ఎవరి ప్రాణం వారికి తీపే!
- Kasivarapu Venkatasubbaiah

- Oct 10
- 4 min read
#KasivarapuVenkatasubbaiah, #కాశీవరపువెంకటసుబ్బయ్య, #EvariPranamVarikiTheepe, #ఎవరిప్రాణంవారికితీపే!, #తెలుగుపల్లెకథలు

Evari Pranam Variki Theepe - New Telugu Story Written By - Kasivarapu Venkatasubbaiah
Published In manatelugukathalu.com On 10/10/2025
ఎవరి ప్రాణం వారికి తీపే! - తెలుగు కథ
రచన : కాశీవరపు వెంకటసుబ్బయ్య
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
పూర్వం వనంపుల అనే గ్రామంలో విజయరామారావు అనే పెద్ద భూస్వామి ఉండేవాడు. ఆయన లెక్కలేనన్ని భూములు, పండ్ల తోటలు, కోటానుకోట్ల బంగారు వరహాలు సంపాదించాడు. ఆయన కోట లాంటి ఇల్లు కట్టుకున్నాడు.
ఆయన వద్ద జీతగాడ్లు, పనివాళ్ళు, కూలీలు లెక్కకు మించి ఉండేవారు. ఆయన వంటి ధనవంతుడు తన ఊరు చుట్టుపక్కల వందమైళ్ళ వరకు ఎవరూ లేరు. వ్యవసాయం మీద, వ్యాపారం మీద ఏటా లెక్కలేనంత ఆదాయం వస్తూ ఉండేది. దానధర్మాలు, సత్రాలు సావిళ్ళు, గుళ్ళు గోపురాలు, బళ్ళు కట్టించినా ఆయన సంపద తగ్గలేదు కదా మరింత పెరిగింది..
ఆయన భార్య విద్యావతి ఆమెకు ఏడుగురు కుమారులు. ఏడుగురు కొడుకులకు చక్కని రూపవతులు, విద్యావంతులైన అమ్మాయిలను చూసి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు విజయరామారావు.
అలా ఏండ్ల పూండ్లు గడిచినా ఏడుగురు కొడుకులలో ఒక్కరికీ కూడా సంతానం కలగలేదు. నోములు వ్రతాలు వోచిన, సంతర్పణలు చేసిన, తీర్థాయాత్రలు, పుణ్య క్షేత్రాలు తిరిగిన సంతానం కలగలేదు.
చాల కాలానికి ఏడుగురు అన్నదమ్ములలో మధ్యముడైన శ్రీనాథ్ అతని భార్య అకలంకాదేవి ముద్దులొలికే చూడ చక్కని మగబిడ్డను ప్రసవించింది. విజయరామారావు ఆనందానికి అవధులు, నియమితులు, హద్దులు లేవు. ఊరంతా సలువ పందిళ్లు వేసి గానా భుజాలు, నాట్యాలు, విందులు వినోదాలు ఏర్పాటు చేశాడు.
శ్రీకాంత్ అని పేరు పెట్టి మహా వైభవంగా పురుడు, నామకరణం, బారసాల జరిపించాడు విజయరామారావు. ఏడుగురు అన్నదమ్ములు వారి భార్యలు సంతోషంగా, అల్లారు ముద్దుగా, క్రింద పెడితే మట్టి అవుతుందన్నట్లుగా శ్రీకాంత్తును పెంచారు. శ్రీకాంత్ రేపొక్కఛాయా మాపొక్క ఛాయాగా పెరుగుతున్నాడు.
శ్రీకాంత్తుకు అక్షరాభ్యాస వయసు వచ్చింది. శ్రీకాంత్తుకు అక్షరాభ్యాసాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. విద్యను అభ్యసించడానికి మంచి జీతాలను ఇచ్చి ఉపాద్యాయులను ఇంట్లోనే ఏర్పాటు చేశారు. శ్రీకాంత్ పెరిగే కొద్దీ వివిధ శాస్త్రాలను అధ్యయనం చేయడానికి నిష్ణాతులైన పండితులను నియమించారు కుటుంబం సభ్యులు. శ్రీకాంత్ ఇరువై ఐదు ఏండ్ల వయసు వచ్చేసరికి సకల విద్యలలో ప్రావిణ్యుడు అయ్యాడు.
శ్రీకాంత్ నీతిమంతుడిగా, దయా హృదయుడిగా, ధర్మపరుడిగా, న్యాయశీలుడుగా, సర్వ జీవుల పట్ల సమానత్వం కలిగినవాడిగా ఎదిగాడు.
ఏడుగురి దంపతులకు శ్రీకాంత్ ఏకైక వారసుడు కావడం వల్ల కుటుంబమంతా ప్రాణప్రదంగా చూసుకొనేవారు. అమితంగా ప్రేమించేవారు. ఊరందరికీ కూడ శ్రీకాంత్ అంటే అంతులేని అభిమానం.
