top of page

గోల్డ్ రంగు'Gold Rangu' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 30/06/2024

'గోల్డ్ రంగు' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


ఎందరో మనుషులు, అందులోను ఎందరెందరో స్నేహితులు ఉంటారు కదా.. ! వారిలో మంచివాళ్ళు, నిజాయితీపరులు.. అదేనండి ఒరిజినల్ గోల్డ్ లా ఉండేది మాత్రం కొందరే. మిగతా వారంత గోల్డ్ రంగు మాత్రమే, గోల్డ్ కాదు. ఏదో ఒక సందర్భంలో వాళ్ళు తమ వక్ర బుద్ధులు బయటపెడుతూనే ఉంటారు. లేకపోతే వారి ప్రవర్తన, మాటలు ద్వారా వక్ర బుద్ధులు బయటపడతాయి. నిజాయితీగా స్నేహం చేసే వారికి వీళ్ళు ఇచ్చే విలువ అలాగే ఉంటుంది. 


పెళ్ళయ్యి ఐదేళ్లు అయిందని ఐదో పెళ్లి రోజున చంద్రం తన భార్య ఇష్టం మేరకు ఫైవ్ స్టార్ హొటల్ లో భోజనం చేసి వద్దామని సిద్ధం అయ్యాడు. వృత్తిరీత్యా చంద్రం చిన్న ప్రయివేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలలో ఇంచుమించు బాగానే సంపాదిస్తాడు. ఇక పిల్లలు పాఠశాలకు పోయాక దంపతులు హోటల్ కి వెళ్ళారు. 


హోటల్ లో చాలా మంది భోజనాలు చేస్తున్నారు. మరికొందరు భోజనాలు చేయటానికి తమలాగే వెయిటింగ్ లో ఉన్నారు. ఇంకొందరు పని కానిచ్చి బిల్ చెల్లించి బయటకు వెళ్తున్నారు. చంద్రం, ఆయన భార్య ఒక టేబుల్ పై కూర్చున్నారు. 


ఇంతలో "హాయ్ రా చంద్రం".. ఎక్కడ నుండో పిలుపు వినపడితే వెనక్కి చూశాడు. 


అతను ఎవరో కాదు, తన చిన్ననాటి స్నేహితుడు మరియు క్లాస్ మేట్ గోపిగాడు. వెయిటర్ గా అందరికీ భోజనాలు పెడుతూ వాళ్ళని చూసి వచ్చి,

"ఏంట్రోయ్.. భార్యతో కలిసి ఫైవ్ స్టార్ హొటల్ కి వచ్చావంటే బాగానే సంపాదిస్తున్నట్టు ఉన్నావు. హ.. అది సరే కానీ.. ఏంటీ ఈరోజు స్పెషల్" అడిగాడు గోపిగాడు. 


"ఈరోజు మా ఐదో పెళ్ళిరోజురా గోపి. అందుకే తన కోరిక మేరకు ఇక్కడికి రావల్సి వచ్చింది" చెప్పాడు చంద్రం. 


"అవునా.. పెళ్ళిరోజు శుభాకాంక్షలు" విష్ చేశాడు. 


"థాంక్స్" ఆన్నాడు చంద్రం. 


" సరేకానీ.. ఇంతకీ ఏం తీసుకుంటారు " ప్రశ్నించాడు గోపి.


"ఒరెయ్ గోపి.. ఇంత పెద్ద హోటల్ లో రకరకాల భోజనాలు ఉంటాయి. మాకు అవేం తెలియదు. ఐదో పెళ్ళిరోజున నాకు, నా భార్యకు గుర్తుండిపోయే మంచి వంటకాలు తెచ్చి పెట్టరా. దానికి ఎంత ఖర్చు అయినా ఈరోజు నేను భరిస్తా " చెప్పాడు చంద్రం. 


ఆ మాటలకు ఎప్పుడూ నొచ్చుకొనే అతడి భార్య ఇంత మంచి భర్త అని పొంగిపోయింది. అది దాచుకుని బయటకు మాత్రం "ఏవండోయ్! పాపం తెలిసిన వ్యక్తిలా ఉన్నారు. పైగా మంచోడిలా ఉన్నారు. ఎవరండి" అడిగింది. 


"మా చిన్ననాటి స్నేహితుడు, క్లాస్ మేట్. స్కూల్లో కానీ బయట కానీ గోపిగాడే మంచి స్నేహితుడు. స్కూల్ కి వచ్చేది తక్కువ. కానీ.. నాతో సమానంగా మార్కులు తెచ్చుకునేవాడు. ఏది కావాలన్నా నాకు కొని పెట్టేవాడు. " 


" డబ్బు ఉన్నోడేనా?"


