top of page

భరణి నిర్ణయం


'Bharani Nirnayam' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 30/06/2024

'భరణి నిర్ణయం' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



"భరణీ ! ఇదిగో లంచ్ బాక్సు" పిలిచింది పార్వతి. 

"ధాంక్స్ వదినా!" అంటూ పార్వతి చేతిలోంచి బాక్సును తీసుకుని హడావుడిగా ఆఫీసుకు వెళ్లింది భరణి. 


 మరి కాసేపటికి "పారూ! వెళ్లొస్తా! తలుపేసుకో " అంటూ భర్త ప్రకాష్ కూడా ఆఫీసుకు వెళ్లాక వీధి తలుపువేసుకుని లోపలికి వచ్చి మిగిలిన ఇంటిపనంతా పూర్తి చేసుకుని ప్రశాంతంగా కాసేపు కూర్చున్నాక ‘భరణికి త్వరలో పెళ్లి చేస్తే బాగుండు. ఆరునెలల క్రితమే తమనందరినీ శాశ్వతంగా విడిచివెళ్ళిన అత్తగారు కూడా సంతోషిస్తారు. ఆవిడ పోయేదాకా కూతురి పెళ్లిని గురించే తపన పడి వేడుకగా పెళ్లి చూడాలని ఆరాటపడింది' అనుకుని అత్తగారిని తలుచుకుని గతాన్ని గుర్తుచేసుకుంది పార్వతి. 


అప్పుడే చదువు పూర్తయి క్రొత్తగా ఉద్యోగంలో చేరినందున "ఇప్పుడే నాకు పెళ్లి వద్దు" అని భరణి చెప్పటంతో "సరే" అని ఇంట్లో అందరూ ఆవిషయం గురించి పట్టించుకోలేదు. రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. ఒకరోజున హార్ట్ఎటాక్ తో నిద్రలోనే భరణి తల్లి చనిపోయింది. జరిగినదానికి అందరూ ఎంతో బాధపడి మిగిలిన కార్యక్రమాలన్నీ యధావిధిగా పూర్తిచేశారు. క్రమేపీ భరణి, ప్రకాష్ లు మామూలు జీవనస్ధితిలోకి వచ్చి యధావిధిగా ఆఫీసులకు వెళుతున్నారు. 

 'భరణికి తన బాబాయి కొడుకు వాసుతో పెళ్లి చేస్తే బాగుండు. అతను ఈ ఊరిలోనే మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధ్ధిమంతుడు కూడా. అతనితో పెళ్లైతే భరణి తమ కళ్లముందే ఉంటుంది. సాయంత్రం ఆఫీసునుంచి రాగానే భర్తతో చెప్పి భరణి అభిప్రాయం కూడా కనుక్కోవాలి' అనుకుంది పార్వతి. 


సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చాక భర్తకు, భరణికి టీ, స్నాక్స్ ఇచ్చి తనూ తీసుకుంది. కాసేపటికి భరణి తన గదిలోకి వెళ్లి లాప్ టాప్ లో ఏదో పనిచేసుకుంటోంది. వాసుతో భరణి పెళ్లి విషయమై తనకొచ్చిన ఆలోచనను భర్తకు చెప్పింది పార్వతి. వెంటనే " పారూ! నేను భరణి పెళ్లి విషయమై నాకొచ్చిన ఆలోచనను నీతో చెప్పి నీకు ఇష్టమైతే తన అభిప్రాయాన్ని కనుక్కుందామనుకుంటున్నాను " అన్నాడు ప్రకాష్. 


"ఏంటో చెప్పండి " అంది పార్వతి. 


"నా చిన్ననాటి స్నేహితుడు రమణ నీకు తెలుసు కదా ! వాడి కొడుకు ప్రసాద్ బాంకులో ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ నుంచి ఇక్కడికి ట్రాన్సఫర్ అయి ఇటీవలే వచ్చాడు. వాడు బుధ్ధిమంతుడు కూడా. పైగా ఈ సంబంధాన్ని కలుపుకుంటే మా స్నేహబంధం ఇంకా బలపడుతుంది. భరణి కూడా మన కళ్లముందే సుఖంగా ఉంటుంది. ఏమంటావు పారూ " అన్నాడు ప్రకాష్. 


