top of page

దెయ్యం వస్తుంది




'Deyyam Vasthundi' - New Telugu Story Written By Mohana Krishna Tata

Published In manatelugukathalu.com On 19/12/2023

'దెయ్యం వస్తుంది' తెలుగు కథ

రచన: తాత మోహనకృష్ణ


అదొక మారుమూల పల్లెటూరు. అక్కడ ఊరు మధ్య లో ఒక పెద్ద చెట్టు కింద సాయంత్రం అయితే చాలు.. పెద్దలు, పిల్లలు అందరూ చేరతారు. పెద్దలైతే మాట్లాడుకుంటారు.. పిల్లలైతే ఆడుకుంటారు. యువకులైతే, ఏవో వింతల గురించి చర్చించుకుంటారు. 


రాము, రాజు, రవి ముగ్గురు మంచి మిత్రులు. ఒకే బడి లో పెద్ద తరగతి లో చదువుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం ఇక్కడకే వచ్చి చుట్టు పక్కల విన్నవీ... చూసినవీ ఏవో మాట్లాడుకుంటుంటారు. ఆ రోజు రాము ఏదో చెప్పడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. స్కూల్ లో ఎవరో మాట్లాడుకోవడం విన్నదాని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. 


ఏమిటో అని మిగిలిన స్నేహితులు చాలా ఆసక్తి గా వినడానికి రెడీ అయ్యారు. 


ఇది ఒక దెయ్యం గరించి తెలిసిన విషయం అని రాము అన్నాడు. దెయ్యం అనగానే.. రవి కి అసలే భయం. అక్కడనుంచి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. 


కానీ, రాజు వాడి చెయ్యి పట్టుకుని.. “ఎందుకురా భయం? నేను ఉన్నాను కదా!” అని ధైర్యం చెప్పాడు. 

“నాకు అసలు దెయ్యాలంటే భయమే లేదు. అసలు దెయ్యాలు ఉన్నాయంటే, నేను నమ్మను... నువ్వు చెప్పరా రాము” అని అన్నాడు. 


“మన ఊరిలో ఒక దెయ్యం ఉన్నాది. అది అర్ధరాత్రి అయితే చాలు, బయటకు వస్తుంది. మాములుగా అది ఏ చెట్టు మీదో ఉంటుంది.. రాత్రి అయితే బయటకు వస్తుంది..”


“అలా చెప్పకురా.. మనం ఉన్నది ఇప్పుడు చెట్టు కిందనే!” అంటూ.. వణికిపోయాడు రవి. 


“నువ్వు చెప్పరా రాము.. కథ చాలా బాగుంది. ఆ దెయ్యం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే, ఆ రోజు రాత్రి వాళ్ళింటికి వస్తుందని అక్కడ స్కూల్ లో అనుకుంటున్నారు”. 


"ఒరేయ్ రాజు! నువ్వు దెయ్యం గురించి తప్పుగా మాట్లాడావు.. ఈ రోజు రాత్రి కొంచం జాగ్త్రతగా ఉండు.. "


"అదంతా ఏమి లేదురా! మన స్కూల్ లో టైంపాస్ కోసం ఎవరో అల్లిన కథ.. నేను ప్రశాంతంగా నిద్ర పోతాను ఈ రోజు"


ఆ రోజు రాత్రి.. రాజు భోజనం చేసి.. పడుకోడానికి తన గది లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. అది మేడ మీద సెపరేట్ గా ఉన్న గది. రాజు కు ముందు నుంచి అలాగే పడుకోవడం అలవాటు. కొంతసేపటికి... గాలి గట్టిగా వీస్తోంది.. దానికి తోడు కరెంటు కాస్త పోయింది. గాలి వేస్తే, కరెంటు పోవడం మాములే కదా! అని లేచి కొవ్వొత్తి వెలిగించాడు. ఈ లోపు వేసిన తలుపు తెరుచుకుని.. ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు. రాజు కి గుండె వేగంగా కొట్టుకుంటుంది. తనలో ఉన్న ధైర్యం గుర్తుచేసుకుని.. బయటకు వచ్చాడు. 


"ఎవరు.. రూ.. ?" అని అడిగాడు.


ఎదురుగా... ఒక తెల్లని ఆకారం, పొడవుగా ఉంది. తల పై జుట్టు నేలకు తాకుతుంది.. కనిపిస్తున్న ఆ సగం ముఖం.. ఎర్రగా.. పగిలిపోయి.. బొబ్బలు ఎక్కినట్టు ఉంది. కళ్ళు పెద్దవిగా భయానకంగా ఉన్నాయి. దెయ్యం తల చుట్టూ తిప్పుతుంది.. కాళ్ళు మటుకు వెనుకకు తిరిగి ఉన్నాయి. చేతులకి పొడవాటి గోళ్ళు ఉన్నాయి. 


"ఒరేయ్ రాజు.. సాయంత్రం నువ్వు అన్నవి అన్నీ నేను విన్నాను. నువ్వు కూర్చున్న ఆ చెట్టు పైనే నా నివాసం. చాలా కోపం వస్తే, ఇలా నీ పని పడదామని వచ్చాను.. " అని దెయ్యం అంటూనే, అమాంతం రాజు ను పట్టుకుని, ముఖమంతా దాని గోళ్ళ తో రక్కేసి.. బుజాన వేసుకుని.. ఎత్తుకుపోయింది. రాజు స్పృహ కోల్పోయాడు. దెయ్యం సరాసరి... స్మశానం లోకి వెళ్ళింది. 


రాము ను అక్కడే పడుకోబెట్టి.. “నా గురించి చెడ్డగా మాట్లాడినందుకు ఇదే నీకు శిక్ష” అని.. తన గోళ్ళతో రాజు పొట్టను చీల్చి, పేగులు మెడలో వేసుకుని గట్టిగా నవ్వింది ఆ దెయ్యం.. 


“అమ్మా! అమ్మా!” అని ఉలిక్కి పడ్డాడు రాజు. తేరుకుని, ఇది కల అని తెలుసుకున్నాక.. ఊపిరి పీల్చుకున్నాడు.. 


****

తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

Profile Link:



Youtube Play List Link:

నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.


ధన్యవాదాలు

తాత మోహనకృష్ణ

82 views0 comments
bottom of page