శోకసంద్రం
- Dr. Brinda M. N.
- 2 days ago
- 8 min read
సామాజిక కవిత, మానవ సంబంధాలు, కుటుంబ విలువలు, వృద్ధాప్య ఒంటరితనం, రైతు జీవితం, సైనికుల త్యాగం, తెలుగు సాహిత్యం, భావోద్వేగ కవిత, మానవత్వం, సామాజిక చైతన్యం, telugu poem, emotional poem, social awareness poetry, family values, human relationships

Sokasandram - Telugu Poem | Dr. Brinda M N
శోకసంద్రం - తెలుగు కవిత | డాక్టర్ ఎం. ఎన్. బృంద
Published In manatelugukathalu.com On 11/06/2026
మనిషి జీవితాన్ని సార్థకం చేసేది సంపద కాదు, బంధాలు. కానీ ఆధునిక జీవనశైలిలో మమకారాలు, బాధ్యతలు, కుటుంబ విలువలు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ ఎం. ఎన్. బృంద రచించిన "శోకసంద్రం" కవిత సమాజంలో పెరుగుతున్న నిర్లక్ష్యం, వృద్ధుల ఒంటరితనం, రైతు బాధలు, సైనికుల త్యాగాలు, కుటుంబ బంధాల విచ్ఛిన్నత వంటి అంశాలను హృదయాన్ని కదిలించేలా ప్రతిబింబిస్తుంది. ప్రతి పాదం ఒక సామాజిక సత్యాన్ని ఆవిష్కరిస్తూ, మానవత్వం వైపు మనలను ఆలోచింపజేస్తుంది.
మమతల మదిలో కానరాని
కన్నీటి వరదలు,,,,, చెప్మా
సత్సంతాన సౌభాగ్యం
శుభకరం శ్రేయస్కరం
సుమబాలల సౌగంధికా లేపనం!!
యవ్వనం కాటేసిన కబంధం
కౌమార్యం కడలిని దాటని తీరం
మధ్యమ గదుల్లో పాచిన బంధం
వాగుల వేగుకు నోచుకొని వార్ధక్యం
గూడు పగిలిన ప్రేమజంట విచ్చిన్నం!!
ఒంటరియై ఎడారిలో కోయిల గాత్రం
బీడు భూముల భార కళేబరం
కర్షక బ్రతుకుల్లో ఎండిన ఫలం
సైనికుల సంసార త్యాగ కుటీరం
దహనకాండల దండగ నైవేద్యం!!
కన్నుల ఎదుటే పున్నామ నరకం
వావివరసలు మరచిన సుఖభోగం
బాధ్యత నామానికి భరోసా శూన్యం
అడుగడుగున కన్నీటి పర్యంతం
లెక్కలేని వరదలు తాకిన శోకసంద్రం!!
మమకార మాంగళ్యాల శోభనం
వెటకార వలయాల ద్వారం
మది కవాటాలు మలినాల దుర్గంధం
స్వేచ్ఛా స్వాతంత్ర్యాల దేహం
స్వచ్ఛత కొరవడిన రూపం!!
"జై తెలుగుతల్లి! జై భరతమాత"
==============================

