ఎవరు నేను? ఎందుకిలా?
- Neeraja Prabhala
- 2 hours ago
- 1 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #Nenevarini, #ఎవరునేను, #ఎందుకిలా

Evaru Nenu Endukila - New Telugu Poem Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 26/08/2025
ఎవరు నేను? ఎందుకిలా? - తెలుగు కవిత
రచన: నీరజ హరి ప్రభల
ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత
అందరు ఉన్నా ఎవరూలేని ఏకాకిని.
అన్నీ ఉన్నా ఏమీలేని నిరుపేదని.
మాట్లాడాలని ఉన్నా నోరు మెదపలేని దానిని.
ఎంతో చేయాలని, ఏవేవో సాధించాలనే ఆశ ఉన్నా,
ఎండమావి వంటి ఈ దుర్భర బ్రతుకులో,
అసాధ్యమనే నిరాశ కలుగుతోంది.
శాడిస్టు కట్టిన తాళికి విలువ ఇస్తూ,
బ్రతుకులో వేదన, రోదనలని అనుభవిస్తూ,
విలువైన బ్రతుకు నాశనమాయె.
కాలము, ప్రాయము తిరిగిరావని తెలిసినా,
మానమర్యాదలకోసం ప్రాకులాడుతూ,
ప్రాణరక్షణ కోసం అలమటిస్తూ,
అభాగ్యురాలి ఆవేదన తీరేనా?
మంచిరోజులు వచ్చేనా?
ఏమిటీ జీవితం? నాకే ఎందుకిలా?
అంతేలేని ఈకష్టాలకు అంతమేది?
ఈప్రశ్నకు బదులేది?
బాధతో ఇంకిపోయిన నాకళ్లకు వెలుగేది?
ఏమిటిలా? ఎందుకిలా?
జీవితమంటే ఇదేనా? ఇంతేనా?
ఈ ప్రశ్నకు బదులేది?
ఈ జీవికి సుఖమేది?
ఈ అభాగ్యురాలికి మనశ్శాంతి ఏది?
కనుచూపు మేరన కానరాదు.

-నీరజ హరి ప్రభల
留言