ఏక్ నిరంజన్
- Dr. Brinda M. N.
- Apr 2
- 3 min read

మనిషి గొప్పవాడు… కానీ మానవత్వం ఉన్నప్పుడే!
Ek Niranjan - New Telugu Article | Dr. Brinda M N
Published In manatelugukathalu.com On 02/04/2026
ఏక్ నిరంజన్ - తెలుగు వ్యాసం | డాక్టర్ బృంద ఎం. ఎన్.
సృష్టిలో మానవుడు చాలా గొప్పవాడు. మానవత్వం కలిగిన వాడు కనుక మానవుడయ్యాడు. దయ, క్షమ, కరుణ, వాత్సల్యం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఓర్పుల సమాహారమే మానవత్వం. పురాణ కాలంలో ఈ నడవడికనే కొనసాగిస్తూ జీవనం గడిపేవారు. కానీ, ఈ ఆధునిక ప్రపంచంలో మానవత్వం కోసం అన్వేషణ చేయాలి. "జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది" అని సీతారామశాస్త్రి తెలిపిన విధంగా మనచుట్టూ అందరూ ఉండి కూడా మనం ఒంటరిగానే మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడినది.
ముఖ్యకారణంగా మొదటి స్థానం స్వార్థం పేరుకుపోవడమే. భూమిలోనికి వేరు చొచ్చుకుపోయిన చందంగా, ఎంత పెకిలించినా రాని విధంగా పీఠం వేసింది. అహం అనే ఆయుధంతో అందరినీ చిందరవందర చేస్తోంది. "నేను - నాది" అన్న భావన విషమించడంతో తన కళ్ళ ముందర ఆనందాన్ని ఆస్వాదించలేకపోతున్నాడు. ఎదుటివారు తనకన్నా తక్కువ అన్నింట్లో నేనే మిన్న అన్న మీమాంసంతో విర్రవీగుచున్నాడు.
రెండవస్థానం నైతిక విలువలది. భారతీయ హైందవ సాంస్కృతిలో వేదభూమి, రుద్రభూమి, దేవభూమిలో జన్మించిన మనం ఈరోజు సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తోందంటే నైతిక విలువలు లేకపోవటమే. అవి మనకు జన్మతః వచ్చిన విద్యలు. క్రమశిక్షణ, సంస్కారం, పెద్దలయందు భక్తిగౌరవాలతో మెలగడం, పిల్లలపట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉండడం, వినయ విధేయతలు, సమయపాలన దేశభక్తి, దైవభక్తి మొదలైనవి. పూర్వీకుల గుణ సంపదను బూడిదలో పోసిన పన్నీరుగా మారుస్తున్నారు.
ఓర్వలేనితనం, ఈర్ష్య, అసూయద్వేషాల ప్రవాహం నిత్యం కొనసాగుతూ స్వార్థం అనే మహాసాగరంలో కలిసిపోతుంది. మంచివారు లేరని కాదు, ఉన్నారు గంజాయిమొక్కలో తులసి మొక్కలా. ఈరోజు మనం ధనం వెచ్చిస్తే దొరకనిది ఏదీలేదు అన్న భ్రమతో కొందరు బ్రతుకుని కొనసాగిస్తున్నారు. నిజమే బంగారం, వెండితో సహా అన్ని కొనగలం. కానీ, ఈనాటి ఆధునిక సాంకేతిక ప్రపంచంలో ఒక్క మంచివాడు లభించడం బహుకష్టం.వజ్రం, కడిగిన ముత్యాల్ని వెదుక్కోవటం ఎంత కష్టమో, అదే విధంగా అటువంటి స్వచ్ఛమైన మానవుడు వెదకటం అంతే కష్టతరమైనది అనిపిస్తుంది.
మనం ఎదుటివారితో మాట్లాడితే ఏం లాభం వస్తుంది? అన్న లాభాపేక్షకు విలువనిస్తూ పరిపూర్ణ ఆనందానికి దూరమవుతున్నారు.