Haritha Mithra - Telugu Poem | Dr. Brinda M N
హరిత మిత్ర - తెలుగు కవిత | డాక్టర్ ఎం. ఎన్. బృంద
Published In manatelugukathalu.com On 05/06/2026
(ప్రపంచ సైకిల్ దినోత్సవ శుభాకాంక్షలతో( 03/06/2026))
తొక్కరా తొక్కరా
సైకిల్ బాగా తొక్కరా
వెన్నెముక వయ్యారి
నీ బలానికి మయూరి
కండరాల కొవ్వు కరిగించే
సులువైన మార్గం
కీళ్ళనొప్పులు మటుమాయం!!
ఖర్చులేని అద్భుత వ్యాయామం
పాదాల పదనిసల
పండిన పేరంటం
ట్రింగ్ ట్రింగ్ చేతివేళ్ల
చిలిపి తాండవం
భీభత్స బ్రేకులతో పెరుగు
తరగని బలం
ఇంధనంలేని ఆనంద ఆయుధం!!
కాలుష్యం కూడని కాలగమనం
చక్రాలకు అద్దెనులే సుమాల సౌరభం
శ్రమయేవ జయతే సాక్ష్యం
శారీరక శ్రమకు చిహ్నం
మానసిక విలాసాల మకరందం!!
ఆర్థికలేమిలేని అనువైన వాహనం
బావామరదల్ల సరస సాధనం
సైకిల్ తొక్కడమే ఆరోగ్య రహస్యం
నిరుపేదల నిండైన వాహనం
ఆరోగ్య అమృత భాండాగారం!!
సామాన్యుడి సువర్ణ రథం
అవసరానికి ఆదుకునే
పంచకల్యాణి యోగం
చౌకైన మానవ చోదకం
సైకిల్ గుర్తుతోనే
అన్నగారి ప్రభంజనం
పిల్లల సాకార స్వప్నం
హరితమిత్రకు ఎల్లప్పుడూ
స్వాగతం సుస్వాగతం!!
"జై తెలుగుతల్లి! జై భరతమాత"
=================================

Okka Kshanam - Telugu Poem | Dr. Brinda M N
ఒక్క క్షణం - తెలుగు కవిత | డాక్టర్ ఎం. ఎన్. బృంద
Published In manatelugukathalu.com On 02/06/2026
నాలుగు కళ్ళు కలిసి
రెండు మనస్సులు మెరిసి
ఒక్కటైన ఆత్మ శివతాండవం
పరవశించి ప్రవహించే
ప్రమథగణం
అంకురించే అర్ధనారీశ్వరత్వం!
నయనాలు నాట్యమాడిన నిమిషం
తలపుల తరంగాల తాడనం
పులకించే మేను పరిమళం
లిపిలేని కంటి కమనీయ భాష
చిలిపి చూపుల చల్లని చంద్రకాంతి!
అధరాలు ఆలపించని ఆభేరి రాగం
గుండె గూటిలో గూడుకట్టే గంధర్వగానం
వేవేల అర్థాల సంగతుల
సమ్మోహన సంగీత కచేరీలు
కనుపాప కెంపుల నవ్వులు!
కనురెప్పల కనుసైగ పాటలు
నల్లని గుడ్డుపై మెరిసే
ప్రేమికుల ప్రతిబింబాలు
కన్నీటి ధారల కాంతి కవనాలు
ఒకరికొకరై వెలిగే ఆశాకిరణం!
హృదయవీణ మీటిన
మ్రోగే మధుర సంతకం
ప్రణయ ప్రబంధ కావ్యమే
పలికిన వేదమంత్రాల సారం
ఇగరని అనుబంధాల అమృతం!
వీడలేని మేము తోడునీడై
ఏలెదము ప్రేమసామ్రాజ్యం
ఆ ఒక్క నిమిషం
మూగ కన్నుల ముచ్చట్లు
మదిలో కురిసిన మమతల చప్పట్లు!
"జై తెలుగుతల్లి! జై భరతమాత!"
===============================

