దీపావళి కవితలు

దీపావళి కవితలు – 2026
వివిధ రచయితల దీపావళి ప్రత్యేక కవితా సంకలనం
నిర్వహణ: మనతెలుగుకథలు.కామ్
చీకట్లను పారదోలే వెలుగుల పండుగ – దీపావళి!
అజ్ఞానంపై జ్ఞానం, నిరాశపై ఆశ, చీకటిపై వెలుగు సాధించే విజయానికి ప్రతీక దీపావళి.
ఇళ్లను దీపాలతో అలంకరించుకోవడమే కాకుండా, మనసుల్లో ప్రేమ, మానవత్వం, స్నేహం, సహనం, సంతోషం అనే వెలుగులను నింపుకోవడమే ఈ పండుగ అందించే గొప్ప సందేశం.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ ప్రాంతాలకు చెందిన తెలుగు కవులు, కవయిత్రులు రచించిన దీపావళి ప్రత్యేక కవితలను ఈ సంకలనంలో అందిస్తున్నాము.
పండుగ ఆనందం, కుటుంబ అనుబంధాలు, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక చైతన్యం, శాంతి సందేశం వంటి విభిన్న భావాలను ఈ కవితలు ప్రతిబింబిస్తాయి.
ప్రతి కవితను రచయిత పేరుతో సహా ప్రచురిస్తూ, తెలుగు సాహిత్యాభిమానులకు అందిస్తున్నాము.
దీపావళి అంటే కేవలం ఇంటింటా వెలిగే దీపాలు మాత్రమే కాదు – ప్రతి హృదయంలో వెలిగే మంచి ఆలోచన కూడా!
ఈ కవితలను చదివి, మీకు నచ్చిన కవితపై మీ అభిప్రాయాన్ని వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి.
రచయితలందరికీ, పాఠకులందరికీ మనతెలుగుకథలు.కామ్ తరఫున దీపావళి శుభాకాంక్షలు!
S. No. 4 | శీర్షిక: కాంతుల పండుగ | రచన: రాళ్లబండి సంగం నాయుడు గారు |
కాంతుల పండుగ దీపావళి కమ్మని పండుగ దీపావళి ఇంటిల్ల పాది దీపావళి ఇలను ఏలు దీపావళి చీమ టపాసుల దీపావళి చిచ్చర పిడుగుల దీపావళి మాతాబుల దీపావళి మమతల కొలువు మమతల నెలవు దీపావళి కాకర పువ్వొత్తుల దీపావళి కాంతి వెల్లువ దీపావళి వెన్న ముద్దల దీపావళి వెలుగులు విరాజిమ్ము దీపావళి అందరి దీపావళి అవని ఏలు దీపావళి చిచ్చు బుడ్డుల దీపావళి చిన్ని తార దీపావళి నింగి చుక్కలను అవనికి దించు దీపావళి విష్ణు చక్రాల దీపావళి విశ్వాన్ని ఏలు విలువుల దీపావళి భూచక్రాల దీపావళి భూమిని ఏలు దీపావళి రంగు రంగు దీపావళి రమ్య మైన దీపావళి రమ్య రవమి దీపావళి |
S. No. 3 | శీర్షిక: దీపావళి లక్ష్మి | రచన: రాళ్లబండి సంగం నాయుడు గారు |
దీపావళి లక్ష్మి రావమ్మా మా ఇంటికి మా ఇలకు కన్నుల కాంతులతో కోటి వెలుగులతో అమావాస్య చీకటితో అంబరాన్ని అంటే ఆనందం తో అంతులేని అనురాగంతో పేదరిక చీకటిని పోగొడుతూ కమ్మని కాంతిని పొగుడుతూ కోటి సూర్యుల వెలుగువై చీకటి తోరణాల వేకువయి మందుగుండి మమతవై టపాసుల తన్మయత్వంతో మాతాబుల మమకారంతో చిచ్చు బుడ్డుల చక్కదనo తో కలిమి లేమిల కష్ట సుఖాల కళ(ల)గొలుపు తనంతో అమ్మ తనం అమృత సోనతో చీకటి వెలుగుల జీవితపు ఇంద్రధ్రనుస్సువై సప్త వర్ణ శోభతానివై పరుగులు పెడుతూ ఉరకలు వేస్తూ రావమ్మా మహాలక్ష్మి రావమ్మా దీపావళి లక్ష్మి |
