ఆ..

Aa - Telugu Inspirational Article | Kotha Viritha
ఆ.. - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 19/09/2026
ప్రస్తుతం ఉన్నదాన్ని ఆస్వాదించకుండా “ఇది కాదు… ఇంకేదో కావాలి!” అంటూ పరుగెత్తే మనిషి చివరికి తనకు కావాల్సిన ఆ “ఆ…” ఏమిటో తెలియకుండానే ఉన్న ఆనందాన్ని కూడా కోల్పోతాడనే సరదా జీవిత సత్యాన్ని చెప్పే రచన “ఆ..”.
మనిషి ఆలోచన, అవసరాలు రెండూ చాలా విచిత్రమైనవి.
ఉన్నప్పుడు “అబ్బా… ఇంతేనా!” అనిపిస్తుంది.
లేనప్పుడు “ఆ.. ఉంటే బాగుండేది!” అనిపిస్తుంది.
పల్లెలో ఉంటే పట్టణం గుర్తొస్తుంది.
పట్టణంలో ఉంటే “మిస్సింగ్ విలేజ్ లైఫ్” అంటూ స్టేటస్ పెడతాం.
పల్లెలో ఉదయం కోడి కూస్తే చిరాకు…
పట్టణంలో ఉదయం ట్రాఫిక్ హారన్ వినిపిస్తే ప్రకృతి గుర్తొస్తుంది!
ఇంట్లో ప్రశాంతంగా ఉంటే “ఏదైనా సందడి ఉంటే బాగుణ్ణు” అంటాం.
సందడి మొదలైతే “ఒక్క గంటైనా నిశ్శబ్దంగా ఉంటే బాగుణ్ణు” అంటాం.
సింగిల్‌గా ఉంటే పెళ్లి కావాలంటాం…
పెళ్లయ్యాక “నా పాత జీవితం బాగుండేది” అంటాం.
ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కావాలి.
ఉద్యోగం వస్తే సెలవు కావాలి.
సెలవొస్తే ఎక్కడికైనా వెళ్లాలి.
ఎక్కడికైనా వెళ్తే “ఇంట్లోనే ఉంటే హాయిగా ఉండేది” అనిపిస్తుంది.
డబ్బు ఉంటే టైమ్ కావాలి…టైమ్ ఉంటే డబ్బు కావాలి!
మనిషికి సమస్యలు లేవు…
కోరికలే అసలు సమస్యలు.
ప్రస్తుతం ఉన్నదాన్ని ఆస్వాదించడం కంటే,
లేనిదాని కోసం వెతకడమే మన ప్రత్యేక ప్రతిభ.
బేసిక్‌గా ఉన్నదాన్ని మనిషి ఎప్పుడూ ఒప్పుకోడు.
“ఇది కాదు… ఇంకేదో కావాలి!”
చివరికి…“ఆ” కావాల్సింది ఏంటో తెలియకుండానే,
ఉన్నదాన్ని కూడా మిస్ చేసుకుంటాడు.
***
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.







True words... Form true person
Excellent lines👌 👌 👌