Kabolu - Telugu Poem | Dr. Brinda M N
కాబోలు.. - తెలుగు కవిత | డాక్టర్ ఎం. ఎన్. బృంద
Published In manatelugukathalu.com On 25/05/2026
నయనాలు నయాగరా జలపాతంలా
వర్షిస్తూ హర్షిస్తూ
కొంటె చూపుతో సైగ చేస్తే
ప్రకృతితో తన భారాన్ని
పంచుకున్నట్లేమో.. కాబోలు!!
కనుపాప కంటిరెప్పల మాటున
తల్లి గర్భంలో నిద్రించిన చిన్నారిలా
సేదదీరుతూ తిరుగుతూ
ఎదగాయం బరువును కురిసే కన్నీటిని అడిగిందేమో.. కాబోలు!!
గుండెనిండా గృచ్చుకున్న ముళ్ళు
ఒక్కొక్కటి ఒక్కో ధారతో
నిరంతరం స్రవిస్తూ ఉంటే
మనసు విస్తీర్ణం ఎడారిలా
కన్నీటి కుండలు ఆవిరైపోతాయేమో.. కాబోలు!!
అవయవాలు అవసర శక్తి
అంబరాన్ని దాటి
అదో లోకంలో ప్రవేశిస్తుంటే
పెదాలు పల్లవి పాడలేక
గొంతు మూగబోయిందేమో.. కాబోలు!!
కళ్ళ ముందు కదలాడుతున్న
కపట కుతంత్రాల బొమ్మలు
కకవికల కేకలతో కుళ్ళబొడుస్తుంటే
హృదయ కవాటాలు తెరచుకోలేక
కన్నీటి సెలయేరు కరిగిపోయిందేమో.. కాబోలు!!
"జై తెలుగుతల్లి! జై భరతమాత"
==============================

Johar Johar - Telugu Poem | Dr. Brinda M N
జోహార్ జోహార్ - తెలుగు కవిత | డాక్టర్ ఎం. ఎన్. బృంద
Published In manatelugukathalu.com On 01/05/2026
ఈ ప్రపంచాన్ని నిలబెట్టేది ఎవరు? కళ్లకు కనిపించని… కానీప్రతి నిర్మాణంలో, ప్రతి అన్నపిండి లో వారి చెమట దాగి ఉంటుంది…
వారే… శ్రామికులు. వారికి అంకితం ఈ కవిత…
మట్టికుండలో మకరందం
మట్టిలో వెలకట్టలేని మాణిక్యం
వేసవికాల చూపుల చల్లదనం
సర్వకాలాల సహజ పానీయం
జోహార్,,,,, జోహార్ ఓ శ్రామికవీరుడా!!
ఇలలో వెలసి అందమైన గృహం
కార్మిక కరములలో ఇంద్రభవనం
ప్రభుత్వ రంగాల బలమైన విశ్వాసం
ఆధ్యాత్మిక ఆరాధన చిహ్నం
జోహార్,,,,,,, జోహార్ ఓ శ్రామికవీరుడా!!
నేల నింగి నడుమ అనంతం
కర్షకులు లేని కాలపరిమితo
సంతృప్తి చెందే భార ఉదరం
ఆకలి కేకలకు అసలైన ఆలవాలం
జోహార్,,,,,,, జోహార్ ఓ శ్రామికవీరుడా!!
కష్టాన్ని నమ్మిన కాయం
దేన్నైనా ఎదిరించే ధైర్యం
అందరి మన్ననలే ఆలంబనం
గెలుపోటములు లెక్కచేయని వైనం
జోహార్,,,,,,, జోహార్ ఓ శ్రామికవీరుడా!!
మహాప్రస్థాన మహాకావ్యం
మరోప్రపంచ సృష్టి రూపం
కార్మిక కర్షక లోకానికి అభిషేకం
బడుగు బలహీన వర్గాల బాణం
జోహార్,,,,,,, జోహార్ ఓ శ్రామికవీరుడా!!
అభ్యుదయ భావాల కెరటం
అభినవ సిద్ధాంతాల స్వరూపం
జగతిని మేల్కొలిపే సాధనం
చెమట చుక్కల చిక్కని చందనం
జోహార్,,,,,,,,, జోహార్ ఓ శ్రామికవీరుడా!!
నైతికతల నవీన గోపురం
కొరడా దెబ్బల కంచు కవచం
బడాబాబుల భరించలేని పెత్తనం
ప్రపంచ యజ్ఞంలో సమిధ పుష్పం
జోహార్,,,,,,, జోహార్ ఓ శ్రామికవీరుడా!!
"జై తెలుగుతల్లి! జై భరతమాత"
=======================================