గదిలో లాప్ టాప్ లో పనిచేసుకుంటున్న భరణికి బయట అన్నావదినల మాటలు వినపడుతున్నాయి. తన పేరు ప్రస్తావన వచ్చేటప్పటికి “ఏంటా?”' అని ఆసక్తిగా వింటున్న భరణికి అది తన పెళ్లి విషయమని అర్థమై వాళ్ల అభిప్రాయాలను విని వెంటనే వాళ్ల వద్దకు వచ్చింది భరణి. 


"అన్నయ్యా ! వదినా ! మీ మాటల మధ్యలో కల్పించుకుంటున్నందుకు నన్ను క్షమించండి. నాపెళ్లి గురించి ప్రస్తావన కనుక మధ్యలో నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. గత రెండు నెలలుగా నేను మీతో ఒక విషయం చెపుదామనుకుంటున్నాను. నేను, మాకొలీగ్ గోపాల్ ప్రేమించుకుంటున్నాము. అతను చాలా మంచివాడు. మా మనసులు కలిశాయి. మీ అంగీకారంతో మేము పెళ్లికి శ్రీకారం చుట్టి క్రొత్త జీవితం మొదలు పెడదామనుకుంటున్నాము " అంది భరణి. 


భరణి మాటలను విన్న పార్వతీ, ప్రకాష్ లు బిత్తరపోయారు. భరణి ఇంకా చిన్నపిల్లే అనుకుంటున్న వాళ్లకు ఆమె చెప్పిన ఈ విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె ప్రేమ విషయం సుతరామూ ఇష్టంలేక సీరియస్ గా ముఖాలు పెట్టారు పార్వతీ ప్రకాష్ లు. వాళ్ల భావాలను గమనించిన భరణి వాళ్లకు గోపాల్ ను గురించిన వివరాలను ఇచ్చి 'రేపే అతన్ని మన ఇంటికి తీసుకువచ్చి మీకు పరిచయం చేస్తాను. అతన్ని చూసి అతనితో మాట్లాడాక అతని మాట, నడవడి మీకు తప్పక నచ్చి మీరు మా పెళ్లికి అంగీకరిస్తారు చూడండి" స్ధిరంగా అంది భరణి. 


 వెంటనే భరణి తన గదిలోకి వెళ్లి లాప్ టాప్ లో మిగిలిన పనిని పూర్తి చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంది. పార్వతి వంటగదిలోకి వెళ్లి వంట ఫూర్తచేసి భర్తని, భరణిని, భోజనానికి పిలిచింది. ఆ రాత్రి అందరూ భోజనాలు చేసి విశ్రమించారు. 


ఆ మరునాడు ఉదయం అందరూ కాలకృత్యాలు తీర్చుకున్నాక పార్వతి భర్తకు, భరణికి టీ ఇచ్చి తనూ తీసుకుంది. ఆతర్వాత యధావిధిగా ఎవరి దినచర్యలలో వాళ్లు నిమగ్నమయ్యారు. రోజూలాగానే టిఫెను రెడీచేసి వాళ్లకు పెట్టింది పార్వతి. ముభావంగా ఉన్న వదినను నవ్వుతూ మాట్లాడించబోయింది భరణి. కానీ సీరియస్ గా ఉన్న ఆవిడ ముఖాన్ని చూసి మిన్నకుండిపోయింది. 


కాసేపటికి భరణికి బాక్స్ ఇచ్చింది పార్వతి. భరణి దాన్ని తీసుకుని తన వదినకు ‘బై ‘ చెప్పి ఆఫీసుకు వెళ్లింది. ప్రకాష్ కూడా ఆఫీసుకు వెళ్లాక మిగిలిన పనిలో బిజీ అయింది పార్వతి. 

ఆ సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ తన కూడా గోపాల్ ని ఇంటికి తీసుకొచ్చి తన అన్నావదినలకు పరిచయం చేసింది భరణి. గోపాల్, అతని మాటతీరు, అతని సంస్కారం, పెద్దలంటే వినయవిధేయతలు పార్వతి దంపతులకు నచ్చింది.


వెంటనే భరణి, గోపాల్ ల పెళ్లికి సుముఖత చూపారు. భరణి, గోపాల్ లు వినమ్రంగా పార్వతి దంపతులకు నమస్కరించారు. ఆతర్వాత కా సేపటికి గోపాల్ వీళ్ల వద్ద శెలవు తీసుకుని తనింటికి వెళ్లాడు. 


