top of page
Writer's pictureBVD Prasada Rao

కన్యాశుల్కం


'Kanyasulkam'- New Telugu Story Written By BVD Prasada Rao

Published In manatelugukathalu.com On 27/10/2023

'కన్యాశుల్కం' తెలుగు కథ

రచన: బివిడి ప్రసాదరావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

భానుమతి అటే చూస్తూంది.

గోపాలం అగుపించేకనే ఆమె ఎదురు చూపు ఆగింది.

"రావనుకున్నాను." మెల్లిగా అంది.

గోపాలం, "ఎక్కు" అన్నాడు.

"కుదరదు. నడుచుకొనే వెళ్దాం." చెప్పింది భానుమతి.


ఆ ఇద్దరూ ఊరిలోకి కదిలారు.

పరిసరాలు సామాన్యంగానే ఉన్నాయి.

మోటర్ సైకిల్ ను తోసుకుంటూ నడవడం గోపాలంకు ఇబ్బందిగా ఉంది.

అది గుర్తించిన భానుమతి, "పట్నంలా కాదు. జరజరా పోవడం ఇక్కడ కష్టం." చెప్పింది.


"నాకు ఇటు రావడం కొత్త." చెప్పాడు గోపాలం.


"ఇటా! అంటే?" అంది భానుమతి.


గోపాలం ఏమీ చెప్పలేదు.

రెట్టించింది భానుమతి.


"అదే.. ఇలాంటి ఊళ్లకు రావడం నాకు ఇదే మొదట." గోపాలం నీళ్లు నమలుతాడు.


భానుమతి ఊరుకోవడం లేదు. "ఇలాంటి ఊళ్లేమిటి!" ప్రశ్నించేసింది.

గోపాలం మళ్లీ వెంటనే ఏమీ అనలేదు.

భానుమతి మళ్లీ రెట్టించింది.


"అదే.. పల్లెటూళ్లకు రావడం నాకు కొత్త." చెప్పగలిగాడు గోపాలం.


భానుమతి పక్కన నడుస్తుండగా.. గోపాలం మోటర్ సైకిల్ ను ఈడ్చుకుంటూ ముందుకు భారంగా పోతున్నాడు.

"ఇంకా దూరమా." కొద్ది నిముషాల్లోనే అనేసాడు గోపాలం.


భానుమతి చిన్నగా నవ్వింది.

"ఏం. కష్టంగా ఉందా." అడిగేసింది.


గోపాలం మాట్లాడ లేదు. కానీ ఆగాడు. భానుమతిని చూసాడు.


భానుమతి ఆగ లేదు. "రా." అంది నడుస్తూనే.


గోపాలం కదిలాడు.

ఓ పావు గంట మేరకు గడిచాక.. భానుమతి ఓ ఇంటి ముందు ఆగింది.


"ఇక్కడే. బైక్ నిలబెట్టేసి రా." అంటూనే ఆ ఇంటి గుమ్మం ముందుకు వెళ్లింది.

తలుపు తట్టింది.


నిముషం వ్యవధి లోపే లోపల నుండి ఆ తలుపు తీసాడు సూరి.

అప్పటికే గోపాలం గుమ్మం దరిన తన మోటర్ సైకిల్ కు స్టాండ్ వేసి.. వచ్చి భానుమతి చెంతనే చేరి ఉన్నాడు.


"రా." అంటూ ఇంట్లోకి నడిచింది భానుమతి.


గోపాలం అనుసరించాడు.

సూరి పలకరింపుగా నవ్వడం గుర్తించాడు కూడా. ప్రతిగా తనూ మెల్లిగా నవ్వేసాడు.


వాసారా లాంటి ఆ ఇంటి వరండాలోని ఓ బల్లను గోపాలంకు చూపించింది భానుమతి.

దాని మీద కూర్చున్నాడు అతను. అతని పక్కనే చేరాడు సూరి.

ఇంటిలోకి వెళ్లింది భానుమతి.


"రారనుకున్నాం." అన్నాడు సూరి.


తల తిప్పాడు గోపాలం. గుర్రుగా సూరిని చూసాడు.

"భానుమతి ఊరి లోకి వచ్చి రాగానే చెప్పింది." గొణిగాడు.