Viswasundari - Telugu Poem | Dr. Brinda M N
విశ్వసుందరి - తెలుగు కవిత | డాక్టర్ ఎం. ఎన్. బృంద
Published In manatelugukathalu.com On 22/04/2026
పచ్చని పుడమి…కాలుష్యపు భారంతో విలవిలలాడుతోంది!
మన చేతుల్లోనే ఉంది భూమి భవిష్యత్తు. ప్రకృతిని ప్రేమిద్దాం… సంరక్షిద్దాం 🌱
పచ్చని చీరకట్టి పవళించే పుడమి సోయగం
నీలిరంగు రవికె తొడిగిన సింగారం
సప్తవర్ణ కుచ్చిళ్ళతో మెరిసే కాంతికిరణం
నేలపై నాట్యమాడే సితార సౌరభం
విషాన్ని గర్భంలో దాచే విలక్షణత్వం!!
కాలుష్య కంపు కెంపుగా మార్చే వైనం
మురికినీటి మాలిన్యమే మధుర పానీయం
ప్లాస్టిక్ భూతాల భార భాండాగారం
హరితగృహ వాయువుల వీడలేని విహారం
వైరుధ్య రసాయనాల రసరమ్య గీతం!!
మత్తు పదార్థాల సాచెట్లు తొడిగే పసిడి కంకణం
నికోటిన్ పొగల వయ్యారంతో సాంబ్రాణి ధూపం
మందుబాబుల మత్తు మూటలను కుట్టే ముత్యాలహారం
దుర్మార్గుల దగాకోరుల దండలు ధరించే ధ్వనిరాగం
వేలకోట్ల ఉలి దెబ్బలు తగిలినా తరగని శిల్ప సౌందర్యం!!
డీజే మోతలతో విలపిస్తున్న హృదయ కవాటం
ఘడియ ఘడియకు గుండె లోతుల్లో తంత్రీనాదం
వ్యర్థపదార్థాల విలాస వైభోగాలే విందు భోజనం
ఎడారి ప్రాంతాల్లో తడిసిన నిప్పుల వర్షం
అందమైన గ్రహానికి తెప్పించకు ఆగ్రహం!!
ముచ్చటగా మూడు ఆర్లతోనే తళతళ తోరణం
రక్షణ కవచానికి సంరక్షణ సంగీతం
బరువు బాధ్యతలతో భరిణెలాంటి భూగోళం
మొక్కల పంపకాల పెంపకాలే సుభిక్షం
విశ్వసుందరి వినూత్న విలాస శాసనం!!
"జై తెలుగుతల్లి! జై భరతమాత!"
=====================================

