top of page
Original.png

ధర్మాచరణ ముఖ్యము

 #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #DharmacharanaMukhyamu, #ధర్మాచరణముఖ్యము, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 149

Dharmacharana Mukhyamu - Somanna Gari Kavithalu Part 149 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 08/12/2025

ధర్మాచరణ ముఖ్యము - సోమన్న గారి కవితలు పార్ట్ 149 - తెలుగు కవితలు

రచన: గద్వాల సోమన్న


ధర్మాచరణ ముఖ్యము

-------------------------------

ధర్మాచరణ ప్రగతికి

చేస్తుందోయ్! దోహదము

అదే మూలం మనిషికి

గౌరవానికది మార్గము


జీవితంలో ఎదుగుటకు

శ్రమతత్వం అవసరము

బ్రతుకులు ముక్కలగుటకు

దురాలవాట్లు కారణము


పనికిరాని అలవాట్లు

బ్రతుకులోన చీకట్లు

ఆదిలోనే త్రుంచితే

అందరిచే చప్పట్లు


శృతిమించితే మాత్రము

ఏదైనా నాశనము

ఇది అక్షరాల సత్యము

చరిత్ర నేర్పే పాఠము









తేనెలాంటి తెలుగు పదాలు

------------------------------

మల్లెపూలు తెల్లన

మంచు చూడ తెల్లన

గడ్డి తిని పాలిచ్చు

ఆవు పాలు తెల్లన


వెన్న ముద్ద మెత్తన

వెన్నెలమ్మ మెత్తన

దేవత ప్రతిరూపము

అమ్మ మనసు మెత్తన


చెలమ నీరు చల్లన

కన్న మనసు చల్లన

బాలలు ఇష్టపడే

ఐస్ క్రీమ్ బహు చల్లన


పంచదార తీయన

తెలుగు భాష తీయన

ముద్దుగా మాట్లాడు

పాప పలుకు తీయన


















నాన్న మాటలు

--------------------------------------

స్ఫూర్తినిచ్చే మాటలు

సుగంధాల తోటలు

అభివృద్ధికి బాటలు

మేలి పసిడి మూటలు


పదిమందికి స్ఫూర్తిగా

త్యాగమయ క్రొవ్వొత్తిగా

ఉండాలోయ్! జీవితము

పేదోళ్లకు కోటగా


బ్రతకంతా బాటగా

జీవజలపు ఊటగా

తప్పక ఉండాలోయ్!

ఆదర్శమవ్వాలోయ్!


దారి చూపు గురువుగా

ఉపకరించు తరువుగా

ఇలలోన బ్రతకాలి

దేశకీర్తి నిలపాలి







ఇలా ఉందాం!

------------------------

కాంతులీను కిరణనై

సొగసులీను కెరటమై

మున్ముందుకు సాగుదాం!

మేను తాకు పవనమై


ఫలాలిచ్చు తరువులై

జలాలిచ్చు చెరువులై

ఉపకారం చేసేద్దాం!

బుద్ధి చెప్పు గురువులై


కోయిలమ్మ గానమై

పేదోళ్లకు న్యాయమై

మనమంతా ఉండేద్దాం!

చిన్నారులకు మార్గమై


ఆపదలో ఆప్తులై

తోడుండే మిత్రులై

స్ఫూర్తినే నింపేద్దాం!

మనసున్న మనుషులై













ఘనమైనవి సృష్టిలో

----------------------------------------

కోకిలమ్మ గానము

పువ్వుల మకరందము

ఎంతో మాధుర్యము

పసి పిల్లల రాగము


నింగిని ఇంద్ర చాపము

వెలుగులీను దీపము

చూడ చాలా అందము

చిన్నారుల రూపము


గురువుల గొప్పతనము

కన్నోళ్ల త్యాగగుణము

వర్ణింప ఎవరి తరము!

దేవుని మంచితనము


పరిమళించు పుష్పము

ప్రకాశించు దీపము

చేయును ఉపకారము

సృష్టికర్త దైవము


గద్వాల సోమన్న







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page