top of page

దొంగ దొరికింది



'Donga Dorikindi' - New Telugu Story Written By L. V. Jaya

Published in manatelugukathalu.com on 31/03/2024 

'దొంగ దొరికింది' తెలుగు కథ

రచన: L. V. జయ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"అమ్మా, ఈ రోజు నా ఇయర్ పాడ్స్ స్కూల్ కి తీసుకుని వెళ్తాను. " అన్నాడు సార్థక్. 


"ఎందుకురా. క్లాస్ అవుతున్నప్పుడు పాటలు వినడానికా? " అడిగింది సార్థక్ వాళ్ళ అమ్మ. 


"కాదమ్మా. అందరూ తెచ్చుకుంటున్నారు. బ్రేక్ టైం లో వాడతాను. ఈ ఒక్క రోజే. ప్లీజ్ " బతుమాలుకున్నాడు సార్థక్. 


"సర్లే. ఈ ఒక్క రోజే. క్లాస్ అవుతున్నప్పుడు వాడకూడదు. సరేనా" అంది సార్థక్ అమ్మ. 


సరేనంటూ స్కూల్ కి వెళ్ళాడు సార్థక్. బ్రేక్ టైం లో, తన కొత్త ఇయర్ పాడ్స్ ని అందరికి గొప్పగా చూపించుకున్నాడు. బ్రేక్ తరువాత, PE క్లాస్ ఉండడం తో, గ్రౌండ్ కి వెళ్ళాడు. అక్కడ అందరూ తమ వస్తువుల్ని పెట్టేచోట తన ఫోన్, ఇయర్ పాడ్స్ ఎవరికీ కనపడకుండా పెట్టాడు. 


క్లాస్ అయ్యాక చూసేసరికి, తన ఫోన్, ఇయర్ పాడ్స్ కనపడలేదు. మొత్తం గ్రౌండ్ అంతా వెదికాడు. సార్థక్ ఫ్రెండ్స్ కూడా వెదకడం లో సహాయం చేసారు. ఎక్కడా కనపడ లేదు. ఆఫీస్ కి వెళ్ళి, కంప్లైంట్ చేసాడు సార్థక్ ఫోన్, ఇయర్ పాడ్స్ గురించి. ఫోన్ ఇచ్చారు వెంటనే. ఎవరో దొరికింది అని తెచ్చి ఇచ్చారుట. 


ఇయర్ పాడ్స్ పోయాయి ఆంటే అమ్మా, నాన్నగారు తిడతారు అన్న భయంతోనే ఇంటికి వచ్చి చెప్పాడు. అనుకున్నట్టుగానే, ఇద్దరూ తిట్టారు. 


"ఎలా తీసుకు వస్తావో. 2 డేస్ టైం ఇస్తున్నాను. ఇంట్లో ఇయర్ పాడ్స్ ఉండాలి" అన్నారు సార్థక్ నాన్నగారు. 


మర్నాడు స్కూల్ కి వెళ్తూనే ఆఫీస్ కి వెళ్ళాడు. ఇయర్ పాడ్స్ దొరికాయేమో అని. లేదని చెప్పారు ఆఫీస్ వాళ్ళు. ముందు రోజు తన ఫోన్ ఎవరు ఇచ్చారో కనుక్కున్నాడు. తన క్లాస్లో అమ్మాయి తెచ్చి ఇచ్చిందని తెలుసుకుని, థాంక్స్ చెప్పడానికి క్లాస్ కి వెళ్ళాడు. 


తను వెళ్ళేటప్పటికి క్లాస్ మొదలు అవడంతో, నెమ్మదిగా వెళ్ళి కూర్చున్నాడు. ఆ అమ్మాయి సార్థక్ ని చూసింది. క్లాస్ జరుగుతూ ఉండగా, ఆ అమ్మాయి టేబుల్ మీద ఇయర్ పాడ్స్ చూసాడు. 'ఇవి ఆ అమ్మాయివా, తనవా? ' అన్న అనుమానం వచ్చింది కానీ మళ్ళీ ' ఫోన్ దొరికింది అని ఇచ్చిన అమ్మాయి, ఇయర్ పాడ్స్ కూడా ఇస్తుంది కదా' అనుకున్నాడు. 


క్లాస్ తరువాత బ్రేక్ టైం లో, ఆ అమ్మాయి ఇయర్ పాడ్స్ పెట్టుకుని సాంగ్స్ వినడం చూసాడు సార్థక్. పక్కనే వున్న తన ఫ్రెండ్స్ తో " ఆ అమ్మాయి వాడుతున్న ఇయర్ పాడ్స్ నావేనేమో అని అనుమానం వచ్చింది. తన దగ్గర ముందు నుండే ఉండి ఉంటాయి" అన్నాడు. 