S. No. 2 | శీర్షిక: దీపావళి దీపావళి | రచన: రాళ్లబండి సంగం నాయుడు గారు |
దీపావళి దీపావళి వెలుగుల దీపావళి వెన్నల దీపావళి వెన్నెల దీపావళి రంగుల దీపావళి రత్నాల దీపావళి పెద్దల దీపావళి సద్దుల దీపావళి సుధల దీపావళి సుధలు కురిపించు దీపావళి సిరుల దీపావళి విరుల దీపావళి కాంతి దీపావళి కాంతి ప(పె)oచు దీపావళి కమ్మని దీపావళి పిన్నల దీపావళి సత్యభామ దీపావళి సత్య... భామ దీపావళి కన్నయ్య దీపావళి చక్కన్నయ్య దీపావళి అవని దీపావళి అవనికి అందం దీపావళి నవ్వుల దీపావళి పుడమి దీపావళి పువ్వుల దీపావళి చిన్నారి దీపావళి పొన్నారి దీపావళి చిన్నారి నవ్వుల దీపావళి మొగ్గల దీపావళి పూమొగ్గల దీపావళి |
S. No. 1 | శీర్షిక: వెలుగుల దీపావళి – మనసుల దీపావళి | రచన: మనతెలుగుకథలు.కామ్ సంపాదక బృందం |
ఇంటింటా వెలిగే దీపాలుఇలలో విరిసే ఆనందాలుచీకట్లను తరిమే కాంతులుచిరునవ్వులు పూసే వేడుకలు! ముంగిట రంగుల రంగవల్లులుముంగిళ్లలో మట్టి ప్రమిదలుమమతలను పంచే మనసులుమధురంగా కలిసే బంధాలు! ధనికుని మేడలో దీపమైనాపేదవాని గుడిసెలో వెలుగైనాకాంతికి భేదాలు ఉండవుగాకరుణకు హద్దులు లేవుగా! ఆకలితో అలమటించే ఇంటఆనంద దీపం వెలిగిద్దాంఅండలేని నిరుపేదల చెంతఆప్యాయత వెలుగులు పంచుదాం! అసూయ అనే చీకటి తొలగిద్దాంఅహంకారపు తెరలు చెరిపేద్దాంద్వేషానికి దూరంగా నడుద్దాంస్నేహానికి కొత్త దారులు వేద్దాం! అక్షరమొక వెలుగుల దీపంఅది జ్ఞానానికి సుందర రూపంకథలతో మనసులు కలుపుదాంకవితలతో కాంతులు పంచుదాం! తెలుగు భాషకు దీపం పెడదాంతెలుగు సాహిత్యానికి వెలుగునిద్దాంకలం పట్టిన ప్రతి చేతినీకలకాలం ప్రోత్సహిద్దాం! పటాకుల మోతలు తగ్గిద్దాంపక్షుల భయాలను తొలగిద్దాంప్రకృతికి హాని చేయకుండాపండుగను హాయిగా జరుపుకుందాం! చీకటి నిండిన జీవితాలలోచిరుదీపాలుగా నిలిచిపోదాంనిరాశ నిండిన హృదయాలలోనవ ఆశాకిరణాలు నింపుదాం! దీపావళి అంటే దీపాల పండుగదీపావళి అంటే మనసుల వేడుకప్రేమతో పంచే ప్రతి చిరునవ్వూప్రపంచానికి ఒక కొత్త వెలుగు! కథలతో కలుపుదాం హృదయాలనుకవితలతో వెలిగిద్దాం మనసులనుతెలుగు అక్షరాలకు వెలుగై నిలుద్దాంమనతెలుగుకథలతో ముందుకు సాగుదాం! దీపావళి శుభాకాంక్షలు! – మనతెలుగుకథలు.కామ్ సంపాదక బృందం |




Comments