వాడుకున్నోడికి వాడుకున్నంత కాదు భయ్య!

Vadukunnodiki Vadukunnantha Kadu Bhayya - Telugu Inspirational Article | Kotha Viritha
వాడుకున్నోడికి వాడుకున్నంత కాదు భయ్య! - తెలుగు ప్రేరణాత్మక వ్యాసం | కొత్త విరిత
Published in manatelugukathalu.com on 20/09/2026
సౌకర్యాలను ఉపయోగిస్తున్నామా, లేక వనరులను వృథా చేస్తున్నామా అనే ప్రశ్నను సరదా వ్యంగ్యంతో ముందుకు తెస్తుంది “వాడుకున్నోడికి వాడుకున్నంత కాదు భయ్య!”
ఉంది కదా అని వాడేయడం మనకు అలవాటైపోయింది భయ్య…
అవసరం ఉందా లేదా అని ఆలోచించడం మాత్రం మనకు "అవసరం" లేని పని!
చేతిలో ఫోన్ ఉంది కదా… రోజంతా స్క్రీన్‌నే చూడాలి, మెదడు ఉంది కదా… దాన్ని మాత్రం వాడాల్సిన అవసరం లేదుగా!
ఇంట్లో కారు ఉంది కదా… పక్క వీధికి కూడా కారులోనే వెళ్లాలి, నడిస్తే పెట్రోల్ ఆదా అవుతుంది… కానీ మన స్టేటస్‌కి ఏం అవుతుంది?
నీళ్లు వస్తున్నాయి కదా… ట్యాప్ తెరిచి వదిలేయాలి,
రేపు నీళ్ల కోసం క్యూలో నిలబడినా మనకే ఒక ట్యాంకర్ ఫస్ట్ బుక్ అయ్యే అదృష్టాన్నే నిందించాలి!
కరెంటు ఉంది కదా… ఖాళీ గదిలో కూడా ఫ్యాన్, లైట్ తిరగాలి, బిల్లు మాత్రం వచ్చాక “ఇంత ఎందుకు?” అని ఆశ్చర్యపడాలి!
టెక్నాలజీ పని సులభం చేయడానికి వచ్చింది, మనం మాత్రం సులభమైన జీవితాన్ని మరింత "అనవసరాలతో" నింపుకున్నాం!
ప్రకృతి ఇచ్చిన సొత్తు మన సొంతం కాదు భయ్య… మన తర్వాతి తరానికి మనం అప్పుగా తీసుకున్న సంపద. కానీ మన సిద్ధాంతం ఒక్కటే
“ఉంది కదా, ఉన్నంతవరకూ వాడేద్దాం!”
వాడుకున్నోడికి వాడుకున్నంత కాదు భయ్య, తర్వాతి తరానికి మిగిల్చినోడికే నిజమైన వాడకం తెలుసు, అన్న సంగతి మీకు తెలుసా!
***
కొత్త విరిత
సైకాలజీ, బాడీ లాంగ్వేజ్, హ్యూమన్ బిహేవియర్
ఐ.ఐ.టి. ఖరగ్‌పూర్, గౌహతి, ఖరగ్‌పూర్
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: కొత్త విరిత
నా పేరు కొత్త విరిత
B.sc B.ed Msc చేశాను
IIT నుండి సైకాలజీ, సైకియాట్రీ, హ్యూమన్ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్, సైన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మరికొన్ని సర్టిఫికేషన్ చేశాను. తెలుగు భాష అంటే ప్రేమ గౌరవం. తరువాతి తరం వారికి తెలుగు అంటే కేవలం ఎగ్జామ్ లో పాస్ కావటం మాత్రమే కాదని మన భావాలను ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ వారధి తెలుగు భాష అని నా రచనల వల్ల చెప్పే చిన్న ప్రయత్నం నాది.
240 కి పైగా శీర్షికలు,కథలు,70 కి పైగా ఇంగ్లీష్ ఆర్టికల్స్ రాశాను. నా వృత్తి సాఫ్ట్వేర్.







Comments