"నీ బొంద.. వాడు స్కూల్ కి డుమ్మ కొట్టి ఎప్పుడూ హోటల్లో ప్లేటు కడుగుతూ అక్కడే తింటూ డబ్బులు సంపాదించేవాడు. అందుకే పెద్దయ్యాక కూడా ఇలాంటి ఉద్యోగం చేస్తున్నాడు”


"అయినా సరే, మంచిగా పలకరించాడు. అతడు మీకు దొరికిన గోల్డ్ అండి"


"గోల్డ్ లేదు ఏ బొందా లేదు.. వాడున్న ఈ పరిస్థితుల్లో అప్పు అడిగాడనుకో.. ! ఇవ్వల్సిన పరిస్థితి వస్తుంది. ఇస్తే మరలా చెల్లించగలడా ఈ ఉద్యోగం చేస్తూ.. ? ఎందుకైనా మంచిదని వాడితో మాటలు తగ్గించాను. వాడు ఏది తెస్తే అది తిని దానికి సరైన విధంగా డబ్బులు చెల్లించి ఇక్కడి నుండి ఎంత త్వరగా వెళ్తే మనకు అంత మంచిది హ.. "అంటూ పెద్దగా ఊపిరి వదులుతాడు. 


ఇంతలో గోపిగాడు మంచి వంటకాలను తెచ్చి పెట్టాడు. పాపం చంద్రం భార్య మనసులో మాత్రం గోపిగాడు మంచోడని, అలాంటి వ్యక్తికి భర్త తక్కువ చేసి మాట్లాడుతున్నాడని అనుకుంది. 


ఏదైతేనేం భోజనాలు పూర్తి చేసి లేచే సరికి గోపిగాడు కనపడలేదు. వాడి తలనొప్పి పోయిందని అనుకుంటు డబ్బులు చెల్లించటానికి వెళ్ళారు. 


అక్కడ ఉన్న వ్యక్తికి డబ్బులు ఇవ్వగా ఆ వ్యక్తి 

"మా సార్ మీ దగ్గర డబ్బులు తీసుకోవద్దని చెప్పారు " విషయం చెప్పాడు అతడు. 


దంపతులు ఆశ్చర్యపడ్డారు. 


తేరుకుని

"సారా.. ? మా డబ్బులు తీసుకోవద్దన్నారా.. ? ఇంతకీ ఎవరు మీ సారు.. ? పేరు చెప్పండి " చంద్రం అత్రతగా అడిగాడు. 


"మా సార్ పేరు గోపి సార్ " అని చెప్పగానే ఇద్దరు దంపతులు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. 

ఇదిగోండి  సార్! ఈ చీటీ మీకిమ్మన్నారు"


చీటీ తెరచి చూశాడు చంద్రం. 


"రేయ్ చంద్రం. భోజనం అయ్యాక డబ్బులు చెల్లించకుండా థర్డ్ ప్లోర్ కి రండి" అని ఉంది. 

భార్య మళ్ళీ రాగం అందుకుంది. 

"స్నేహితుడని డబ్బులు కూడా ఆయనే చెల్లించారు. మీరెందుకు తక్కువగా ఆలోచిస్తారు? అప్పు అడుగుతాడట అప్పు.. " నొచ్చుకుంటుంది. 


గోపిగాడు చెప్పినట్లే అక్కడికి వెళ్ళారు. గోపిగాడుకి మరో వ్యక్తి ఏవో లెక్కలు చెప్తున్నాడు. పక్కనే నలుగురు వ్యక్తులు కౌంటింగ్ మిషన్లుతో డబ్బులు లెక్కపెడుతున్నారు. అదంతా చూసి చంద్రానికి ఆశ్చర్యం వేసింది. చంద్రంను చూసి లెక్కలు వివరించే వ్యక్తిని పంపేశాడు. 


"రా రా చంద్రం కూర్చోరా" అన్నాడు. 


చంద్రం కూర్చుని "రేయ్ గోపి ఏంట్రా ఇదంతా.. ? నమ్మలేకపోతున్నాను" అన్నాడు.


"ఈ హోటల్ నాదేరా. పైగా హైదరాబాద్ లో కూడా ఇలాంటి హోటల్స్ రెండు ఉన్నాయి. వాటి లెక్కలే ఇప్పుడు చూస్తున్నాను. " డ్రింక్స్ తెచ్చిన వ్యక్తి వస్తే అవి తీసుకుని వాళ్ళకి ఇస్తూ చెప్పాడు. 


