అడవితల్లి ఆక్రోశం

Adavithalli Akrosam - Telugu Moral Story | Rallabandi Sangam Naidu
అడవితల్లి ఆక్రోశం - తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు
Published in manatelugukathalu.com on 20/09/2026
రాళ్లబండి సంగంనాయుడు రచించిన ‘అడవితల్లి ఆక్రోశం’ ప్రస్తుత కాలానికి అత్యంత ఆవశ్యకమైన పర్యావరణ స్పృహను కలిగించే కథ. ఆధునికత పేరుతో అడవులను నరికివేస్తూ, జంతువులను హింసిస్తూ ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్న మానవుడిపై ప్రకృతే తిరగబడితే పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో ఈ కథ అద్దం పడుతుంది. గాలి, నీరు, వర్షం, ఆహారం అన్నీ ప్రకృతి ప్రసాదించిన వరాలని, వాటిపై సమస్త జీవకోటికి సమాన హక్కు ఉందని గుర్తుచేసే ఈ నీతి కథ పిల్లలకే కాక పెద్దలకూ గొప్ప ఆలోచన కలిగిస్తుంది.
అనగనగా ఒక అడవితల్లి. ఎన్నో యుగాలుగా అడవితల్లి తన పిల్లలైన చెట్లను ప్రేమగా పెంచింది. జంతువులకు, పశుపక్షాదులకు తనలో చోటిచ్చి కన్నతల్లి అయింది. అందరినీ కడుపులో పెట్టుకుని సాకింది ఇన్ని యుగాలుగా. కానీ ఈ మధ్యకాలంలో అడవి సంపద, జంతు సంపద తరిగిపోవడంతో గుండె తరుక్కుపోతోంది అడవితల్లికి.
చూస్తున్న బిడ్డలు చూస్తున్నట్టుగానే నేలకూలడం అడవితల్లి ఆవేదనకు, ఆందోళనకు కారణం. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఒక చెట్టు గానీ, ఒక జంతువు గానీ, ఒక పక్షి గానీ బతికి బట్టకట్టవని నిర్ణయానికి వచ్చింది. ఈ పరిస్థితి గురించి తన పిల్లలైన అడవి జంతువులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి, "ఈ గడ్డు పరిస్థితికి కారకులెవరు?" అని అడిగింది.
"మానవులు" అని బదులిచ్చింది ఏనుగు.
"మానవుడు నాగరికత పేరుతో అడవులను నాశనం చేస్తున్నాడు. మాంసం కోసం విచక్షణ రహితంగా పశువులను వధిస్తున్నాడు" అని వివరించింది ఏనుగు.
"దీన్ని అరికట్టేందుకు మనం ఏం చేయలేమా?" అని అడిగింది అడవితల్లి.
"మనం లేకపోతే మానవ మనుగడ లేదని తెలియజేస్తే సరి" అని చెప్పింది ఎలుగుబంటి.
"అదెలాగా?" అని అడిగింది అడవితల్లి.
"ఈ రోజు నుండి మనం మానవులకు సాయం చేయొద్దు... మన మాట మానవుడు వినేంతవరకు!" అని చెప్పింది ఎలుగుబంటి.
అడవి జంతువులన్నీ ఆ రోజు నుంచి మానవులకు సహాయం చేయడం మానేశాయి. మానవులకు సహాయం చేయొద్దని మేఘాన్ని కోరాయి అడవి జంతువులన్నీ. మేఘం "సరే" నన్నది.
వర్షాలు కురవడం లేదు. ఆవులు పాలు ఇవ్వడం మానేశాయి. ఎద్దులు దున్నబోనని మొరాయించాయి. కోళ్లు కొక్కొరోకో అని కూయడం మానేశాయి. పశువులు మాంసం ఇవ్వడం లేదు. పువ్వులు పూయడం లేదు. చెట్లు కాయలు కాయడం లేదు. పక్షులు పంటచేలపై పురుగులను ఏరడం మానేశాయి.
వానపాములు భూమిని సారవంతం చేయట్లేదు. ఎలుకలు పంటలను నాశనం చేశాయి. మిడతల దండు పంటచేలపై దాడికి దిగాయి. మానవులు వంటచెరుకుకై అడవికి పోతే చెట్టు చెట్టు రాసుకుని అగ్గి పుట్టేది. చివరకు చెట్లు గాలి వీచడం ఆపేశాయి. ఇలా పంటలు పండక, తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక, పీల్చడానికి గాలి లేక మనుషులు అల్లాడిపోయారు. ప్రకృతి తమపై పగ పట్టిందని తెలుసుకున్నారు.
తిన్నగా అడవితల్లి దగ్గరకు పరుగు పరుగున వెళ్లి క్షమాపణ కోరారు. దయతల్చమని వేడుకున్నారు. మానవజాతిని బతికించమని ప్రాధేయపడ్డారు. అడవితల్లి కాళ్లపై పడ్డారు.
అడవితల్లి కనికరించింది. మానవుల మొర ఆలకించింది. ఎప్పటిలాగే సాయం చేయడానికి ఒప్పుకుంది. అడవితల్లి మానవులతో ఇలా అంది: "ప్రకృతిపై అన్ని ప్రాణులకు సమాన హక్కులున్నాయి. కానీ మీ స్వార్థబుద్ధితో ప్రకృతిని ఎక్కువగా వాడుకుంటున్నారు, మిగిలిన ప్రాణులను హింసిస్తున్నారు.
మీ పూర్వీకులు ప్రకృతిని దైవంతో సమానంగా చూసుకున్నారు. మమ్మల్ని ఎంతో గౌరవించారు. మీరు మమ్మల్ని అలానే చూసుకుంటే మేము పూర్వం వలే సాయం చేస్తాం, లేదంటే ప్రళయం పుట్టిస్తాం!" అని పలికింది.
మానవులందరూ పూర్వం వలే ప్రకృతిని దైవంగా భావిస్తూ ఆనందంగా జీవించసాగారు.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు
వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు
హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం







Comments