Maranamleni Mahanetha - Telugu Poem | Dr. Brinda M N
మరణంలేని మహానేత - తెలుగు కవిత | డాక్టర్ ఎం. ఎన్. బృంద
Published In manatelugukathalu.com On 14/04/2026
సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కోసం జీవితాంతం పోరాడిన మహానేత…
B. R. Ambedkar గారి ఆశయాలుఈ కవితలో అద్భుతంగా ప్రతిబింబించబడ్డాయి.
నవీనరీతిలో సృష్టించిన రాజ్యాంగ నిర్మాత
నైతికవిలువల వలువలను కాపాడిన రచయిత
వైవిధ్య ఆలోచనా సిద్ధాంతాల రాజకీయవేత్త
సామాజిక సమానత్వ సంస్కరణల తత్వవేత్త
ఆధ్యాత్మిక మార్గాన్ని అన్వేషించిన బౌద్ధవేత్త!!
అంకితభావానికి అసమాన నిదర్శనం బాబాసాహెబ్ బిరుదాంకిత
అణగారిన వర్గాల హక్కుల సాధనకై చేయూత
హిందూకోడ్ బిల్లును ప్రవేశపెట్టిన న్యాయవేత్త
విద్యావినయ సంస్కారాలతో నిబద్ధత
పెయింటింగ్ ఫర్ ఏ వీసాయే తన ఆత్మకథ!!
అడ్డంకులు అధిగమించి జయించాలి భవిత
ఆయన ఆశయాలను ఆచరించాలి యువత
మేధస్సులో కీర్తిశిఖరాన్ని అధిరోహించిన నేత
ముందుకు సాగిపొమ్మనే విగ్రహ విశిష్టత
చూపుడు వేలుతో దేశ దశాదిశ నిర్దేశిత!!
మట్టిలో మిగిలిన మరణంలేని మహానేత
అతిపెద్ద రాజ్యాంగమే ఆధునిక భగవద్గీత
నవసమాజ నిర్మాణానికై నడుంబిగించే సమత
బడుగు బలహీన వర్గాలపై తగదు విముఖత
గుణం మానవత్వాల పీఠిక పరచిన పిత!!
జై తెలుగుతల్లి! జై భరతమాత!
========================

ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలతో
Neerojyam - Telugu Poem | Dr. Brinda M N
నీరోజ్యం - తెలుగు కవిత | డాక్టర్ ఎం. ఎన్. బృంద
Published In manatelugukathalu.com On 07/04/2026
ఆరోగ్యమే మహాభాగ్యం నానుడితో అంకురం
కలువ కన్నుల కాంతికై కరోటారసం
రామములక్కాయతో హృదయానికి ప్రేమకుసుమం
ఉదరమున నాట్యమాడే అల్లరి అల్లం
కణకణమున ఊయలలూగిన ఉల్లి సమీరం!!
ఎర్రదుంప దూకుడు తగ్గని కాలేయ ప్రవాహం
కర్ణానికి అందాల ఆభరణం గొడుగుల ఆనందం
బత్తాయిల బలవర్ధక భాగ్యమే క్షీరసాగరం
ఎముకలకై ఆహ్వానం సెలరీ కాడల సోయగం
వెన్నెల వెన్నపండుతో ముస్తాబాయే ధర్మక్షేత్రం!!
కామాలేని క్లోమానికి చిలగడ దుంపల చిరుదరహాసం
గిరగిర తిరిగే గాలితిత్తుల ద్రాక్ష విన్యాసం
జడగంటల జిలతైలంతో జివ్వుమనే ఋతుచక్రం
అరవిరిసిన అంజీరతో నరుని విహంగ విహారం
వంకీల వడపోతల గోరుచిక్కుళ్ళ గాంధారి రాగం!!
శ్వేతవర్ణపు తిలల కాయం కంచుకవచం
సర్వాంగ సుందర సమన్వయం నారికేళం
సింధూర ఫలాల శీతోష్ణ స్వర్ణశిఖరం
ఉవ్వెత్తున ఉరుముతున్న ఉదకనాదం
నిజ జీవితాన నీరోజ్యానికి నీరాజనం
నిస్వార్థ చింతనయే నగవుకు నిలువుటద్దం!!
"జై తెలుగుతల్లి! జై భరతమాత"
===========================================

