top of page

దొరకని పేరు


'Dorakani Peru' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

Published In manatelugukathalu.com On 04/12/2023

'దొరకని పేరు' తెలుగు కథ

రచన : సుదర్శన రావు పోచంపల్లి


విశ్వనాథ్ కు ఇంకా పెళ్ళి కాలేదు- అయినా అతని ఊహలో తన పెళ్ళి అయిన తరువాత కొడుకు పుడితె పేరు ఏమి పెట్టాలని సదా ఆలోచిస్తుంటాడు- అతడు దైవ భక్తుడు కూడ.


కొడుకుకు త్రి మూర్తులలో ఏ ఒకరి పేరు పెట్టుకున్నా ఇతర దేవుండ్లను తక్కువ చేసినట్టుంటుంది. పోనీ ముగ్గురు పేర్లు కలిసేటట్టు పెట్టుకున్నా తన తండ్రి పేరు దత్తాత్రేనాయె- అప్పుడు తన భార్య మీ తండ్రి పేరెందుకు మా నాన్న పేరు పెటుకుందామంటది.


మొదట తనకు పెళ్ళి కావాలి. పుట్ట బోయేది కొడుకా కూతురా మొదలే ఊహించినా పొరపాటే. ఒక వేళ కూతురే ఐతె మళ్ళీ ఇదే తంతు- తల్లి పేరు లోక మాత-కాబోయే అత్త పేరు ఏముంటుందో- ఆమె తన తల్లి పేరే పెట్టాలని పట్టు బట్ట వచ్చు.


ఈ కాలపు పేర్లు పుష్ప, స్వప్న, పద్మిని, రాగిణి ఛీ ఈ పేర్లు అందరికుంటయి - ఏదో కొత్త పేర్లు పెట్టుకోవాలి-


అనుకుంటు కొన్ని గూగుల్ లో వెతుకుతాడు. ఏ పేరూ నచ్చదు- భారతం, భాగవతం, రామాయణం త్రి గ్రంథాలూ ఓపికగా నెలల తరబడి చదువుతాడు. ఐనా ఆశించిన పేర్లు కొడుకుకు గాని కూతురుకు గాని పెట్టడానికి దొరకవు-


ఈ భగవంతుని సృష్టిలో రకరకాల వృక్ష సంపద, పూల మొక్కలు, జంతుజాతి, కీటకాలు మున్నగు వాటికి వాటి పేర్లు, ఆకారము, పరిమళము, రుచి, ప్రయోజనము ఇవన్ని ఎలా సాధ్యమయి ఉండవచ్చు?


ఎన్ని కోట్ల జనాన్ని సృష్టించినా వారి వారి ఆకారాలు, అభిరుచులు, పోకడలు, ప్రవర్తన, కంఠ స్వరము, నడక తీరు, లాంటి ఎన్నో లక్షణాలు- ఏమిటీ మాయ. దానికి తోడు వారిలో ప్రేమ, అనురాగము, పగ, ద్వేషము, ఈర్ష్య, లాంటి లక్షణాలు, పండితులు, పామరులు, యోధులు, రుషులు లాంటి ఈ ప్రకృతిని వర్ణించడానికి పరిమిత మైన నా వయసు సరిపోదు-


ఒక్క భూ ప్రపంచమే కాక ఆ మహాను భావుడు అనంత విశ్వములో అగణిత నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు అన్నీ ఆయనే చూసుకోవాలె- అన్నీ చూసుకుంటూ కూడా వైకుంఠము, కైలాసము, సత్య లోకము మున్నగు చోట్ల ఈ త్రిమూర్తులు వారి వారి దేవేరులతో కాలక్షేపము చేయాలి ఈ సృష్టి స్థితి లయ కారకులు.


పుట్టే పిల్లలు కవల లైతేనో- ఇద్దరు మగపిల్లలు, లేదా ఇద్దరు ఆడపిల్లల్లు, కాకపోతె ఒక కూతురు, ఒక కొడుకు కలిగితె నామ కరణము మరీ ఊహకందనిదే- ఐనా రా బోయే నా భార్య అభిరుచి ఎట్లుంటదో, భగవంతుడా ఇక నాకు సంతృప్తికరమైన పేరు దొరకదు.


‘నీవు ప్రసాదించే సంతానానికి అప్పుడు ఆలోచిస్త ఇక కాలము వృధా చేయ లేను. దేవుడా! ముందుగా నాకు అనుకూలవతి, సౌందర్యరాశి, సుగుణశీల ఐన సతిని సమకూర్చు తండ్రీ’ అని కోరుకుంటాడు విశ్వనాథ్.

-------------------------

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


45 views0 comments
bottom of page