యుక్తవయసు రాగానే శ్రీకాంత్తుకు వివాహ ప్రయత్నాలు చేయసాగారు. కానీ 'మనం ఒకటి తలుస్తే విధి మరోకటి తలుస్తుంది కదా!' శ్రీకాంత్ అల్పాయుస్కుడు. ఒక సాయంకాలం పూట ఏడంతస్తులమేడ ఎక్కి ప్రకృతి సౌందర్యాన్ని, సూర్యాస్తమయాన్ని శ్రీకాంత్ తిలకిస్తూ ఉండగా కాలు జారి ఏడంతస్తులమేడ పైనుంచి క్రింద పడిపోయాడు. బలమైన దెబ్బలు తగిలి చాల రక్తం పోయింది.
గొప్ప గొప్ప వైద్యులు ఎంత ప్రయత్నించినా శ్రీకాంత్ ను బతికించలేకపోయారు. కుటుంబమంతా శ్రీకాంత్ మృతదేహాం చుట్టూ చేరి విపరీతంగా విలపించారు.
"కనికరం లేని ఓ దేవుడా! అభమూ శుభమూ ఎరుగని వాడిని తీసుకపోవడం నీకు న్యాయమా? ఇంకా ఏమి అనుభవించని వాడిని ఎత్తుకపోవడం ధర్మమా? మా ఏకైక వారసుడిని మాకు కాకుండా చేసిన దయాహీనుడివి, క్రూరుడివి. నీవు దేవుడిని కాదు. దాక్షిణ్యం లేని రాక్షసుడివి. అంతకైతే నన్ను కొండబోయి మా వారసుడిని బ్రతికించు! నన్ను తీసుకుపోయి మా వాడిని బ్రతికించు!" అని కుటుంబ సభ్యులందరూ ఎవరికి వారు అంటూ భోరున ఏడుస్తున్నారు.
గుండెలు బాదుకుంటూన్నారు. ఆ ప్రాంతమంతా ఏడుపులు పెడబొబ్బలుతో శోకసంద్రమైంది. శ్రీకాంత్ ప్రాణాన్ని యమధర్మరాజు తీసుకుని యమలోకానికి పోతున్నాడు.
"యమధర్మరాజా! మావాళ్ళు నన్ను 'ప్రాణం ఒక ఎత్తుగా' పెంచారు. నేను వారి వారసుడిగా వారి వంశాన్ని నిలబెడతానని ప్రగాఢంగా నమ్మారు. నేను అర్ధాంతరంగా చనిపోయే సరికి భరించలేక పోతున్నారు. నాకు బదులుగా తమ ప్రాణాన్ని తీసుకొని పొమ్మంటున్నారు. నాకు బదులుగా వారిలో ఒకరి ప్రాణాన్ని తీసుకొని నన్ను వదలండి ప్రభూ" యముడితో శ్రీకాంత్ వేడుకున్నాడు.
"శ్రీకాంత్! వాళ్ళు ఆనవాయితీ కాబట్టి ఏడుస్తున్నారు. నిజంగానే వాళ్ళ ప్రాణానికి ముప్పు వస్తే అపుడు గానీ వారి అసలు రూపం బయటపడదు. ఎవరి ప్రాణం వారికి తీపి శ్రీకాంత్ " బదులు చెప్పాడు యమధర్మరాజు.
"అంతగా బాధపడుతున్నారు. అది అంతా నటనా అని నాకు అనిపించలేదు. నాకు బదులుగా ఎరోకరు ప్రాణం వదుతారేమో తెలుసుకుంటాను. అనుమతించండి ప్రభూ!" కోరాడు శ్రీకాంత్.
"సరే నీవు పోయి ప్రయత్నించు! నీకు బదులు ఎవరైనా ప్రాణం ఇస్తారేమో తెలుసుకో! అప్పుడే నీకు నిజం తెలుస్తుంది. " అనుమతి ఇచ్చాడు యముడు.
యమధర్మరాజు శ్రీకాంత్ ప్రాణాన్ని వదలగానే శ్రీకాంత్ ప్రాణం తన మృత శరీరంలో ప్రవేశించి నిద్ర నుంచి మేల్కొన్నట్లు లేచాడు.
ఆశ్చర్యం నుంచి తేరుకొని మహానందపడ్డారు కుటుంబ సభ్యులు.
"అమ్మలారా! నాన్నలారా! నేను బ్రతికి రాలేదు. యమధర్మరాజు ఒక షరతు మీద వదిలాడు. నాకు బదులుగా మీలో ఎవరైనా ప్రాణత్యాగం చేస్తే నన్ను జీవింప చేస్తాడంట. మీలో ఎవరు నాకోసం ప్రాణత్యాగం చేస్తారు. చెప్పండి అనగానే అందరూ మౌనం వహించారు.