Anandamaya Jeevitham - Telugu Poem | ఆనందమయ జీవితం - తెలుగు కవిత | Dr. Brinda M N Published In manatelugukathalu.com On 14/03/2026
ప్రతి పౌరుడు మానవతా విలువలని అభ్యసించిన
తల్లిదండ్రుల పెంపకం నైతికతతో కూడుకున్న
వరకట్న నిషేధాన్ని సంపూర్ణంగా అమలు పరచిన
అత్తారింట్లో ఆడపడుచుల రోదన చల్లారిన
ఎస్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ,,,,,,,అవునా!!
పచ్చని పర్యావరణాన్ని పరిరక్షించిన రోజున
రోడ్డు భద్రతా నియమాలను పదిలంగా పాటించిన
తలకు హెల్మెట్ ను రక్షణ కవచంలా ధరించిన
అంతులేని ఆనందమయ జీవితం గడిపిన
ఎస్ లైఫ్ ఈజ్ బ్రైట్ ఫుల్,,,,, కాదనగలనా!!
పరువు తీసే పేకాటను పారద్రోలిన
దైన్య స్థితికి జార్చే ధూమపానానికి దూరమున్నా
మతి తప్పించే మధ్యపానానికి మంగళం పాడినా
ఈవ్ టీజింగ్ ఇంధనాన్ని పట్టాలెక్కించిన
ఎస్ లైఫ్ ఈజ్ కలర్ ఫుల్,,,,, తెలుపకనే తెలుపనా!!
పేదవారందరికీ కడుపారా పట్టెడన్నం లభించిన
వైద్య సదుపాయాలు విరివిగా విలసిల్లిన
అక్షరాస్యత శాతం ఆలయ శిఖరాన్ని తాకిన
నీతి నిజాయితీ గల నేతలకు రాజ్యాధికారమిచ్చిన
ఎస్ లైఫ్ ఈజ్ మీనింగ్ ఫుల్,,,,,,,, పారవశ్యమేనా!!
రారాజు రైతన్న కన్నీటిని తుడిచిన
మాజీ దేశ సైనికులకు మద్దతు పలికిన
సృష్టిలోని ప్రతి ప్రాణిని ప్రేమించి గౌరవించిన
తెలుగు సాహిత్య సాగరాన్ని సంరక్షించిన
ఎస్ లైఫ్ ఈజ్ వండర్ఫుల్,,,,, సంతోషమేనా!!
==================================

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో
Navyapatha Pathaakam - New Telugu Poem Written By Dr. Brinda M N
Published In manatelugukathalu.com On 08/03/2026
నవ్యపథ పతాకం - తెలుగు కవిత
రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.
అంబరాన్ని తాకిన మహిళా లోకం
సాధికారత సమానత్వానికై పోరాటం
సమూలంగా నశించాలి వరకట్న పిశాచం
చట్టసభల్లో స్త్రీమూర్తులకే శ్రీకారం
త్రివిధ దళాల్లో ప్రత్యేక శిక్షణం!!
ఇంటి పనులలో పురుషుల కరసాయం
సాంకేతిక రంగాన పూరించాలి సమరశంఖం
పరిశోధనా పత్రాలలో పదాల సమన్వయం
వ్యవసాయ క్షేత్రాల పసిడి పచ్చదనం
పల్లెల్లో మహిళా సర్పంచుల పెంపుదనం!!
అంతుచిక్కని అర్థంకాని నిశ్శబ్ద విప్లవం
పంచాయితీకొక స్త్రీల స్వీయ శిక్షణాలయం
ఆరాలి అత్తల లింగనిర్ధారణ రోగం
మారాలి మామల వక్రదృష్టి కోణం
పిల్లల పెంపకాల్లో సమగ్ర నిర్ణయం!!
విశ్వవిద్యాలయాల్లో ఉనికికై విఫలయత్నం
రూటు మారాలి పితృస్వామ్య రాజ్యం
కాదంటే కయ్యానికి కాలుదువ్వడమే శ్రేయస్కరం
అణచివేతకు తలవంచని అభ్యుదయ శిఖరం
అడుగడుగునా మారిన నవ్యపథ పతాకం!!
====================================

