పోలయ్య కవి కూకట్లపల్లికి ఘనసన్మానం "గోవా కడలి కవి రత్న" బిరుదు ప్రదానం
- Kukatlapalli Polayya

- May 25
- 2 min read
Goa Kadali Kavi Ratna, గోవా శతాధిక కవి సమ్మేళనం, Telugu poets meet Goa, Telugu literary event, Telugu kavulu, AK Telugu Media, Mumbai Bharati, Amballa Janardhan, Telugu poetry event, Polayya Kavi award, Telugu literature news

POlayya Kavi Kukatlapalliki Ghana Sanmanam - Gova Kadali Kavi rathna Birudu Pradanam |Special Telugu Article | Polayya Kavi
పోలయ్య కవి కూకట్లపల్లికి ఘనసన్మానం - "గోవా కడలి కవి రత్న" బిరుదు ప్రదానం
- తెలుగు వ్యాసం |పోలయ్య కవి
Published In manatelugukathalu.com On 25/05/2026
🌊✍️ గోవా కడలితీరంలో తెలుగు కవిత్వ వైభవం!
“గోవా శతాధిక కవి సమ్మేళనం”లో ప్రముఖ కవి పోలయ్య కవి కూకట్లపల్లి గారికి🏆 “గోవా కడలి కవిరత్న” బిరుదుతో ఘన సన్మానం జరిగింది.
గోవా శతాధిక కవి సమ్మేళనంలో
పోలయ్య కవి కూకట్లపల్లికి ఘనసన్మానం
"గోవా కడలి కవి రత్న" బిరుదు ప్రదానం...
ఎకె తెలుగు మీడియా ఎఫ్ టాం...
ముంబై భారతి సంస్థల వ్యవస్థాపకులైన అశోక్ కంటే... జగన్ బాబు...అంబల్ల జనార్దన్ సంయుక్త ఆధ్వర్యంలో...
తూలాల సవరమ్మ విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షతన... గోవాలో "గ్రాండియర్ డి సాంచి" స్టార్ హోటల్లో (19.05.2026) 7 రాష్ట్రాల నుంచి వచ్చిన కవులతో
"గోవా శతాధిక కవి సమ్మేళనం" సభ ఘనంగా జరిగింది
ప్రముఖ కవయిత్రి, గాయని డా. బండారు సుజాతా శేఖర్ వ్రాసిన "మట్టిగీతం" పుస్తకాన్ని అంబల్ల జనార్దన్ ఆవిష్కరించి సమీక్ష చేశారు...
కవులకు ముందుగా సన్మానం చేశారు
తదనంతరం కవులు కవితాగానం చేశారు
ఈ సందర్భంగా హైదరాబాద్ అత్తాపూర్ నివాసి విశ్రాంత ఆంధ్రా బ్యాంక్ అధికారి
ప్రముఖ కవి రచయిత నటుడు పోలయ్య కవి కూకట్లపల్లి...వందనం అభివందనం శీర్షికన...కవితాగానం చేస్తూ...
తెలుగు భాషకు పట్టాభిషేకం చేసిన... తెలుగుజాతి ఆత్మగౌరవ జ్యోతిని వెలిగించిన... ఆంధ్రుల ఆరాధ్య దైవం... అన్న...ఎన్టీఆర్ నుండి ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న "నాటు నాటు" తెలుగు పాట రచయిత చంద్రబోస్ వరకు...
ప్రతి ఒక్కరినీ స్మరిస్తూ అందరికీ
"వందనం అభివందనం" అంటూ
చేసిన కవితాగానం సభికులను
అలరించింది. ఆనంద పరవశుల్ని
చేసింది. చప్పట్లతో హాల్ మారుమ్రోగింది.
ఈ సందర్భంగా అనతి కాలంలోనే 5000 కవితలు వ్రాసి సాహితీ సేవ చేస్తున్నందుకు గుర్తింపుగా పోలయ్య కవి కూకట్లపల్లికి
ఎకె తెలుగు మీడియా వ్యవస్థాపకులు
అశోక్ కంటే...ఎఫ్ టాం అధ్యక్షులు
జగన్ బాబు... ముంబాయి భారతి వ్యవస్థాపకులు అంబల్ల జనార్దన్...
"గోవా కడలి కవిరత్న" బిరుదు ప్రదానం చేసి, మెమొంటో, శాలువా, సర్టిఫికెట్ లతో ఘనంగా సన్మానించారు... పోలయ్య కవి కూకట్లపల్లి అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.
తరువాత రెండు రోజులు కవులందరికీ
గోవా టూర్ అరేంజ్ చేశారు. గోవా తెలుగు గవర్నర్ శ్రీ అశోక్ గజపతి గారితో భేటీ, స్నాక్స్, ఫోటో కార్యక్రమం... రెండు గుళ్ళు, రెండు బీచ్ లు, ఒక కోట, ఒక చర్చి, బోటింగ్
మరియు కవులందరికీ స్టార్ హోటల్లో చక్కనివసతి భోజనాలు ఏర్పాటు చేశారు
త్రిమూర్తులు అశోక్ కంటే జగన్ బాబు జనార్దన్ గార్లు ఎన్నో వ్యయ ప్రయాసల
కోర్చి గోవా కవిసమ్మేళనం మరియు గోవా టూర్ ను సమర్థవంతంగా నిర్వహించి ఘనవిజయం చేసినందుకు కవులు వారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేశారు
కవులకు "గోవా శతాధిక కవి సమ్మేళనం" "మూడు రోజుల పండుగలా" ముగిసింది. ఇది మరిచిపోలేని ఓ తీపి జ్ఞాపకంగా మిగిలింది.
-పోలయ్య కవి




















Comments