top of page

విజయదశమి 2023 కథల పోటీ ఫలితాలు


'Vijayadasami 2023 Telugu Story Competition Results

By Admin - manatelugukathalu.com

విజయదశమి 2023 కథల పోటీ ఫలితాలు


విషయ సూచిక

1 .బహుమతులకు సహకరిస్తున్న వారు ( Contributors To Prizes )

2 . విజయదశమి 2023 కథల పోటీల ఫలితాలు

3. ఉగాది 2024 సీరియల్ నవలల పోటీలు

4.తదుపరి కథల పోటీలు

5. గమనిక

6. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) అక్టోబర్ 2023 ఫలితాలు


1 .బహుమతులకు సహకరిస్తున్న వారు ( Contributors To Prizes )


వారం వారం ఒక కథకు బహుమతి చొప్పున నెలకు నాలుగు కథలకు బహుమతులు అందిస్తున్నాం. బహుమతుల వితరణలో భాగస్వాములు దొరికితే ఈ బహుమతుల సంఖ్యను, బహుమతుల మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే ప్రతి కథకు బహుమతి అందేలా చేయాలన్నదే మా సంకల్పం.

రూ: 3000/- చెల్లించడం ద్వారా ఒక సంవత్సరం పాటు ప్రతి నెలా ఒక కథకు బహుమతిని మీరు స్పాన్సర్ చేయవచ్చు.

వివరాలకు story@manatelugukathalu.com కి మెయిల్ చేయండి.

ఈ విషయంగా మేము గతంలో చేసిన విజ్ఞప్తికి స్వచ్చందంగా ప్రతిస్పందించిన వారి వివరాలు తెలియజేస్తున్నాము.


*శ్రీ బివిడి ప్రసాద రావు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.


*శ్రీమతి పెండేకంటి లావణ్య కుమారి గారు తమ దివంగత మాతృమూర్తి శ్రీమతి పెండేకంటి లక్ష్మీపద్మావతమ్మ గారి జ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.


2 . విజయదశమి 2023 కథల పోటీల ఫలితాలు:


ఎప్పటిలాగే ఊహించినదానికంటే ఎక్కువ కథలు పోటీకి వచ్చాయి.

దాదాపు అన్ని కథలు చక్కగా ఉన్నాయి.

కానీ పోటీ అన్నాక విజేతలను ప్రకటించాలి కాబట్టి న్యాయ నిర్ణేతల తీర్పును శిరసావహించి ఫలితాలు ప్రకటిస్తున్నాము.

పోటీల ప్రకటనలో చెప్పినట్లు బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడ్డాయి.


బహుమతులు పొందని రచయితలను నిరుత్సాహ పడవద్దని, భవిష్యత్తులో మరింత పోటీ ఇచ్చి, బహుమతులు గెలుచుకోవడానికి ప్రయత్నించమని సవినయంగా మనవి చేస్తున్నాము.



ప్రథమ బహుమతి పొందిన కథలు:


ఈసారి రెండు కథలు సమాన స్థాయిలో నిలవడంతో ప్రథమ బహుమతికి రెండు కథలను ఎంపిక చేసాము.

బహుమతి మొత్తం ఇద్దరు రచయితలకూ సమానంగా అందిచడం జరుగుతుంది.


(కథ పేరు పైన క్లిక్ చేయడం ద్వారా కథను చేరుకోవచ్చు.

రచయిత పేరుపైన క్లిక్ చేయడం ద్వారా రచయిత ప్రొఫైల్ ను చేరుకోవచ్చు. రచయిత అన్ని రచనల వివరాలు చూడవచ్చు.)



విశిష్ట(ప్రత్యేక బహుమతులు:


ముందుగా ఐదు విశిష్ట(ప్రత్యేక బహుమతులు) అందజేస్తామని ప్రకటించాము. కానీ చక్కటి పోటీ ఉండటంతో పదహైదు విశిష్ట(ప్రత్యేక బహుమతులు) అందజేస్తున్నాం.



(కథ పేరు పైన క్లిక్ చేయడం ద్వారా కథను చేరుకోవచ్చు.

రచయిత పేరుపైన క్లిక్ చేయడం ద్వారా రచయిత ప్రొఫైల్ ను చేరుకోవచ్చు. రచయిత అన్ని రచనల వివరాలు చూడవచ్చు.)



3. ఉగాది 2023 సీరియల్ నవలల పోటీలు:


ఏకైక ప్రథమ బహుమతి రూ: 15000 /-


మూడు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 1000 /-


పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ లో చూడవచ్చు.




4.తదుపరి కథల పోటీలు:

తదుపరి కథల పోటీల గురించి ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. సాధారణ ప్రచురణకు అంగీకరించేవారే తమ రచనలను పంపండి. విజయదశమి పోటీ కథల ప్రచురణ 22 /10 /2023 తో ముగిసింది కాబట్టి 23 /10 /2023 నుడి ప్రచురింపబడ్డ కథలు తదుపరి పోటీలు ప్రకటిస్తే పరిశీలింపబడతాయి. వారం వారం బహుమతులు మాత్రం మార్చి 2024 వరకు అందిచబడతాయి.


5. గమనిక:

ప్రతి నెల వారం వారం బహుమతులకు ఎంపికైన కథల వివరాలు మనతెలుగుకథలు.కామ్ లో మరుసటి నెల 15 వ తేదీ ప్రచురిస్తాము.


కేవలం మేము పంపే లింక్ ల ద్వారానే మనతెలుగుకథలు లో కథలు చదవాల్సిన అవసరం లేదు.


మీ బ్రౌసర్ లో www.manatelugukathalu.com అని టైపు చేస్తే మా వెబ్ సైట్ చేరుకోవచ్చు. మీకు నచ్చిన కథలు ఉచితంగా చదువుకోవచ్చు.


మీ రచనలు మెయిల్ ద్వారా మాకు పంపవలసిన చిరునామా: story@manatelugukathalu.com

(చివరన gmail .com లాంటివి లేవు.)


మనతెలుగుకథలు.కామ్ రచయితల కోసం మేము ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో చేరడం ద్వారా ప్రతి పోస్ట్ తాలూకు లింక్ లు తెలుసుకోవచ్చు. గ్రూప్ లో చేరదలచినవారు 63099 58851 కి వాట్సాప్ చెయ్యండి.

ఈ గ్రూప్ లో పాఠకులు కూడా చేరవచ్చును.



6. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) అక్టోబర్ 2023 ఫలితాలు:

అత్యంత జనాదరణ పొందిన NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) పథకాన్ని 31/03/2024 వరకు పొడిగిస్తున్నాము.


రచయితకు పోటీలో గెలుపొందడం, బహుమతి పొందడం ఒక టానిక్ లాంటిది.


బహుమతి మొత్తం రచయితకు గొప్ప కాదు.


విజేతగా నిలవడం రచయితల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.


మరిన్ని మంచి రచనలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది.


వారం వారం బహుమతులు అందించడం వెనుక మా ఉద్దేశం అదే.


NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) అక్టోబర్ 2023 ఫలితాలు


(కథ పేరు పైన క్లిక్ చేయడం ద్వారా కథను చేరుకోవచ్చు.

రచయిత పేరుపైన క్లిక్ చేయడం ద్వారా రచయిత ప్రొఫైల్ ను చేరుకోవచ్చు. రచయిత అన్ని రచనల వివరాలు చూడవచ్చు.)

మాకు సహకరిస్తున్న రచయితలకు, పాఠకులకు మరొక్కమారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.




194 views0 comments
bottom of page