Bhavaragam - New Telugu Poem Written By Dr. Brinda M N
Published In manatelugukathalu.com On 28/02/2026
భావరాగం - తెలుగు కవిత
రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.
అందచందాల అజంతా భాష గొప్పతనం
నేటితరాలకు తెల్లమబ్బు గగనం
మాతృభాషలోన గౌరవం ఆంగ్లంలో శూన్యం
చిన్నాపెద్దా లింగ బేధాలులేని సమభావం
వావివరసలు లేని వలువలూడిన విమానం!!
బంధాల భావుకత బాటకు నిస్సారం
దొడ్డ హోదాల వారికి తెలుగే ఐచ్చికం
నేటి పాఠశాలల్లో కొరడాల ఘాతుకం
మమ్మీడాడీలపై మోజు తగ్గని పెద్దరికం
ఆంటీల ఆహ్వానం యాంటీల నైజం!!
వారధి భాషకే వరుస పట్టాభిషేకం
తెనుగు మాధ్యమాన్ని మరచిన ప్రభుత్వాల తాత్సారం
తెలుగుకు పట్టిన తెగులు కాష్టం
అన్ని రాష్ట్రాల్లో భాషపై ఆత్మాభిమానం
ఉభయ ప్రాంతాల్లో ప్రవహించని భావరాగం!!
పసి హృదయాల్లో మూగబోయిన వీణానాదం
అవగాహన సదస్సులో యాంకర్ల యాస గగ్గోలం
ఆధునికత పేరుతో అమ్మభాషకు అవమానం
కదలిరండు తరలిరండు అంటూ మొదలవ్వాలి ఉద్యమం
పాశ్చాత్య దేశాల్లో మన భాషకు పాదాభివందనం!!

Antharmadanam - New Telugu Poem Written By Dr. Brinda M N
Published In manatelugukathalu.com On 04/02/2026
అంతర్మథనం - తెలుగు కవిత
రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.
ప్రజల జిహ్వయందు వశించిరి కవిపుంగవులు
కలముతో కదిలించిరి కమనీయ కవనాలు
కాదేదీ కవితకు అనర్హం! అన్నారు పండితులు
ప్రాచీనాధునిక సాహిత్యసేవా తత్పురుషులు!!
ప్రకృతి సోయగాలకు పరవశించే నా,,,, మది
వికృతి విలయతాండవాలకు బలీయమై విధి
నైతికవిలువల నవీనరీతుల నాణ్యమైన నిధి
వర్ణ వర్గ వైషమ్యాలను పాలద్రోలేనా?అంబుధి!!
ఆకలితో అన్నార్తుల ఆర్తనాదాలు కర్ణకఠోరం
జలవిద్యుత్తు వనరుల వ్యర్థకళాపాలు నిషేధం
వృద్ధాశ్రమ వలయాలకు సమూలంగా సశేషం
తరువుల తలపులు భావితరాలకు సంసిద్ధం!!
మద్యధూమపాన మత్తు పదార్థాలపై మక్కువ వద్దు
సంసార సాగరంలో ఇరుసంతానమే కడు ముద్దు
సాంకేతిక నైపుణ్య సమాహారంలో గగనమే హద్దు
మాతాపిత గురువుల సేవలోనే విరిసేను తొలిపొద్దు!!
యువరక్తంతో యవనికపై ఎగరాలి యువ కెరటాలు
వజ్రాయుధమైన ఓటుతో చీల్చాలి నోట్ల కోటలు
వరకట్న కీచకులను తరిమి వేయాలి వధువులు
సుస్వరాల సాహిత్యధారతోనే
నా అంతర్మథనాల అపురూప శిల్పాలు!!
జై తెలుగుతల్లి!! జై భరతమాత!!

