top of page

దివ్య దీపావళి

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #దివ్యదీపావళి, #DivyaDeepavali

ree

Divya Deepavali - New Telugu Poem Written By Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 20/10/2025

దివ్య దీపావళి - తెలుగు కవిత

రచన: యశోద గొట్టిపర్తి


 మెరిపించవే దివ్వె 

ముంగిళ్ళ మెరి పించవే 

సిరి పంచవే అరచేత

 సిరి పంచవే 


సత్యభామ చేతిలో 

నరకాసుర సంహారం 

నరులకు పీడ విరిగి 

మరువలేని దినం


ఆశ్వయుజ అమావాస్య

ఆకాశానికి ఆనంద జ్వాల

సూర్యోదయ వేళ తలంటి స్నానం 

నూతన వస్త్రాలు ధరించడం 


రంగుల రంగ వల్లికల 

రమణీయ రంగేళి 

ఆడపడుచుల ధనలక్ష్మి వ్రతం 

పిండి వంటలతో ప్రియ భోజనం 


దివ్వెల ముంగిళ్ళ దీపావళి 

ముసిరిన చీకట్లను పారద్రోలి

దివి వెన్నెలను భువికి దింపి 

నింగి నేలను ఏకం చేసే తారావళి దీపావళి 


చిన్న పెద్ద సంతోషం 

చీకటి వెలుగుల మాసం తన వారెవరో పరులెవరో 

తేడాలేని తళుకుల అం దం

 

తారాజువ్వలు తరుణుల 

చేతుల్లో తారట్లాడే

 చిచ్చుబుడ్లు చిట్టి పాపలను 

చిందులు వేయించే


అల్లుళ్ల అలకలను ఆటపట్టించు 

అలరించే మరదళ్ల మతాబులు

 షేర్ పటాకులు చేశాయి 

చిచ్చర పిడుగులను

 

మిల మిల మెరిసే ఆకాశం ముంగిట ముందే వాలే 

తళతళ లాడే తారకలే తారట్లాడె

తెల తెల వారే తరుణం వచ్చేవరకు

మెరిపించవే దివ్వె మెరిపించవె 




***


ree

-యశోద గొట్టిపర్తి





Comments


bottom of page