"మరీ.. వెయిటర్ అవతారం ఏంట్రా.." ప్రశ్నించాడు. 


"అదా.. ఒకే రోజు ముగ్గురు వెయిటర్స్ డ్యూటీకి రాలేదు. వాళ్ళకి కూడా కుటుంబం ఉంటుంది కదా. సెలవు పెట్టినా నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అవసరం అయితే వాళ్ళు చేసే పని నేను చేస్తాను. మన దగ్గర పని చేసేవాళ్ళకి మనం సరిగ్గా చూసుకోకపోతే మన బతుకునకు అర్థం ఏముంది. డబ్బులు వస్తున్నాయనే గర్వం, ఫైవ్ స్టార్ హోటల్స్ యజమానిననే అహంకారం నాకు లేదు. ఏ వ్యక్తి రాకపోతే ఆ వ్యక్తులు చేయల్సిన పనులు నేనే చేస్తాను. ఈరోజు కూడా అంతే. అది సరేకానీ.. ఇక్కడికి ఎలా వచ్చారు" అడిగాడు గోపి.


"ఆటోలో" సిగ్గు పడుతూ చెప్పాడు చంద్రం. 


"వికాస్.." ఎవరినో పిలిచి 


“నా స్నేహితుడు వచ్చాడు. అతడికి ఆయన భార్యకు నా కార్లో వాళ్ళ ఇంటి వద్ద డ్రాప్ చేసి రా. ఓకే రా చంద్రం నాకు చాలా పని ఉంది. వీలుంటే మళ్ళీ కలద్దాం” అని తన పనిలో నిమగ్నమయ్యాడు గోపి. 


స్నేహితుడి కార్లో.. చంద్రం కిక్కురుమనకుండా కూర్చున్నాడు. 


"ఇప్పటికైనా అర్థం అయిందా.. ఎవరినీ తక్కువ అంచన వేయకూడదని. హోటల్స్ లో పని చేసి వాటి లాభనష్టాలు, వ్యాపార మెలుకువలు తెల్సుకుని ఈ స్థాయి కొచ్చాడన్నమాట. ఇంత గొప్ప స్థానంలో ఉన్నా కాసింత గర్వం కూడా లేని మనిషి నీకు స్నేహితుడైతే, ఆ స్నేహానికి మచ్చ తెచ్చిన స్నేహితుడివి నువ్వు. " చిర్రుబుర్రులాడుతోంది. 


"నిజమేనే.. నీవు చెప్పినట్లు నా స్నేహితుడు గోపిగాడు గోల్డ్. నేను మాత్రం గోల్డ్ రంగుని మాత్రమే, గోల్డ్ ని కాదు” కారు ముందుకు సాగుతుండగా మనసులోనే గోపిగాడికి క్షమాపణ చెప్పుకున్నాడు చంద్రం. 

**** **** **** **** **** ****


పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

నా పేరు పిట్ట.గోపి నేను శ్రీకాకుళంలో అంబేద్కర్ యూనివర్సిటీలో ఎం ఏ సోషల్ వర్క్ పూర్తి చేశాను. నాకు సమాజాన్ని,సమాజంలో మనుషులను గమనించటం అలవాటు. ముఖ్యంగా సమాజంలో జరిగే ఏ చిన్న మంచి-చెడులనైనా.. మంచి కథలుగా మలచటంలో నాకు నేనే సాటి.వ్రృత్తిరిత్య నేను వ్యవసాయ కుటుంభంలో మద్యతరగతికి చెందిన వ్యక్తిని.ఇప్పటికే నేను రాసిన కథలు 90కి పైగా మన తెలుగు కథలు డాట్ కామ్ వెబ్సైట్ లో ప్రచూరితం అయ్యాయి.అలాగే ప్రతిలిపిలో కూడా నా కథలు అచ్చయ్యాయి. నా కథలు బహుమతులుకు ఎంపికకాకున్నా..(లాప్టాప్ లేదు) ఫోన్ లోనే టైపింగు చేయాలన్నా కథలు పంపాలనే ఆశక్తి తగ్గిపోతుంది. కానీ..! సమాజంలో జరిగే సంఘటనలకు అక్షరరూపం ఇచ్చి పదిమందికి తెలపాలనేదే నా అభిలాష. నా కథల్లో మంచి చెడులను పాఠకులు తెలుసుకుంటారని అనుకుంటున్నాను. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం

36 views0 comments

Comentarios


bottom of page