పైకి మాత్రం.. "అలా అనుకోవడం బాలే." అన్నాడు. అతడు చిన్నగా రోషమయ్యాడు.


గోపాలం వాలకం చూసిన సూరి కంగారయ్యాడు.

"అలా కాదు. మరే.. మా భానుమతి పట్టు బింకమైందిగా. అదే మా సంశయం." సూరి నసుగుతాడు.


అంతలోనే భానుమతి నీళ్ల గ్లాసుతో అక్కడికి వచ్చింది. ఆమె వెనుకే సావిత్రమ్మ వచ్చింది.

భానుమతి తల్లిదండ్రులు.. సావిత్రమ్మ, సూరి.

"నీళ్లు తాగు." గ్లాసు గోపాలం చేతికి అందించింది భానుమతి.


గోపాలం గ్లాసు అందుకున్నాడు. నీళ్లు తాగాడు. ఖాళీ గ్లాసు ఎక్కడ పెట్టాలో చూసాడు.

"ఇలా ఇచ్చేయ్." అంది భానుమతి. చొరవగా ఆ గ్లాసును గోపాలం నుండి తీసుకుంది.


"సుజాతా." చెల్లిని పిలిచింది.


సుజాత ఇంటిలోంచి వచ్చింది. తనకు ఖాళీ గ్లాసు అందించింది భానుమతి.

ఆ గ్లాసుతో సుజాత తిరిగి ఇంటి లోకి వెళ్లి పోయింది.

"మా అమ్మాయిని ఎందుకు ప్రేమించానా అనిపించడం లేదుగా." మెల్లిగా అడిగింది సావిత్రమ్మ.


అప్పుడు ఆవిడ గోపాలంనే చూస్తుంది.

చురుక్కున తల తిప్పాడు గోపాలం. సావిత్రమ్మనే చూస్తున్నాడు.

"మళ్లీ మళ్లీ అలానే అంటున్నారు. నన్ను అనుమానించినట్టు కాదు.. అవమానిస్తున్నారు."

గోపాలం రోషమయ్యాడు.


కలగ చేసుకుంది భానుమతి. "మాకు అంత సీన్ లేదు. నిన్ను ఇబ్బంది పర్చడం కాదు. మా వాళ్ళది భయం." చెప్పింది.


గోపాలం తల వాల్చుకున్నాడు.

"ప్రేమకై ఇంతగా బయలు పడడం మా వాళ్లకు ఇంకా అపనమ్మకం." భానుమతే చెప్పింది.

గోపాలం తల ఎత్తాడు. భానుమతిని చూస్తున్నాడు.

"నా ప్రేమ నీకు తెలియందా." అడిగాడు నిసత్తువుగా.


"నాకు తెలుసు." నసిగింది భానుమతి.


"మరి. ఊరిలోకి రాగానే నువ్వు కూడా నాతో రావనుకున్నాను అన్నావుగా." గోపాలం తెములుకోలేక పోతున్నాడు.


"అదా. అది మా వాళ్ల ఎడతెరిపి బెదురు. దాంతో నేను కూడా నువ్వు రావడం ఆలస్యమవ్వడంతో అలా అనేసాను. అంతే." సర్దిపుచ్చుతుంది భానుమతి.


తేలిక పడడానికి యత్నిస్తున్నాడు గోపాలం.

నిముషంకు పైగానే వాళ్ల మధ్య మరి మాటలు లేవు.

ఆ పిమ్మట గోపాలమే మాట్లాడేడు. "ఈ రోజు మంచిదన్నారుగా. పనులు చెప్పితే మొదలు పెడతాను." అన్నాడు.


సూరి, సావిత్రమ్మ ముఖాలు చూసుకున్నారు.

వెంటనే భానుమతిని చూసారు.

అప్పటికే భానుమతి తల్లిదండ్రులనే చూస్తుంది.


"చెప్పండి. తనకు నా మీద ఎంతటి ప్రేమో నిరూపించమన్నారుగా. అందుకు తను సిద్ధపడి వచ్చాడు." భానుమతి వెంటనే చెప్పింది.


తిరిగి భార్యాభర్తలు ముఖాలు చూసుకుంటున్నారు.

