top of page

గణపతి బప్పా మోరియా

#తెలుగుకథలు, #అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #GanapathiBappamoria, #గణపతిబప్పామోరియా

ree

Ganapathi Bappa moria - New Telugu Story Written By Addanki Lakshmi

Published In manatelugukathalu.com On 09/09/2025

గణపతి బప్పా మోరియా - తెలుగు కథ

రచన: అద్దంకి లక్ష్మి 


అది ఒక పెద్ద కాలనీ. 

ప్రతి సంవత్సరము గణపతి ఉత్సవాలు చక్కగా జరుపుకుంటారు. ఉదయము సాయంత్రము పిల్లలు పెద్దలు అందరూ జేరి గణపతికి హారతి ఇస్తారు. తర్వాత ప్రసాదాలు పంచి పెడతారు అందరూ ఇంటికి వస్తారు.


పెద్దవాళ్ళకి వెళ్లడానికి టైము లేకపోయినా పిల్లలందరూ జేరతారు. సాయంత్రం హారతికి తప్పక వెళతారు. ఉత్సాహంగా పాల్గొంటారు.

 

 రాము ఆరోజు ఇంటికి వచ్చి "అమ్మమ్మా! హారతి ఇచ్చిన తర్వాత గణపతి పప్పా మోరియా, మంగళ మూర్తి మోరియా అంటారు. మోరియా, ఏమిటి అమ్మమ్మా.. దాని స్టోరీ ఏమిటి" అని అడిగాడు రాగానే.


"ఇక్కడ కూర్చో రా, దానికో స్టోరీ ఉంది చెప్తాను” అంటూ అమ్మమ్మ మొదలు పెట్టింది. 


 మోరియా అసలు కథ:

 

మహారాష్ట్రాలోని పుణెకు 21 కి. మీ. దూరంలో చించ్ వాడి అనే గ్రామంలో ‘మోరియా గోసాని’ అనే సాధువు ఉండేవాడు. ఆయన గణపతికి పరమ భక్తుడు. గణపతిని పూజించేందుకు మోరే గావ్ వరకు రోజూ నడిచి వెళ్లేవాడు. 


ఓ రోజు మోరియా నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి.. సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందనీ.. దాన్ని తీసుకువచ్చి ప్రతిష్టించమనీ చెప్పాడట.. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మోరియా అక్కడున్న నదికి వెళ్లాడు. కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మోరియాకు వినాయకుడి విగ్రహం దొరికింది. 


ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మోరియా గోసావి ఎంత గొప్పవాడు కాకపోతే సాక్షాత్తు వినాయకుడు కలలో కనిపిస్తాడు అంటూ.. మోరియాను చూసేందుకు తండోప తండాలుగా వచ్చారట. మోరియా గోసావి పాదాలను తాకి మోరియా అనటం మొదలుపెట్టారు.. మోరియా గోసావి నిజంగామంగళమూర్తియే అంటూ మొక్కారట.. 


నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడు. మోరియ గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాల్లో మోరియా గోసావి పేరు గణపతి ఉత్సవాల్లో బాగమైపోయింది.. ఆనాటి నుంచి గణపతి బప్పా మోరియా అనే నినాదం నిర్విరామంగా వినబడుతూనే ఉంది.. భక్త వల్లభుడైన వినాయకుడి సేవలలో మోరియా గోసావి తరించిపోయాడు 


అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్పా మోరియా పూడ్చ వర్సీ లౌకర్ యా అని మరాఠీ లో నినదిస్తాం.. ఎందుకంటే గణపతి ప్రతిమ మోరియకు మహారాష్ట్రలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి.. దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ధ్వారనే నెరవేర్చుకుంటాడు అనడానికి మోరియా గోసావి జీవిత కథనే నిదర్శనం.


దీ మోరియా కథ రా రాము.. అర్థమైందా? ముఖ్యంగా మహారాష్ట్రలో తప్పకుండా పూజ అయిన తరువాత ఆయనను తలుచుకుంటారు, తెలిసిందా రాము, "


"మోరియా మహా భక్తుడు అన్నమాట అర్థమైంది అమ్మమ్మ" అంటూ రాము తుర్రు మని ఆటలాడుకునేందుకు బయటకు వెళ్ళిపోయాడు, 

 

***

అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

డేట్ అఫ్ బర్త్

3_6_1946.

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు

సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,


నాటకాలు వ్రాసి

విద్యార్థుల నాటకాలు

వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,

సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి


చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,


**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం


**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం


సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి


ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని

ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,

పద్యాలు ప్రచురించ బడినవి

కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన

కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు

పంచపదులు

సున్నితాలు

ఇష్టపదులు

**గేయాలు

**వ్యాసాలు

**నాటకాలు

పద్యాలు

గజల్స్

కథలు

రుబాయీలు

బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు,

తొణుకులు,

చిలక పలుకులు,

పరిమళాలు,

మధురిమలు,

ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు,

సున్నితాలు,

పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,

15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,

2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,


రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,


1.ప్రచురణ,,,


1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


Comments


bottom of page