top of page

ఫస్ట్ డే ఫస్ట్ షో


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.Youtube Video link

'First Day First Show' New Telugu Story
మూర్తి, గోపాల్, కుమార్, రాజు- నలుగురూ చిన్నప్పటి నుంచి ప్రాణస్నేహితులు. మూర్తి, గోపాల్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఆఫీసర్స్ గా పని చేసి రిటైర్ అయ్యారు. కుమార్, రాజు పెద్ద బ్యాంకులలో పనిచేసి రిటైర్ అయ్యారు. నలుగురూ హైదరాబాద్ లో పక్క పక్క ఇళ్ళు కొనుక్కుని, ఆడుతూ పాడుతూ కాలం గడుపుతున్నారు.


ఈ నలుగురికీ కాలేజీ రోజులలో తమ అభిమాన నటుడి సినిమా మొదటి రోజు మొదటి ఆట కి వెళ్లడం అలవాటు. నలుగురూ అభిమానించేది ఒకే నటుడు అవడం తో, ఏ గొడవా లేదు. ఉద్యోగం లో వున్నప్పుడు తప్పా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే అలవాటు మానుకోలేదు ఆ నలుగురు.


గురువారం రానే వచ్చింది, తమ హీరో పిక్చర్ కి అంతకముందే మూర్తి తమ పోలీస్ కానిస్టేబుల్ ని పంపించి ఫస్ట్ డే ఫస్ట్ షో కి అడ్వాన్స్ బుకింగ్ తీసుకున్నాడు. గురువారం ఉదయం 8 గంటలకు మొదటి షో, నలుగురు ఫ్రెండ్స్ బయలుదేరి ఉడిపి హోటల్ లో, వేడి వేడి ఇడ్లీ సాంబార్, తలో సింగల్ పూరి తిని, కాఫీ తాగి, హాలు కి చేరుకున్నారు. అప్పటికే జనం తండోపతండాలు గా వుండి హాలు లోపలికి తోసుకుంటూ వెళ్తున్నారు.


“పద పద, మన హీరో ఎంట్రన్స్ సీన్ మిస్ అవ్వకుడదు” అంటూ తాము చేసిన ఉద్యోగాల విషయం కూడా మర్చిపోయి తోసుకుంటూ లోపలకి వెళ్లారు.


అప్పుడే న్యూస్ రీలు మొదలైంది, హాలంతా చీకటి.


సెల్ లైట్ సహాయం తో తమ సీట్లు దగ్గరికి చేరి, “అమ్మయ్య మొత్తానికి టైంకి చేరుకున్నాం” అన్నాడు మూర్తి.


సినిమా మొదలైన పదినిమిషాలలోనే హీరో పెద్ద ఫైటింగ్, జనం ఈలలతో హాలు రీసౌండ్ యిస్తోంది.


ఇంతలో మూర్తి మొహం మీద టార్చి లైట్ వెలుగు పడింది. చిరాకు గా వాళ్ళని “అడ్డం తప్పుకోండి. మంచి సీన్ జరుగుతున్నప్పుడు అడ్డంగా రావడమే కాకుండా లైట్ వేస్తారేమిటి?” అన్నాడు మూర్తి.


“హలో సార్, ఈ సీట్స్ మావి, మా సీట్స్ లో కూర్చొని మమ్మల్ని దబాయిస్తున్నారు, లేవండి” అన్నాడు ఆ నలుగురిలో ఒకడు చిరాకు గా.


“ భలే వాడివే, ఈ సీట్స్ మావి, కావాలంటే మా టికెట్స్ యివిగో... చూడు” అంటూ టికెట్స్ చూపించాడు మూర్తి.


ఆ వచ్చిన వాళ్లలో ఒకడు, “ఈ టికెట్స్ ఈ రోజు ఫస్ట్ షో కి, యిది మార్నింగ్ షో.. లేవండి” అన్నాడు.

అందులో ఒక రౌడీ కుర్రాడు, “అరే! ఉటో బే.. మా సీట్స్ లో కూర్చొని నకరాలు పోతున్నావు” అన్నాడు.


అంతే! ఏమైందో తెలియదు, మూర్తి కళ్ల ముందు నుంచి గోపాల్ చెయ్యి వెళ్లి వాడి మొహాన్ని తాకడం, వాడు కింద పడటం ఒకే సారి జరిగింది. ఇంతలో హీరోయిన్ చెలరేగిపోతో పాడుతున్న సాంగ్ వస్తోంది. ఏమి జరిగిందో పట్టించుకోకుండా మిగిలిన ముగ్గురు స్క్రీన్ వంక చూస్తో వుంటే, ఆ నలుగురూ తేలు కుట్టిన దొంగలు లాగా బయటకు నడిచారు.


