దీప కాంతులు
- Addanki Lakshmi

- Oct 23
- 3 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #సంబరాలుఅంబరాన, #దీపకాంతులు, #దివ్య సందేశాలు, #ఆట వెలది

Deepa Kanthulu - New Telugu Poem Written By Addanki Lakshmi
Published In manatelugukathalu.com On 23/10/2025
దీప కాంతులు - తెలుగు కవిత
రచన: అద్దంకి లక్ష్మి
1
ఆశ్వయుజము నంద మావాస్య దినమున
దీపకాంతు లివిగొ దివ్యమైన
వెలుగు జిలుగు నింపు వేయి కాంతుల తోటి
వచ్చె పండు గిదియె వరము లొసగ
2
నారి సత్యభామ నరకుని వధియించె
న్యాయ ధర్మములను నాతి నిలిపె
సురల రక్ష కొరకు సూటిగా పోరి య
సురుల శక్తి గూల్చె సుదతి సత్య
3
ఇంటిలోన బెట్టె నింపుగా దీపాలు
సంధ్య సమయ మందు చక్కగాను
పిండి వంటలన్ని ప్రీతిగా వండిరి
లక్షణముగ జరిగె లక్ష్మి పూజ
4
చిచ్చుబుడ్లు కాల్చె చిన్నారు లందరూ
తారజువ్వ లెగిరి తాకె నింగి
భూమి మీద తిరిగె భూచక్రము లపుడు
దీప కాంతులిచ్చె దివ్యవెలుగు
5
దీపలక్ష్మి రావె దివిటీల కాంతిలో
ధనము నీయ వమ్మ ధరణిలోన
శాంతి సౌఖ్యమందు సకల జనుల గాచు
దీప సౌరభముల దివ్య శక్తి
సంబరాలు అంబరాన
-------------------------------
దీపావళి దివ్వెలు,
నింగికెగసిన తారా జువ్వలు
ఆనందాల హరివిల్లు
పిల్లల మనసులో వెలుగుల జల్లు
సీమటపాకాయలు
చిటపట లతో పరుగులు
కాకరపువ్వొత్తులు
కాంతి కాంతి కిరణాలు
పిల్లల కేరింతలు
పెద్దల దరహాసాలు
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు
తెలియ పరిచే పండుగలు.
ధర్మ రక్షణార్ధం నరకాసురుని సంహారం.
అంధకారం రూపుమాపి జగతిని జాగృతి పరిచే
దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ ప్రణమిల్లి..
దీపావళి కి స్వాగతం.
కుల మత వర్గ భేదాలు లేక జరుపుకునే,,
అమావాస్య చీకటిలో వెన్నెల వెలుగులు జిమ్మే పండుగ.
ఇంటింటా దీపాల వరుసలు దేదీప్యమానంగా వెలుగులూ
విద్యుత్ తోరణాలు వింత వింత శోభలు,,,
బంధువులు స్నేహితులకు ఆత్మీయ బహుమతులు
నూతన వస్త్రాలంకరణ పిల్లలందరికీ పెద్దల ఆశీస్సులు
ధర్మరక్షణకు వెలుగుల దారి చూపే దీపావళి
అందరకు ఆనందాల రవళి
శీర్షిక: దివ్య సందేశాలు
ఆట వెలది పద్యాలు
--------------------------------
1
ధరణి యందు న్యాయ ధర్మము నిలుపగా
సమరమున నరకుని సంహరించె
నంత రింపజేసె నవని భారము సత్య
దీప కాంతి దెచ్చె దివ్య వెలుగు
2
సంధ్య సమయమందు చక్కగా దీపాలు
వెలుగు నింపు జనుల వెతలు తీర్చు
లక్ష్మీదేవి పూజ లక్షణముగ జేయ
చిన్న వారు గాల్చె చిచ్చు బుడ్లు
3
పిండి వంటలన్ని ప్రీతిగా చేసేరు
రంగ వల్లు లేసి రమణు లంత
నాకసాన నెగిరె తారజువ్వలవిగో
పిల్లలంత గలిసి పేల్చె సరద
4
వివిధ రంగులెన్నొ విద్యుత్తు దీపాలు
కొవ్వు వత్తి జ్యోతి కూడ దసలు
మట్టి ప్రమిద లెల్ల మనకు మంచి దగును
పర్య వరణ రక్ష పాటుబడుము
5
దీప కాంతు లివియె దివ్య సందేశాలు
శాంతి సౌఖ్య మందు చల్లగాను
లోక కంటకులును తోక జాడించగన్
గలిసి కట్టుగాను కదలి రండు
***
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,




Comments