top of page

దేవుడు

#ChilakamarriSatyanarayana, #చిలకమర్రిసత్యనారాయణ, #దేవుడు, Devudu, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Devudu - New Telugu Article Written By Chilakamarri Satyanarayana

Published In manatelugukathalu.com On 12/05/2025

దేవుడు తెలుగు వ్యాసం

రచన: చిలకమర్రి సత్యనారాయణ


దేవుడనెవాడున్నాడా? అని మనిషి యుగయుగాలనుంచి ప్రశ్నిస్తూనే ఉన్నాడు. పై వాడెవడో ఉన్నాడు, వాడే మనకు కష్టాలు సుఖాలు ప్రసాదిస్తున్నాడు అని మన పెద్దలు చెప్తుంటారు. కష్టాలనుంచి బయట పడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా దైవం అనుకూలించకపొతె ఆ బాధల నుంచి ఉపశమనం లభించదని చాలా మంది నమ్మకం.


అయితె మన తెలుగు సినిమాలలొ సయితం దేవుడి ఉనికి గురించి ప్రెక్షకులకు శ్రోతలకు అలొచన రేకెత్తించేలా పాటలు వ్రాసారు రచయితలు.


దాగుడుమూతలు సినిమాలొ ఆచార్య ఆత్రెయ వ్రాసిన గీతం:


దేవుడనేవాడున్నాడా అని

మనిషికి కలిగెను సందేహం

మనుషులనే వారున్నారా అని

దేవునికొచ్చెను అనుమానం


ఈ ప్రశ్నల పరంపరలొ కవి తనే సమాధానాలు కూడ ఇస్తాడు.

మనసులేని ఈ మనిషిని

చూచి దేవుడు రాయైపోయాడు

ఆ దేవుడు కనపడలేదని మనిషి నాస్తికుడైనాడు


ఎంత చక్కని భావం..మనిషిని సృష్టించిన దెవుడే మనిషిలొ వచ్చిన మార్పుని చుసి విభ్రాంతి చెంది ఉంటాడు.


భక్త తుకారాం చిత్రంలొ అత్రెయ వ్రాసిన మరొ గీతం..


“ఉన్నావా... అసలున్నావాఉంటే కళ్ళుమూసుకున్నావా... ఈ లోకం కుళ్ళు చూడకున్నావాఉన్నావా... అసలున్నావా!”


అంటూ ప్రశ్నిస్తాడు దేవుణ్ణి భక్తుడు.


చివరికి కోపం వచ్చి


నీకొక పేరూ లేదు.. రూపం లేదు..నీతి లేదు.. నియమం లేదు.. నిజానికి నువ్వే లేవు..  లేవు.. లేవు.. లేవు”

అంటూ నిలదీస్తాడు.


అయితె ఏదొ తెలియని అతీతమైన శక్తి ఒకటి ప్రపంచాన్ని నడిపిస్తుందని అందరు భావిస్తారు. నాస్తికులు సైతం సృష్టికి మూలం ఏదో ఉందని నమ్ముతారు.


ఎందుకంటే శాస్త్రానికి అందని అద్భుతాలు జరుగుతున్నాయి కనుక. 


ఇది ఇలాఉంటే చాలా మంది నమ్మేది ఇంకొకటుంది. అదేమిటంటే రూపాలు వేరయినా ఎన్ని నామాలతొ పిలిచినా సృష్టికర్థ ఒక్కడే అని త్రిమూర్తులు. సృష్టి స్థితి లయలకు కారణభూతులయితే ఈ ముగ్గురికి మూలం అదిశక్థి అని మరో సిద్ధాంతం.


సుద్దాల అశోక్ తేజ షిర్ది సాయి చిత్రంలొ వ్రాసిన ఓ పాట నిర్ద్వంద్వంగా దెవు డొక్కడే అని చాటి చెప్తుంది.


“సబ్ క మాలిక్ ఏక్ హాయ్ !

ఒక్కడే సూర్యుడు !

ఒక్కడే చంద్రుడు !

ఒక్కడే ఆ దేవుడు!


రాముడే దేవుడని కొలిచింది మీరు.

యేసు నే దైవం అని తలచింది మీరు.

అల్లాహ్ అని ఎలుగెత్తి పిలిచింది మీరు.

ఏ పేరు తో ఎవరు పిలుచుకున్న 

ఏ తీరుగ ఎవరు పూజించిన..

ఈ చరా చెర జగతి సృష్టించి

నడిపించు ఒక్కడే దేవుడు!

ఒక్కడే దేవుడు!

ఒక్కడే ఆ దేవదేవుడు!

ఒక్కడే ఆ దేవదేవుడు!


ఏది ఏమయినా సిని రచయితలు దెవు డున్నాడా అని ప్రశ్నించడం నుంచి చరాచర సృష్టి ఎలా ఎలా నడిపిస్తున్నాడో ఎన్ని విధాలుగా తన శక్థిని ప్రదర్సిస్తున్నాడో చాలా సందర్భాలలో చెప్పారు పాటల ద్వారా..


*******************************************************************


చిలకమర్రి సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సురేఖ పులి  గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: చిలకమర్రి సత్యనారాయణ

తెలుగు భాష అంటె ఎంతొ మక్కువ..ఆదిలొ నాకవితలు వ్యాసాలు అంధ్రజ్యొతి అంధ్ర పత్రిక ప్రచురించి ఎంతగానొ ప్రొత్సహించాయి. ఉద్యొగరీత్య సిండికేటుబ్యాంక్ లో అధికారిగ పదవి, అనెక ప్రదేశాలను వ్యక్తులను పరిచయంచెసింది. ప్రస్తుతం న్యాయవాది వృత్తిలో ఉంటూ భిన్న సమస్యలతొ సతమతమయ్యె వ్యక్తులకు  సహయం చెయ్యాలని ఆకాంక్ష.

వర్తమానంలో జరిగే సంఘటనలకు స్పందించడం అలవాటు.చాలా సందేహాలకు భగవద్గీత సమాధానమని నా  నమ్మకం.

చిన్నారి మనవడు అరుష్ తొ కాలక్షేపం. కుటుంబం ప్రశాంతంగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుందని నమ్ముతాను.

తిరిగి నేను రచయితగా మారడానికి అన్నయ్య కృష్ణమాచార్యులు ప్రొత్సహం అయితె తెలుగుకథలు మాధ్యమం  కావడం  నా అదృష్టం.




2 Comments


👌👌👌👍👍👍

Like

ఒక అతీతమైన శక్తి ఈ జగత్తును నడిపిస్తోందనటంలో ఏ మాత్రం సందేహం లేదని రచయిత చాలా చక్కగా తెలియపరిచారు

Like
bottom of page