ధర్మబద్ధ జీవితం
- Yasoda Gottiparthi

- 4 hours ago
- 1 min read
#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #DharmabaddhaJeevitham, #ధర్మబద్ధజీవితం

Dharmabaddha Jeevitham - New Telugu Poem Written By Yasoda Gottiparthi Published In manatelugukathalu.com On 18/12/2025
ధర్మబద్ధ జీవితం - తెలుగు కవిత
రచన: యశోద గొట్టిపర్తి
కుటుంబ విలువలు కావాలి కలియుగంలో
కలిసిమెలిసి నడవాలి కష్టసుఖాల్లో
కనీస న్యాయం పొందేలా ఉండాలి చట్టాలు
కదులుతున్న చక్రాల్లో నలిగిపోయే నమ్మకాలెన్నో
సంఘ జీవితంలో స్వార్థ బతుకుకు స్థానం లేదు
సాధించిన జ్ఞానo, వికసించిన బుద్ధితో ఆవిష్కరించిన,సంపాదించిన
సమానత చూపితేనే తృప్తి, కీర్తి
స్వయంకృషితో సాధ్యమగు పనులు
సద్భుద్దితో సత్ఫలితాలనిచ్చు
ఇరుగుపొరుగు వారితో ఐక్యత
పెద్దలను గౌరవించి పిల్లల్ని ప్రేమించే మనస్తత్వమే సంస్కార హిత పెంపకం
దోషములను బుద్ధిలో చేరకుండా
శ్రద్ధ ఉన్న చాలు చేరుదువు శిఖరాలు
వినయమున్న వెలుగు వికాసము
***

-యశోద గొట్టిపర్తి




Comments