పురాణాతిహాసాలు మనకు జ్ఞానమార్గాలు. రామాయణం రామలక్ష్మణులా సోదరులు మెలగాలని సూచిస్తే, ఒకరినొకరు ఎప్పుడు ముందుకు పోదామని ఆలోచిస్తున్నారు. రాముడు ఏకపత్నీవ్రతుడు, ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య అన్న సిద్దాంతాన్ని మానవుడు ఎపుడో మరిచారని అనిపిస్తుంది. దినపత్రిక చదవాలంటే భయం, వణుకు, సభ్యసమాజంలో అరాచకత్వం, అవినీతి విలయతాండవం చేస్తుంటే తట్టుకుని ఎదురుదాడి పోరాడే సత్తా ఎంత మందికి వుంది? ఎవరు ఎటు పోతే ఏముందిలే. మనం మన కుటుంబం బాగుంటే చాలని ఆశిస్తున్నారు. కానీ పక్కవారికి ఆపద వచ్చినప్పుడు చిన్న సహాయానికి కూడా ముందుకు రాలేక పోతున్నారు. ఎన్నో సృచ్భంద సంస్థలు వెలిసాయి, కానీ పేరుకు తగ్గట్టుగా పనిచేసే వారు ఎందరు? కలసిమెలిసి సంసారాన్ని స్వర్గంగా మార్చవలసిన దంపతులలో, కొందరు నిప్పుల కుంపటిలా మారుస్తున్నారు. భార్యను హత్య చేసిన తర్వాత ముక్కలు చేసి ఇంటిలో మూల వేసిన వారు కొందరు వుంటే, జన్మనిచ్చిన తల్లి పై ఆఘాయిత్యాలకు పాల్పడే సతులు, జీవితమంతా తోడుగా వుండాల్సిన భర్త త్రాష్టుడుగా ప్రవర్తిస్తే ఏమయిపోతుంది సర్వ మానవాళి ?ఒక్కసారి ఆలోచించండి.
మన ఆత్మఘోష వినండి. భారతదేశ సంస్కృతిని కాపాడండి. జీవితం నీటి బుడగ లాంటిది. మనిషి జన్మ దేవుడు మనకు ఇచ్చిన గొప్పవరం. కనులు తీస్తే జననం, కనులు మూస్తే మరణం. మధ్యన జరిగే వింత నాటకమే జీవితం. ఆశాశ్వమైన దీనికోసం ఎన్నో కుట్రలు, కుతంత్రాలు ఎందుకు? నీటి బుడగ ఎప్పుడు టప్ అంటుందో తెలియదు. ఉన్న కొన్ని రోజులు అందరితో కలిసిమెలిసి ఆనందంగా గడుపుదాం. మంచి పనులు చేయండి. తోటి వారికి చేయూత నివ్వండి. మరణించిన తర్వాత మన వెంట వచ్చేది మంచి, చెడులు మాత్రమే. ఎక్కడ పుట్టామో అక్కడికే వెళ్తాం నలుగురితో నవ్వుతూ మనస్పూర్తిగా మాట్లాడుతూ మంచి దారంతో మల్లెల మాటలను పోగుచేస్తూ నిస్వార్థమైన హారాన్ని చేసి ఆనంద డోలికలు ఊగుతూ జీవితాన్ని సార్థకం చేసుకోండి. మంచి సమాజాన్ని తయారు చేయాలనేదే నా తపన, అందుకే ఈ చిన్న ప్రయత్నం అందరూ భాగస్వామ్యం కావాలని ఆశిస్తున్నాను.
"జై తెలుగుతల్లి! జై భరతమాత"
సమాప్తం
డాక్టర్ బృంద ఎం. ఎన్. గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.
కవయిత్రి, రచయిత్రి, గాయని,
స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి
15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట
భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.




Comments