బయటకు రాగానే వాళ్ళ ముందు మైక్ పెట్టి “మూవీ ఎలా వుంది సార్?” అన్నాడు.


యింకోక కుర్ర గుంపు ‘టికెట్స్ వున్నాయా సార్’ అంటూ తిరగడం కనిపించి, వాళ్లని పిలిచి, “ఫస్ట్ షో కి ఫోర్ టికెట్స్ వున్నాయి. కావాలంటే టికెట్ రేట్ యిచ్చి తీసుకోండి” అనే లోపుగానే చేతిలో రెండు అయిదు వందల నోట్లు పెట్టి టికెట్స్ లాక్కుని, ‘థాంక్స్ సార్’ అంటూ వెళ్ళిపోయారు.


“అదేంటి రా, టికెట్స్ యిచ్చేసావు?” అన్నాడు గోపాల్ కంగారుగా.

“ముందు పదరా త్వరగా” అంటూ బయటకు వచ్చి, “జరిగిన గొడవ చాలు, మనం మొదటి షో కి తీసుకోమంటే, మీ అసిస్టెంట్ ఫస్ట్ షో కి తీసుకొని వచ్చాడు. దానికి తోడు నువ్వు వాడెవడినో కొట్టావ్, చాల్లే పద. వాళ్ళు బయటకు వచ్చి మనల్ని కొట్టే లోపు” అన్నాడు మూర్తి. అందరూ కార్ ఎక్కేసారు.


సాయంత్రం షో కి హుషారుగా మూర్తి దగ్గర టికెట్స్ కొనుకున్న నలుగురు పిల్లలూ వాళ్ళ సీట్స్ లో కూర్చొని చిఫ్స్ తింటూ మాట్లాడుకుంటో వుండగా, పదిమంది తో వచ్చి వీళ్ళని కొట్టడం మొదలుపెట్టారు ఉదయం దెబ్బలు తిన్న వాళ్ళు.


తన అభిమాన హీరో సినిమా చూడకుండా వుండలేక, గోపాల్, తన స్నేహితులు కి చెప్పకుండా సాయంత్రం షో కి వెళ్ళాడు. ఉదయం కూర్చున్న రెండు వరసల వెనుక సీట్ లో కూర్చొని వున్నాడు.


యింతలో ఈ కోట్లాట చూసి వాళ్ళని ఆపి, “ఎందుకు కొడుతున్నారు ఆ పిల్లలని?” అని ఆడిగాడు.


పెద్ద పెద్ద మీసాలతో పోలీస్ వాడు లాగా వున్న గోపాల్ ని చూసి, “వీళ్ళు మార్నింగ్ షో లో మా సీట్లలో కూర్చుని లెమ్మంటే, మా వాడిని కొట్టి వెళ్లిపోయారు, యిప్పుడు వీళ్ళకి బుద్ది చెప్పాలిసిందే” అన్నారు.


వాళ్ళు “అయ్యో! మార్నింగ్ షో కి మేము రాలేదు. ఎవరో పెద్దమనుషులు, ఫస్ట్ షో టికెట్స్ యిస్తే కొన్నాం. మమ్మల్ని మీరు అనవసరంగా కొడుతున్నారు” అని వాపోయారు.


“అయితే మార్నింగ్ షో కి వచ్చింది మీరు కాదా? అయ్యో.. పొరపాటు అయ్యింది, ఫస్ట్ షో టికెట్స్ తో మార్నింగ్ షో కి వచ్చి మా వాడిని కొట్టింది మీరే అనుకున్నాము, సారీ” అని వెళ్లిపోయారు.


“ఏరా.. ఎక్కడికి పోయావ్?” అని అడుగుతున్న మూర్తికి, మిగిలిన స్నేహితులకి జరిగిన విషయం చెప్పి, “పాపం.. మన వల్ల, ఆ పిల్లలు దెబ్బలు తిన్నారు” అన్నాడు గోపాల్.


“అయినా నువ్వు మాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు సినిమా కి? మాతో చెప్పితే మేము వచ్చే వాళ్ళం కదా” అన్నాడు మూర్తి.


అప్పటి వరకు వీళ్ళ మాటలు వింటున్న మూర్తి భార్య, "అప్పుడు మిమ్మల్ని గుర్తు పట్టి నాలుగు తన్ని పంపించే వాళ్ళు," అంది.


“ఒరేయ్.. చూసావా గోపాల్, రిటైర్ అయిన తరువాత, పెద్ద పోలీస్ అధికారులమైనా సరే, లోకువ అయిపోయాం వీళ్ళకి” అన్నాడు నవ్వుతూ మూర్తి.


అయ్యో పాపం...


జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.రచయిత పరిచయం:

నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.


29 views0 comments
bottom of page