 తమ పెళ్లికి ఆమోదించినందుకు భరణి తన అన్నావదినలకు ధన్యవాదాలను తెలిపింది. పార్వతి, ప్రకాష్ లు నవ్వుతూ భరణిని దగ్గరకు తీసుకుని అభినందనలు తెలిపి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. 

జ్ఞతలు తెలుపుకుంది కల్పన. 


.. సమాప్తం. 

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



నా గురించి పరిచయం.....


 నా పేరు  నీరజ  హరి ప్రభల. మాది  విజయవాడ. మావారు  రిటైర్డ్  లెక్చరర్. మాకు  ముగ్గురు  అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస.  వాళ్లు  ముగ్గురూ  సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా   విదేశాల్లో  ఉద్యోగాలు  చేస్తూ  భర్త, పిల్లలతో  సంతోషంగా ఉంటున్నారు. 


 నాకు  చిన్నతనం  నుంచి  కవితలు, కధలు  వ్రాయడం  చాలా  ఇష్టం. ఆరోజుల్లో  వాటిని  ఎక్కడికి,  ఎలా  పంపాలో  తెలీక  చాలా ఉండిపోయి  తర్వాత  అవి  కనుమరుగైనాయి.  ఈ  సామాజిక మాధ్యమాలు  వచ్చాక  నా రచనలను  అన్ని  వెబ్సైట్ లలో  వ్రాసి వాటిని పంపే  సౌలభ్యం  కలిగింది. నా కధలను, కవితలను  చదివి  చాలా  మంది పాఠకులు  అభినందించడం  చాలా  సంతోషదాయకం. 

నా కధలకు   వివిధ పోటీలలో  బహుమతులు  లభించడం,  పలువురి  ప్రశంసలనందుకోవడం  నా అదృష్టంగా  భావిస్తున్నాను. 


మన  సమాజంలో  అనేక  కుటుంబాలలో   నిత్యం  జరిగే  సన్నివేశాలు, పరిస్థితులు,   వాళ్లు  పడే  బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని   ఎదుర్కొనే  తీరు   నేను  కధలు వ్రాయడానికి  ప్రేరణ, స్ఫూర్తి.  నా కధలన్నీ  మన  నేటివిటీకి, వాస్తవానికి   దగ్గరగా ఉండి  అందరి  మనస్సులను  ఆకర్షించడం  నాకు  సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న  దారుణాలకు, పరిస్ధితులకు   నా మనసు  చలించి  వాటిని  కధల రూపంలోకి  తెచ్చి  నాకు  తోచిన  పరిష్కారం  చూపే  ప్రయత్నం  చేస్తాను.   


నా  మనసులో  ఎప్పటికప్పుడు  కలిగిన  భావనలు, అనుభూతులు, మదిలో  కలిగే  సంఘర్షణలను   నా కవితలలో  పొందుపరుస్తాను. నాకు  అందమైన  ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర  నైసర్గిక  స్వరూపాలను  దర్శించడం, వాటిని  ఆస్వాదించడం, వాటితో  మమేకమై మనసారా  అనుభూతి చెందడం  నాకు  చాలా ఇష్టం. వాటిని  నా హృదయకమలంలో  అందంగా  నిక్షిప్తం చేసుకుని   కవితల రూపంలో  మాలలుగా  అల్లి  ఆ  అక్షర మాలలను  సరస్వతీ దేవి  పాదములవద్ద  భక్తితో   సమర్పిస్తాను.  అలా  నేను  చాలా  దేశాల్లలో  తిరిగి  ఆ అనుభూతులను, అనుభవాలను   నా కవితలలో, కధలలో  పొందుపరిచాను. ఇదంతా  ఆ వాగ్దేవి  చల్లని  అనుగ్రహము. 🙏 


నేను గత  5సం… నుంచి  కధలు, కవితలు  వ్రాస్తున్నాను. అవి  పలు పత్రికలలో  ప్రచురణలు  అయ్యాయి. పుస్తకాలుగా  ప్రచురించబడినవి. 