"చెక్ చెయ్యి" అన్నారు సార్థక్ ఫ్రెండ్స్. 


'ఎలా?' అని ఆలోచిస్తూ ఉండగా సార్థక్ కి ఒక ఆలోచన వచ్చింది. తన ఫోన్ తీసి చూసాడు. ఇయర్ పాడ్స్ దగ్గరలోనే ఉన్నట్టు కనపడింది. కనెక్ట్ చెయ్యాలని చూసాడు. అవి కనెక్ట్ అయ్యాయి. తన ఫోన్ లో ఒక పాట ప్లే చేసాడు. ఆ అమ్మాయి తను వింటున్న పాట మారడం తో తన ఫోన్, ఇయర్ పాడ్స్ ని చూసుకుంది. సార్థక్, ఫ్రెండ్స్ నవ్వుకున్నారు. 


"ఆ అమ్మయి దగ్గర వున్న ఇయర్ పాడ్స్ నీవే అయ్యి ఉంటాయి. వెళ్ళి అడిగి తెచ్చుకో" అన్నారు సార్థక్ ఫ్రెండ్స్ లో ఒక అబ్బాయి. 


"ఫోన్, ఇయర్ పాడ్స్ చూసుకున్న మాత్రాన నావే అని ఎలా తెలుస్తుంది. " అని ఇంకోటి ప్లే చేసాడు తన ఫోన్ లో. ఆ అమ్మాయి ఉలిక్కి పడి తన చేతిలో వున్న ఫోన్ విసిరేసింది. ఏమి ప్లే చేసాడో చూసిన సార్థక్ ఫ్రెండ్స్ నవ్వుకున్నారు. సార్థక్ ప్లే చేసింది బాంబ్ సౌండ్. "దొంగ దొరికిపోయింది " అన్నాడు ఫ్రెండ్స్ తో. 


సార్థక్, తన ఫ్రెండ్స్ తో నెమ్మదిగా ఆ అమ్మాయి కి కనపడకుండా తన వెనక నిలపడ్డారు. ఫోన్ లో ఇయర్ పాడ్స్ చాలా దగ్గరలో ఉన్నట్టు కనపడింది. 


"వెళ్ళి అడిగి తీసుకో. " అన్నాడు సార్థక్ ఫ్రెండ్. 


సార్థక్ కి ఆ దొంగని ఆటపట్టించాలి అనిపించి, కుక్క అరుపులు, పిల్లి అరుపులు తరువాత సింహం, పులి ఇలా ఒకదాని తరువాత ఒకటి మారుస్తూ పెట్టాడు. 


ఆ అమ్మాయి భయంతో, చుట్టూ చూసింది. 


తన వెనకే దాక్కున్న సార్థక్ ని, సార్థక్ ఫ్రెండ్స్ చూసి ఏడుస్తూ, "సారీ సార్థక్, ఇవి నీవే. ప్లీజ్ నా మీద కంప్లైంట్ చెయ్యకు" అని చెప్పి, ఇయర్ పాడ్స్ ఇచ్చింది. 


ఆ రోజు, సార్థక్, సంతోషంగా ఇంటికి వచ్చి, దొంగ ఎలా దొరికిందో ఇంట్లో అందరికీ చెప్పాడు. 

నవ్వుకున్నారు ఇంట్లో అందరూ. సార్థక్ అమ్మ "అందరినీ ఏడిపించే నీ బుద్ధి అక్కడ కూడా వాడేవన్నమాట" అంది నవ్వుతూ. సార్థక్ నాన్నగారు "ఆ అమ్మాయి అంతా తెలివితక్కువగా ఎలా ఉందిరా? పోనిలే మొత్తానికి దొంగ దొరికింది. నీ ఇయర్ పాడ్స్ దొరికాయి " అన్నారు నవ్వుతూ. 


***సమాప్తం***


L. V. జయ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : LV జయ

నా పేరు LV జయ. 
https://www.manatelugukathalu.com/profile/jaya

నాకు చిన్నప్పటి నుండి తెలుగు కథలు, పద్యాలూ, సాహిత్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. 
ఏ విషయాన్ని అయినా సరదాగా తీసుకునే అలవాటు. అదే నా కథల రూపంలో చూపించాలని చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

ధన్యవాదాలు



51 views0 comments
bottom of page