'Ennikalu 2023 Ghatanalu' - New Telugu Story Written By Peddada Sathyanarayana Published In manatelugukathalu.com On 01/05/2024
'ఎన్నికలు - 2023 ఘటనలు' తెలుగు కథ
రచన: పెద్దాడ సత్యనారాయణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రాజా మాణిక్ కి ఎమ్మెల్యే టికెట్ లభించిన ఆనందంలో, “చలం! తొందరగా కారు తీసుకురా” అని డ్రైవర్ కి చెప్పాడు.
“సర్ వస్తున్నా” అని కారు తెచ్చి డోర్ తీసి “ఎక్కండి సర్” అంటాడు.
“పి. ఏ. రంగ రాలేదేంటి” అని అడుగుతాడు రాజా మాణిక్.
“సర్! మీరు రంగాగార్ని మున్సిపల్ ఆఫీస్ దగ్గర కలుస్తానన్నారు”.
“ఓహ్ సరే, మున్సిపల్ ఆఫీస్ దగ్గరకి పోనియ్” అంటాడు రాజాగారు.
కారు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఆగుతుంది.
రంగా వచ్చి, “సర్, పర్మిషన్ లెటర్” అని ఇస్తాడు.
“రంగా! కార్య కర్తలు అందరు వస్తున్నారా” అని అడుగుతాడు రాజా మాణిక్.
“సర్! మీరు సైనికుల్లా పనిచేయాలి అన్నారు కదా”.
“అన్నాను, ఇప్పుడు ఏమైంది” అంటాడు చిరు కోపముగా రాజమాణిక్.
“సర్! వాళ్ళు గన్ను, బిర్యానీ, మందు అన్ని కావాలంటున్నారు సర్”.
“వాళ్ళని కార్య కర్తలు మాదిరి గానే పని చేయమను. నేను గెలిస్తే గన్ తప్ప అన్ని ఇస్తామని చెప్పు” అంటాడు.
“సర్! నాదొక అనుమానము, మీ బామ్మర్దికి టికెట్ ఇవ్వలేదుకదా, అయినా ఆయన మన పార్టీకి మద్దతు ఇస్తున్నాడు కదా, మతలబు ఏంటి సర్” అంటాడు రంగా.
“ఆదా, మాబామ్మర్దికి టికెట్ ఇచ్చిన గెలవడము కష్టము. ఒకవేళ గెలిచినా మొదటి టర్మ్ లో పదవి దొరకదు. ఓడిపోతే రాజకీయములో నెగ్గుకు రావడము కష్టము. ఇప్పుడు మారు మాట్లాడకుండ పార్టీ కోసము కష్టపడితే, వాడికి రాబోయే రోజుల్లో అధిష్ఠానం ఏదో ఒక పదవి ఇచ్చే అవకాశము ఉంది” అని రాజకియ రహస్యము చెప్తాడు రాజా మాణిక్.
“అర్ధమయ్యింది సర్. , సార్ మన ప్రత్యర్థి పార్టీలో అభ్యర్థి చెప్పులు వేసుకోకుండా ప్రచారము చేస్తున్నారు. తను గెలిస్తే చెప్పులు వేసు కుంటాను అంటున్నాడు సార్”.
“రంగ, గెలిస్తే మంచిదే, ఒకవేళ ఓడిపోతే బూట్లు వేసుకుంటాడు..”
కారు లో వెళ్తుండగా ఒక అభ్యర్థి కర్రసాము చేసి ఓట్లు అడుగు తున్నాడు.
“సార్! ప్రజలు ఓట్లు వేస్తారా”, అని అడుగుతాడు రంగా.
“ఓట్లు వేస్తారో లేదో తెలియదు, అతను అభ్యర్థి అనే విషయము అందరకి తెలుస్తుంది. అదే గొప్ప విషయము” అంటాడు రాజమాణిక్.
“రంగా! ఇంకా చాలా మంది నమ్మే నమ్మకాలు కనిపిస్తాయి, దూరంగా చూడు.. ఒక అభ్యర్థి గుఱ్ఱము పైన వెళ్లి నామినేషన్ వేస్తే గెలుస్తానని నమ్ముతాడు. ఇంకో అభ్యర్థి గోమాత తో కనిపిస్తున్నాడు చూసావా” అంటాడు రాజమాణిక్.
“ఎస్ సార్” అంటాడు రంగా.
“గోమాతని పూజ చేసి నామినేషన్ వేస్తే గెలుస్తానని అతని నమ్మకము” అని వివరణ ఇస్తాడు రాజా మాణిక్.
“సార్! మన ప్రతిపక్షాలు గ్యారంటీలు ప్రకటించాయి కదా, ప్రజలు ఓటు వేస్తారా” అని అడుగుతాడు రంగా.
“రంగా! ఇప్పటి వరకు రాజకీయాలలో, వాగ్దానాలు, హామీలు. భరోసాలు అనేపదాలు అభ్యర్థులు వాడేవారు గ్యారంటీ అనే మాట ప్రజలలో నమ్మకము పెంచే అవకాశము ఉంది. ఈ గ్యారంటీ అనే మాట మొదటి సారిగా రాజకియ నాయకులు వాడారు” అని జవాబు ఇస్తాడు రాజా మాణిక్.
కొద్దిరోజుల తర్వాత, రాజా మాణిక్ రంగాని అడుగుతాడు. “మనము ఎందుకు ఓడి పోయమో అర్థము కావటము లేదు”. “సార్! మనము ఓడిపోలేదు, ప్రజల తీర్పుని గౌరవిస్తున్నాము” అని రాజకీయముగా జవాబు ఇస్తాడు రంగా.
“నిజమే రంగా నీవు చెప్పింది, మన కార్య కర్తలు ఇంకా రాలేదేంటి?” అని ప్రశ్నిస్తాడు రాజమాణిక్.
“సార్! మీరు మన కార్య కర్తలే మన వారసులు అని చెప్పారు కదా” అంటాడు రంగా.
“అవును, అన్నాను, అందులో తప్పేంటి” అని అడుగుతాడు రాజా మాణిక్.
“సార్! వారసులు ఎప్పుడు గెలుపు వైపే ఉంటారు. అందుకే కార్యకర్తలు పాలక వర్గములో చేరారు”.
“నిజమే రంగా! రాజకియ నాయకులే పార్టీలు మారుతున్నప్పుడు కార్యకర్తలను తప్పు పట్టకూడదు” అని సంభాషణ ముగిస్తాడు.
***
పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు నా నమస్కారములు.
పేరు: పెద్దాడ సత్యనారాయణ B .A విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్
డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్
విద్యాభ్యాసము సికింద్రాబాద్
సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి 4 కధలు 1 నాటిక
వ్యాసాలకి పారితోషికం మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.
సంఘసేవ: గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.
コメント