'Ee Manishi Inthe' - New Telugu Story Written By Peddada Sathyanarayana
Published In manatelugukathalu.com On 31/07/2024
'ఈ మనిషి ఇంతే' తెలుగు కథ
రచన: పెద్దాడ సత్యనారాయణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
“ఏమండీ! మా అక్కయ్య కూతురికి వచ్చే సోమవారం శ్రీమంతము, నన్ను రెండురోజుల ముందే రమ్మని ఫోన్ చేసి చెప్పిందండి” అంటుంది పద్మ.
“మంచిదే, నేను టికెట్ రిజర్వు చేయిస్తాను వెళ్ళిరా” అంటాడు రాఘవ.
“శ్రీమంతానికి కొత్త చీర కొనుక్కుంటే బాగుంటుందండి”.
“నీకు వైజాగ్ వెళ్లి వచ్చేందుకు ఇంకా, చదివింపులకి చాలా ఖర్చు అవుతుందికదా, కొత్త చీర అంటే ఎలాగ, ఉన్న వాటిల్లో మంచివి తీసుకెళ్ళు” అంటాడు రాఘవ.
‘సరే’ అని, పద్మ తన చెల్లెలు నీరజకి సమస్య చెబుతుంది.
‘నేను చెప్పినట్టు చెయ్యి’ అని సలహా ఇస్తుంది నీరజ.
మరుసటిరోజు పద్మ భర్తతో, “ఏమండీ! మీరే నా అలమరలో మూడు మంచి చీరలు చూసి చెప్పండి” అంటుంది.
‘ఓ దానికేమి భాగ్యము’, అని ఇద్దరు అలమర దగ్గరకి వెళ్తారు.
“ఆ చిలకాకు పట్టు చీర బాగుంది” అంటాడు రాఘవ.
“రెండు నెలల క్రితము రాధిక పెళ్ళిలో కట్టుకున్నాను. చీరలు లేనట్టు శ్రీమంతానికి కట్టుకుంటే ఏమి బాగుంటుందండి”.
“నీవు చెప్పింది కూడా నిజమే, ఆ గంధము రంగుది బాగుంది” అంటాడు, రాఘవ.
“అది బాగుంది, మూడేళ్ళ క్రితము కొన్నారు, చీర బాగుంది కానీ జాకెట్టు చిన్నదయిపోయంది. ఇంత తక్కువ సమయములో దర్జీ కుట్టి ఇవ్వరండి” అని వివరణ ఇస్తుంది పద్మ.
“సరే ఆ గులాబీరంగు చీర..” అంటాడు రాఘవ.
పద్మ చీర మడత విప్పి చూపించి, “చూడండి.. దీని మీద మరకలు ఉన్నాయి, దీన్ని డ్రైక్లీనర్స్ ఇమ్మంటే ఇప్పటి దాకా మీకు వీలవలేదు” అంటుంది.
“సరేలే, నీవు వైజాగ్ వెళ్లి వచ్చిన తర్వాత అన్నీఇద్దాము. ఆ మెరూన్ కలర్ సారీ చాలా బాగుంది” అంటాడు రాఘవ.
“నాకు నచ్చిందండి, నా పుట్టినరోజుకి మావాళ్లు పెట్టిన చీర. మీకు అభ్యంతరము లేక పొతే కట్టుకుంటాను” అంటుంది పద్మ.
“వద్దు, అని ఆ ఎర్ర పూవులు ఉన్న నల్ల చీర బాగుంది” అంటాడు రాఘవ.
“నలుపు రంగు శుభకార్యాలలో కట్టుకోకూడదండి” అంటుంది పద్మ.
పాపం! రాఘవ కి ఓపిక పోయింది.
“పద్మా! నీకున్న చీరలలో మంచివి చూసి తీసుకెళ్ళు. నీవు వచ్చిన తర్వాత ఒకేసారి రెండు చీరలు కొనుక్కుందుగాని” అంటాడు రాఘవ.
--------------------------------------------------------------------------------------------------------------------------
పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు నా నమస్కారములు.
పేరు: పెద్దాడ సత్యనారాయణ B .A విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్
డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్
విద్యాభ్యాసము సికింద్రాబాద్
సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి 4 కధలు 1 నాటిక
వ్యాసాలకి పారితోషికం మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.
సంఘసేవ: గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.
コメント