మా అమ్మకు చెప్పి, నా సమస్యకు ఒక దారి చూపవే..”

 

 “సరే వెళ్తాను. ఫోన్ పెట్టేసేయ్” అన్నది. 


 “నా బాధ్యత తీసుకునే దేవతవే. నువ్వు ఆదుకోవాలి..” 

 ***** 


“ఆంటీ! ఏం చేస్తున్నారు? సీమ పెళ్లి చేసుకొని వెళ్ళింది కదా.. ఒంటరిగా ఉన్నారు, కాస్త కాలక్షేపం అవుతుందని వచ్చాను” 

 

“నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నా కూతురు లాంటి దానివి, అంతా కులాసే కదా..” 

“అవునా ఆంటీ! మీరు రకరకాల వంటలు చేస్తున్నారు.. ఎలా వచ్చాయి.. నేర్చుకున్నారా, లేదా మీరే స్వయంగా సొంతంగా చేస్తున్నారా?"

 

“ఏం లేదమ్మా! మా పెద్ద వాళ్ళు చేస్తుంటే వెంట ఉండి చూసేదాన్ని.. ఆ తర్వాత వాళ్ళు దగ్గర ఉండి చెప్పేవారు. రాను రాను ఒంటరి సంసారాలు, ఉద్యోగాల హడావుడితో వంటలు పుస్తకాలను చూసి..

 

అది కొనడానికి డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక సొంతంగా వ్రాసుకునే దానిని.. పెద్ద వాళ్ళని అడిగి తెలుసుకొనేదాన్ని. ఈరోజుల్లో మీకు అంత తీరిక ఎక్కడిదమ్మా.. 


 కొత్త కాపురంలో మా అమ్మాయి ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏమో? వంటలు చేయడం రాదు. అందుకే నిన్ననే మా వారితో కలిసి ఒక ఆలోచన చేసాము. 


 కాస్త నేర్చుకునే అంతవరకు ఓపికతో చేసుకోవడానికి అన్ని వసతులు, గ్యాస్ స్టవ్లు, గ్రైండర్సు ఉంటున్నాయి.. కానీ సమయమే ఉండడం లేదు. ఇప్పుడే మా ఊరి నుండి ఒక డైరెక్ట్ బస్సు మా అమ్మాయి ఊరికి వేశారు. ఆ బస్సు ఇక్కడినుండి నైట్ స్టార్ట్ అవుతుంది”. 


“అవునా ఆంటీ..”


“అవునమ్మా! నేను చేసిన స్పెషల్ వంటకాలు, ఆవకాయ, మసాలా కూరగాయలు, మాంసాహారం కూడా మా పిల్లలకు ఇష్టమని చేసి బస్సు కండక్టర్ తో మాట్లాడి ఇస్తున్నాము. చాలా మంచివాడు అతను. 


‘ఇవ్వండి’ అని తీసుకుంటున్నాడు. 


బస్సు దగ్గరికి వెళ్లి కలెక్ట్ చేసుకుంటారని మా అమ్మాయికి ఫోన్ చేసి చెప్పి బస్ కండక్టర్ కు ఇచ్చి వస్తున్నామమ్మా”. 


“అలాగా ఆంటీ! చాలా సంతోషం.. మళ్ళీ వస్తాను” అని ఇంటికి వెళ్ళింది. 


 వెళ్ళగానే సీమ నుండి ఫోను మ్రోగింది. వెంటనే ఎత్తింది. 


“మా అమ్మనాన్నలు మా గురించి ఆలోచిస్తూ మాకు వంటలు చేసి పంపిస్తామన్నారు. ఈ రోజే బస్ దగ్గరికి వెళ్లి తెచ్చు కుంటామని చెప్పాము”. 


“అవునా! నేను అక్కడికి వెళితే ఆంటీ అంతా చెప్పింది.. నీ లైఫ్ లో వంట రాదు అనే ‘మలుపు దాటడం’ జరిగింది.. 

ఇక ఫుడ్ ఎంజాయ్ చేయండి” అని ఫోన్ పెట్టేసింది సుకన్య. 


 సమాప్తం


యశోద గొట్టిపర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి

హాబిస్: కథలు చదవడం ,రాయడం73 views0 comments

留言


bottom of page