“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో  నేను కధలు, కవితలు   వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో   నాకధలకి  చాలా సార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు  లభించాయి.  వాళ్ల   ప్రోత్సాహం  జీవితాంతం  మరువలేను. వాళ్లకు  నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు   రవీంద్రభారతిలో  నాకు  “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి  ఘనంగా  సన్మానించడం  నా జీవితాంతం  మర్చిపోలేను. ఆజన్మాంతం  వాళ్లకు  ఋణపడిఉంటాను.🙏 


భావుక  వెబ్సైట్ లో  కధల పోటీలలో   నేను  వ్రాసిన “బంగారు గొలుసు” కధ   పోటీలలో  ఉత్తమ కధగా  చాలా ఆదరణ, ప్రశంసలను  పొంది  బహుమతి  గెల్చుకుంది. ఆ తర్వాత  వివిధ పోటీలలో  నా కధలు  సెలక్ట్  అయి  అనేక  నగదు  బహుమతులు  వచ్చాయి.  ‘మన కధలు-మన భావాలు’  వెబ్సైట్ లో  వారం వారం  వాళ్లు  పెట్టే  శీర్షిక, వాక్యానికి కధ,    ఫొటోకి  కధ, సందర్భానికి  కధ  మొ… ఛాలెంజ్  లలో  నేను   కధలు వ్రాసి  అనేకమంది  పాఠకుల  ప్రశంశలను  పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్  వెబ్సైట్ లో  “పశ్చాత్తాపం” అనే  నా  కధకు  విశేష స్పందన  లభించి  ఉత్తమ కధగా  సెలక్ట్ అయి  నగదు బహుమతి   వచ్చింది. ఇలా  ఆ వెబ్సైట్ లో  నెలనెలా   నాకధలు  ఉత్తమ కధగా  సెలెక్ట్ అయి  పలుసార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి.


గత  5సం.. నుంచి  “మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్“ లో  నేను కధలు  వ్రాస్తూ ఉంటున్నాను. ఆ వెబ్సైట్ లో  నాకధలకి  చాలా సార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి. అనేక  ప్రశంసలు లభించాయి.  వాళ్ల   ప్రోత్సాహం  జీవితాంతం  మరువలేను. వాళ్లకు  నా ధన్యవాదాలు🙏. 


ఇటీవల నేను  వ్రాసిన  “నీరజ  కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు”  75 కవితలతో  కూడిన పుస్తకాలు  వంశీఇంటర్నేషనల్   సంస్థ వారిచే  ప్రచురింపబడి  మా గురుదంపతులు  ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి  అవార్డీ    శ్రీ  అయ్యగారి శ్యామసుందరంగారి  దంపతులచే  కథలపుస్తకం,  జాతీయకవి  శ్రీ సుద్దాల అశోక్ తేజ  గారిచే   కవితలపుస్తకం  రవీంద్ర భారతిలో ఘనంగా  ఆవిష్కరించబడటం,  వాళ్లచేత  ఘనసన్మానం  పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు  పొందడం  నాఅదృష్టం.🙏 


ఇటీవల  మన  మాజీ ఉపరాష్ట్రపతి  శ్రీ  వెంకయ్యనాయుడి గారిచే  ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు  అందుకోవడం  నిజంగా  నా అదృష్టం. పూర్వజన్మ  సుకృతం.🙏


చాలా మంది  పాఠకులు  సీరియల్ వ్రాయమని కోరితే  భావుకలో  “సుధ” సీరియల్  వ్రాశాను. అది  అందరి ఆదరాభిమానాలను  పొందటమే  కాక   అందులో  సుధ  పాత్రని  తమ ఇంట్లో పిల్లగా  భావించి  తమ  అభిప్రాయాలను  చెప్పి  సంతోషించారు. ఆవిధంగా నా  తొలి సీరియల్  “సుధ”  విజయవంతం అయినందుకు  చాలా సంతోషంగా  ఉన్నది.        


నేను వ్రాసిన  “మమతల పొదరిల్లు”  కధ భావుకధలు  పుస్తకంలో,  కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో  “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో  కొత్తకెరటం   పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి”   పుస్తకంలో  ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు  పుస్తకాలుగా  వెలువడి  బహు  ప్రశంసలు  లభించాయి. 


రచనలు  నా ఊపిరి. ఇలా పాఠకుల  ఆదరాభిమానాలు, ఆప్యాయతలే  నాకు  మరింత  రచనలు  చేయాలనే  ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది  శ్వాస వరకు  మంచి రచనలు  చేయాలని, మీ అందరి  ఆదరాభిమానాలను  పొందాలని  నా ప్రగాఢవాంఛ. 


ఇలాగే  నా రచనలను, కవితలను  చదివి  నన్ను   ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని   ఆశిస్తూ 


                     మీ  అభిమాన రచయిత్రి

                       నీరజ హరి  ప్రభల.

విజయవాడ.

Photo Gallery




Comments


bottom of page