Rasa Sindhuram - New Telugu Poem Written By Dr. Brinda M N
Published In manatelugukathalu.com On 19/01/2026
రససింధూరం - తెలుగు కవిత
రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.
పంచభూతాలలో విరిసిన రససింధూరం
లోహితాశ్వరుని ప్రియమైన రూపం
రంగుల వలయంలో ప్రాథమిక వర్ణం
ఇంద్రధనస్సులో అతిపెద్ద తరంగధైర్ఘ్యం
చంద్రాదిత్యుల నడుమ అభిక్షేపనం!!
ఆడపడుచుల అందచందాల అరుణం
పలనాటి నాగమ్మ పౌరుష చిహ్నం
బాలభగత్ నాటి పెంచిన కాంతికిరణం
మన్నెందొర గుండెల్లో మండిన విప్లవం
సురవరుని శౌర్యానికి నిలువెత్తు నిదర్శనం!!
హృదయానికి టమాటోల నాట్య విన్యాసం
కలువ నయనాలకు ఎర్రపండుతో అభిషేకం
ఎరుపు రంగు పప్పన్నంతో ప్రసన్నం
క్యారెట్ బీట్రూట్లతో బలవర్ధక ఆహారం
ఆవాలంత ఆవకాయతో ఆకలి మాయం!!
అత్యవసర పరిస్థితులలో వైద్య సూచికం
ప్రాణవాయు రుధిరాల స్నేహ మాధుర్యం
మానవుని మనుగడకు ఒక మణిదీపం
నేను సైతం ప్రపంచానికన్న సాహిత్యం
అభాగ్యులు అలమటిస్తున్న అవ్యక్తరాగం!!
వైదేహి వనవాసం శత్రువుల వినాశనం
పాంచాలి పరాభవం సోదరుల సశేషం
ప్రణయానికి ప్రళయానికి ఒకటే రోహితం
కార్మిక కర్షక సేద్యానికి బీజం
నారింజ గులాబీల సమన్వయంతో సూర్యాస్తమయం!!
=============================

Yuvatha Meluko - New Telugu Poem Written By Dr. Brinda M N
Published In manatelugukathalu.com On 08/01/2026
యువతా మేలుకో - తెలుగు కవిత
రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్.
ప్రకృతి విలయతాండవమా? మన తప్పిదమా?
ఓ మనిషీ! సదా మానవత్వంతో ప్రవర్తించు
పెద్దలమాట చద్దన్నం మూట ఆలకించు
అడవులను పెంచు ఆయువును పంచు
మొక్కలను విరివిగా నాటి సంరక్షించు!!
ప్రకృతిమాత మెడలో పచ్చనిహారాన్ని ధరించు
పంచభూతాలు మన ప్రియనేస్తాలని గ్రహించు
కాలుష్య వాయువులను అవలీలగా అణచు
ఓజోన్ పొరను ఓపికతో పరిరక్షించు
సైకిల్ తొక్కుతూ కాలుష్యాన్ని నివారించు!!
ప్లాస్టిక్ భూతాన్ని భువి నుండి నిషేధించు
నీటి పొదుపును నాణ్యతగా నవీకరించు
విద్యుత్తును రాబోవు తరాలకు విస్తరించు
అధిక భూతాపాన్ని హద్దులో ఉంచు
వర్షబిందువులను హర్షముతో సమీకరించు!!
పక్షులకు ప్రేమతో దానాను నోటికి అందించు
జంతువులను జర జాగ్రత్తగా పోషించు
గ్రామాలలో గాలిమర సంఖ్యలను హెచ్చించు
వారానికొక అవగాహన క్రమంతో చర్చించు
మంచి మనస్సుతో మనుగడను నడిపించు!!
ఇరుగు పొరుగువారిని ఇష్టంతో పలకరించు
ప్రకృతి పరిరక్షణ నీ బాధ్యతగా స్వీకరించు
ఇంటికొక ఇంకుడు గుంతను పునరుద్ధరించు
యువతా మేలుకో పుడమిని పులకరించు
ఈ మార్పుకై నేను నిత్యము ఆకాంక్షించు!!
"జై తెలుగుతల్లి! జై భరతమాత"
డాక్టర్ బృంద ఎం. ఎన్. గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.
కవయిత్రి, రచయిత్రి, గాయని,
స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి
15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట
భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.




Comments