"చెప్పండి. నాకు భానుమతి మీద ప్రేమ ఉంది. అది ఎంతో మీరు గుర్తించాలి. అందుకే మొన్నటి మన మధ్య మాటల్లో నేను మీ ఆంక్షలుకు ఒప్పుకున్నాను." చెప్పాడు గోపాలం.


భానుమతి తల తిప్పింది. తనివిగా గోపాలం ను చూస్తుంది.

గోపాలం అప్పుడే తల ఎత్తాడు. భానుమతిని చూసాడు.

భానుమతి చూపును పట్టుతో తిప్పుకుంది. చిన్నగా నవ్వుకుంటుంది.


అంతలోనే సూరి, "మరోలా కాదు బాబూ. చెప్పాంగా. మేము పల్లె వాళ్లం. పైగా మేము భయపడే వాళ్లం." చెప్పాడు.


"ఏమైనా కావచ్చు. మీరు కోరారు. నేను భానుమతికై సిద్ధ పడ్డాను." నవ్వేడు గోపాలం.

మురిసిపోతుంది భానుమతి.

పొంగిపోయింది సావిత్రమ్మ.


"లేదు బాబు. నువ్వు మేలైన వాడివని మొన్న మీ ఇంటిన నిన్ను చూసాక.. నీతో మాట్లాడేక అనుకున్నాం. కానీ మా బెదురు మాదిగా." అని మాత్రం అనేసింది.


అందుకున్నాడు సూరి. "నువ్వు ఎలా అంటావో అని అప్పుడు కట్టులు కోరాం. అంతంతే." అన్నాడు.


"లేదు లేదు. భానుమతి కోసం మిమ్మల్ని నేను సంతృప్తి పర్చగలను. చెప్పండి.. మీ పల్లెలో మీరు అప్పగించే పొలం పనులు ఏమైనా నేను చేస్తాను." చెప్పుతున్నాడు గోపాలం.


బిడియంతో కుదియించుకు పోతున్నారు భానుమతి తల్లిదండ్రులు.

భానుమతి కలగచేసుకుంది. "లేదు. లేదు. అమ్మ నాన్నలను తేలిక పర్చడం కోసమే అప్పుడు నేను అలా అన్నాను. మా అమ్మ నాన్నలు చేసే పొలం పనులు నువ్వు చేయగలిగితేనే మన పెళ్లికి వాళ్లు ఒప్పుకునేది అవుతుందని." చెప్పింది మెల్లిగా మెల్లిగా.


"అంతే బాబూ. మా పిల్ల అప్పుడు అలా అనడంతో మేము గట్టిగా దానినే నిలబెట్టేం." నసిగాడు సూరి.


"బాబూ, పట్నం మనిషి మీరు. పల్లె బిడ్డ మా పిల్ల. పైగా రోజూ వచ్చి మీ దగ్గర పాటాలు చదువుకుంటుంది. ఇవన్నీ మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేసాయి. అందుకే మీతో మాట్లాడుతూ అప్పుడు ఏమో వాగేసాం. ఏమీ అనుకోకు బాబు." సర్ది చెప్పబోతుంది సామిత్రమ్మ.


"లేదమ్మా.. అప్పుడు మీరు కానీ, భానుమతి కానీ ఏమీ తప్పు అనలేదు. కానిది కోర లేదు. మీ భయాలలో సబబు ఉంది. దాని కోసం ఇప్పుడు తంటాలు పడ వద్దు." విషయం పల్చ పర్చేయడానికి యత్నిస్తున్నాడు గోపాలం.


ఆ ముగ్గురు అతడినే చూస్తున్నారు.


"నిజానికి నేను ఇలా రావడానికి కారణం.. మీరు చెప్పేది చేసి, అలా మీకు ఎదురు ఇచ్చి, భానుమతిని నా సొంతం చేసుకోవాలనే. నమ్మండి." ఖండితంగా చెప్పేసాడు గోపాలం.

ఆ ముగ్గురు మూకుమ్మడిగా ఆనందంలో మునిగిపోతున్నారు.

***

బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ బివిడి ప్రసాదరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.



రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.









93 views0 comments

Comments


bottom of page