top of page

ద్వాపరయుగంలో వారధి



'Dwaparayugamlo Varadhi' - New Telugu Story Written By Peddada Sathyanarayana Published In manatelugukathalu.com On 01/04/2024

'ద్వాపరయుగంలో వారధి' తెలుగు కథ 

రచన: పెద్దాడ సత్యనారాయణ


ఒకానొక సందర్భంలో హనుమాన్ అర్జునులు కృష్ణుని సమక్షంలో లంకపై వారధి నిర్మించిన శ్రీరాముడి గురించి వాదోపవాదములు జరిగినవి. 


ఈ సందర్భంగా అర్జునుడు “రాముడు వానరుల సహాయంతో లంకపై వారధి రాళ్లతో నిర్మించినాడు. అదే నేనైతే నా విలువిద్య ప్రావీణ్యంతో బలమైన వారధిని లంకపై నిర్మించగలను. వానర్లైన మీ ఘనత, సంచారకులైన రాముడి ఘనత ఏమిటి” అని తెలిపెను. 


హనుమ కృష్ణయ్య సమక్షంలో అర్జునుని తన విలువిద్యతో వారధి నిర్మించమనెను. దాని బలమెంతయు నేనొక్కడినే పరీక్షించెదను అని తెలిపెను. కృష్ణుడు మౌనముగా ఉండెను. 


 అర్జునుడు తన ధనుర్భాణములు సంధించి వారధి నిర్మించినాడు. ఆంజనేయుడు రామనామం జపించి వారధి మీద కాలు మోపాడు. వంతెన పెళ పెళ లాడుతూ విరగ సాగింది. శ్రీకృష్ణుడు రామాంజనేయ శక్తిని నిలువరించుటకు శ్రీకూర్మ యంత్రాన్ని ప్రతిష్టించాడు. అప్పుడు విరుగుతున్న వంతెన చెక్కుచెదరలేదు. హనుమంతుడు మరియు అర్జునుడు శ్రీకృష్ణుడే శ్రీరాముడని తెలుసుకున్నారు. 


 వజ్రకాయలు బలాబలాల పోటీ నుంచి విరమించుకున్నారు. ఈ సందర్భంగా తెలుసుకోవలసింది ఏమిటంటే త్రేతాయుగంలో రామనామం పలుకుతూ లంక మీద వారధి నిర్మించారు. అందువలన రాళ్లు నీటి మీద వేసినప్పుడు మునగకుండా తేలాయి. 


***


పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


రచయిత పరిచయం:

 మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు   నా  నమస్కారములు.

పేరు: పెద్దాడ సత్యనారాయణ   B .A  విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్                                                               

డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్   

విద్యాభ్యాసము సికింద్రాబాద్                                                                    

సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి  4 కధలు 1 నాటిక                                                

వ్యాసాలకి పారితోషికం  మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.                                            

సంఘసేవ:  గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి   మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.




279 views0 comments
bottom of page