గార్దభ జననం
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- 3 days ago
- 3 min read
#GardhabhaJananam, #గార్దభజననం, #గార్దభలహరి, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #పిల్లలకథలు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

గార్దభ లహరి - పార్ట్ 4
Gardhabha Jananam - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 16/06/2025
గార్దభ జననం - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
మారుమూల వెనకబడిన గిరిజన ప్రాంతం బీమా తండా. సరైన రోడ్డు, మంచి నీటి వసతి లేదు. నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు, అపరి శుభ్రత, కట్టుబాట్లు, బీదరికం ఎక్కువ.
ఆర్థిక పరిస్థితుల కారణంగా పిల్లల్ని పోషించలేక అంగడి వస్తువుల్లా అమ్ముకుంటున్నారు.
బీమా తండాలో చంద్రా నాయక్, సోము నాయక్ అన్నదమ్ములు. తండా చుట్టు ప్రాంతాల్లో కూలి పనులు, మట్టి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వారి వద్ద రెండు మగ, మూడు ఆడ గాడిద లున్నాయి. మగ వాటికి వీరూ, దీరూ అని ఆడ గాడిదలకు రంగి, మంగి, గంగ అని పేర్లు పెట్టి పిలుస్తారు.
వాటితో మట్టి పనులు, సీజనులో తండా గుట్టల్లో లభించే సీతాఫలాలు, రేగుపళ్లు, మక్క బుట్టలు సేకరించి పట్నంలో అమ్ముకుంటారు.
పట్నంలో పెద్ద భవంతుల నిర్మాణ పనులప్పుడు అన్నదమ్ము లిద్దరూ గాడిదల్ని తీసుకుని గుడిసెలు వేసుకుని అక్కడే నివాశముంటారు. గర్భంతో ఉన్న ఆడ గాడిదల్ని తండాలో గుడిసెల వద్ద ఉంచుతారు.
చంద్రా నాయక్ కి ఒకే ఒక బుడతడు పదేళ్ల బూక్యా నాయక్. చురుకైనోడు. ఎప్పుడూ ఏవో చిలిపి పనులు చేస్తూంటాడు. తండాలో కొండముచ్చు కోతుల బెడద ఎక్కువ. పండిన సీతాఫలాలు, మక్కబుట్టలు తినేస్తాయి.. గుంపులుగా వచ్చి గుడిసెల్లోని వస్తువులు ఎత్తుకు పోతాయి. కోళ్ల గుడ్లు ఉండనివ్వవు. మేకల పాలు తాగేస్తాయి. పొడవైన తోకల్ని కుచ్చులుగా చుట్టి విసిరి ఎగిరి చెట్ల కొమ్మలు., గుడిసెల మీద స్త్వైర విహారం చేస్తూంటాయి.
వాటిని పరుగెత్తించి తోలడంతోనే బుడతడి రోజు గడిచిపోతుంది. దూరం నుంచే గులేర్ దండాతో గుండురాళ్లు పెట్టి గురి చూసి కోతుల్ని కొడతాడు. రాతి దెబ్బ తగిలిన కోతి తడుముకుంటూ పారిపోతుంది. తండ్రి పట్నానికి పోయినప్పుడు తండాలో గుడిసె దగ్గర కోళ్లు, మేకలు,
చూలు కట్టిన ఆడ గాడిదల పోషణ భాద్యత బూక్యా మీద పడుతుంది.
గాడిద ప్రసవించి చిన్న పిల్లను కనగా దట్టమైన బొచ్చుతో ముద్దుగా అందంగా పరుగు లెడుతుంటుంది. బూక్యా దానితో పరుగులెడుతు ఆటలాడుతాడు. చిన్నప్పుడు ముద్దుగా బొద్దుగా ఉండే అదే గాడిద పిల్ల పెరిగి పెద్దదై మొద్దుగా మారి బరువులు మోస్తుంది.
చూలు కట్టిన ఆడ గాడిద పేరు, పుట్టిన పిల్ల ఆడదో మగదో బూక్యా గుర్తుపడతాడు.
మగ గాడిదకు సంతల్లో గిరాకీ ఉన్నందున అమ్మితే మస్తుగా పైసలు (డబ్బు ) వస్తాయి కనక మగ గాడిద పిల్ల పుట్టిందంటే సంతోషమే. చూలు కట్టిన ఆడగాడిదకు పుట్టిన పిల్ల మగదైతే కొడుకు అనీ ఆడదైతే బిడ్డ అనీ తండ్రి పిలవడం బూక్యా వింటూంటాడు. అది పెరిగి పెద్దదయే వరకు దాని భాధ్యత బూక్యా చూస్తూంటాడు.
పట్నంలో ఉన్న చంద్రానాయక్ తన దగ్గరున్న మంగీ ఆడగాడిద చూలు కట్టినందున తండాకు తీసుకు వచ్చి దాని భాద్యత కొడుకు బూక్యాకు అప్పగించి వెళ్లాడు.
హోళీ పండగ ముందు రోజున చూలు కట్టిన మంగీ మగ గాడిద పిల్లను ప్రసవించింది. బుడతడు బూక్యా ఆనందానికి హద్దు లేక పోయింది. తండాలో హోళీ పండగ బాగా జరుపుకుంటారు. అందువల్ల అంతటా కోలాహలం మొదలైంది. వారం రోజుల ముందు నుంచే తండాలో జనం
గుడుంబా వేడుకల్లో మునిగి తేలుతున్నారు.
హోళీ పండగ కోసం తండాకు తిరిగి వచ్చిన తండ్రి చంద్రా నాయక్ ను చూసిన బూక్యా పరుగున ఎదురెళ్లి " అయ్యా ! మన మంగీకి కొడుకు పుట్టిండు " అంటూ అరవసాగాడు. బుల్లి మగ గాడిద పిల్లను రంగులతో నింపేసాడు. మంగీకి మగ పిల్లాడు పుట్టాడనీ తెలిసి తండాలో ఘనంగా హోళీ గుడుంబా వేడుకలు జరిపించాడు చంద్రా నాయక్.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
コメント