"ముందుగా అన్ని అనుభవించి వయసు రీత్యా పండిపోయిన జేజి, అబ్బలను అడుగుతాను (రాయలసీమలో నాన్న గారి అమ్మను 'జేజి' అంటారు, నాన్న గారి నాన్నను 'అబ్బ' అంటారు. అలాగే అమ్మ గారి అమ్మను 'అవ్వ' అంటారు, అమ్మ గారి నాన్నను 'తాత' అంటారు)
"అబ్బా! నీవు నాకు మారుగా యముడి వెంట పోతావా?" అబ్బను అడిగాడు శ్రీకాంత్.
" నాయినా శ్రీకాంత్! మీ జేజి ముసిలిది. ఆమెను ఎవరు చూసుకుంటారు? ఆమెకు తోడుగా నేను ఉండాలి మనుమడా!" విజయరామారావు నిష్కర్షగా చెప్పాడు.
"జేజీ! నాకోసం నాకు బదులుగా ప్రాణత్యాగం చేస్తావా?" అడిగాడు ఆశగా.
"నాయినా మనుమడా! మీ అబ్బ ముసిలివాడు కదా నాయినా! ఆయనకు అన్నీ నేనే చూసుకోవాలి. ఆయన భూమిమీద ఉన్నంతవరకు నేనూ ఉండాలి నాయినా!" నిర్ద్వంద్వంగా చెప్పింది జేజి.
పెదనాన్నలను పెద్దమ్మలను అడిగాడు శ్రీకాంత్. వారూ అదే సమాధానం ఇచ్చారు. చిన్నాన్నలను చిన్నమ్మలను అడిగాడు వాళ్ళు కూడా అదే విధమైన జవాబు చెప్పారు.
చివరికి తల్లిదండ్రులు కూడా అదే బాటలోనే నడిచారు. దానితో శ్రీకాంత్ కు తత్వం బోధపడి తిరిగి యమధర్మరాజును చేరినాడు.
"చూశావా శ్రీకాంత్! మావాడి బదులు నన్ను తీసుపో అన్నవారు తమ వరకు వచ్చేసరికి ఎలా వెనక్కి తగ్గారో తెలిందా! కాబట్టి ఎవడి ప్రాణం వాడికి తీపి. "
“అవును ప్రభూ! ఎవడి చావు వాడే చావాలి గానీ ఒకడి కోసం ఇంక్కొడు చావడు అని బోధపడింది ప్రభూ! పదండి పోదాం!" శ్రీకాంత్ స్థిరచిత్తతో పలికాడు.
-------
కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ కాశీవరపు వెంకటసుబ్బయ్య గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
Profile Link:
YouTube Playlist Link:
పేరు కాశీవరపు వెంకటసుబ్బయ్య.
పుట్టింది 1960లో.
చదివింది డిగ్రీ.
నివాసం ఉంటున్నది కడప జిల్లా ప్రొద్దుటూరులో.
అమ్మానాన్నలు - చిన్నక్క, వెంకటసుబ్బన్న.
భార్య - కళావతి.
సంతానం - రాజేంద్ర కుమార్ , లక్ష్మీప్రసన్న, నరసింహ ప్రసాద్ .
కోడలు - త్రివేణి. అల్లుడు - హేమాద్రి (సాగర్). మనుమరాలు - శాన్విక. తన్విక
మనుమడు - దేవాన్స్ విక్రమ సింహ
రచనలు - ఎద మీటిన రాగాలు' కవితా సంపుటి, 'తుమ్మెద పదాలు' మినీ కవితల సంపుటి,
'పినాకిని కథలు' కథల సంపుటి.
రానున్న రచనలు - 'చమత్కార కథలు' చిన్న కథల సంపుటి. 'పౌరాణిక పాత్రలు, చారిత్రక వ్యక్తులు' కథల సంపుటి.
సన్మానాలు సత్కారాలు - సాహితీమిత్రమండలి.
పెన్నోత్సవం 2004.
జార్జి క్లబ్ వారు,
ప్రొద్దుటూరు నాటక పరిషత్.
యువ సాహితీ. గాజులపల్లి పెద్ద సుబ్బయ్య అండ్ సుబ్బమ్మ గార్ల సేవా సమితి.
స్నేహం సేవా సమితి.
కళా స్రవంతి.
తెలుగు సాహితీ సాంస్కృతిక సంస్థ.
NTR అభిమాన సంఘం.
తెలుగు రక్షణ వేదిక
వండర్ వరల్డ్ రికార్డు కవి సత్కారం.
గోదావరి పుష్కర పురస్కారం.
కృష్ణా పుష్కర పురస్కారం.
స్వామి క్రియేషన్స్.
కృష్ణదేవరాయ సాహితీ సమితి.
భానుమతి స్వరం మీడియా.
కళాభారతి. కొలకలూరి ఇనాక్ జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను




Comments