స్వర కోకిలకు నివాళి!
- Goparaju Venkata Suryanarayana
- 5 hours ago
- 3 min read
#గోపరాజువెంకటసూర్యనారాయణ, #బహుకళాప్రజ్ఞావంతుడుబాపు, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Swara Kokilaku Nivali - New Telugu Poem Written By Goparaju Venkata Suryanarayana Published In manatelugukathalu.com On 15/12/2025
స్వర కోకిలకు నివాళి! - తెలుగు కవిత
రచన: గోపరాజు వెంకట సూర్యనారాయణ
తెలుగు సినీ సంగీత చరిత్రలో ఎస్. జానకి గారి పేరు ఒక స్వర్ణాధ్యాయం. ఆమె స్వరం కేవలం పాట కాదు… అది ఒక అనుభూతి. ప్రతి భావానికి జీవం పోసిన ఆమె గానమాధుర్యం తరతరాలకు స్ఫూర్తి. "స్వర కోకిలకు నివాళి!" అనే ఈ వ్యాసం, ఆ మహోన్నత గాయనికి అంకితమైన హృదయపూర్వక శ్రద్ధాంజలి.
స్వర కోకిలకు నివాళి!
తెలుగునేల గున్నమామిడి కొమ్మపై, సరిగమల స్వరాలను మేటిగా కూసిన మధుర గాయిని గాన కోకిల జానకమ్మ!
నాద స్వరంతో జత కలిపిన గాత్రం! నీలి మేఘాలలో, గాలి కెరటాలలో లీనమై పాటగా పల్లవించిన గళం! పగలే వెన్నెల అనుభవాలను కురిపించి జగాన్నే ఊయల లూగించిన గానం!
‘సిరిమల్లె పువ్వా! చిన్నారి చిలకమ్మా!’ యంటూ పదహారేళ్ళ చిలిపి తలపు లాలపించినా, ‘మౌనమేలనోయీ మరపురాని రేయి’ యని మార్దవంగా మోహ పరవశంగా పాడినా,
‘మనసా! త్రుళ్లి పడకే’ అంటూ పడుచు వలపు తలపులోలికించినా,
‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ అని ప్రేమలేఖ భావాన్ని పలికించినా,
‘ఆకాశంలో ఆశల హరివిల్లు’ అంటూ కన్నెవయసు హుషారును మేళవించినా,
‘నరుడా ఓ నరుడా ఏమి కోరిక’ అంటూ కొంటె కవ్వింపుల శృంగార మొలికించినా,
‘ఈ దుర్యోధన దుస్సాసన దుర్వినీతి పర్వంలో’ యని వేదనాభరిత భావాన్ని ప్రభవించినా,
‘గోవుల్లు తెల్లన! గోపయ్య నల్లన! ఎందువలన?’ పాటలో పసివాని ముద్దుమాటల స్వరవిన్యాసం చేసినా,
పాడే స్వరంలో ముసలి గొంతు వణుకుతో మరపించినా,
గానకోకిల వైవిధ్య వైదుష్య భరిత గాన పాటవానికే చెల్లు!
ఆమె పాటలెన్నో బహుముఖ ప్రజ్ఞకు గీటురాళ్లు!
వేనవేల పాటల్లో ఆమె గాన మాధుర్యం నిక్షిప్తం!
ఆమె పాట పాడేటప్పుడు నిశ్చల స్థాణువు
! ఆమె గళం పలికే స్వరమాధుర్యం వేణువు!
అర్ధ శతాబ్దంపైగా వివిధ భాషల్లో వేలకొద్దీ పాటలు పాడిన మేటి దిగ్గజ గాయనీమణి!
ప్రముఖ గాయనిగా ప్రకాశించిన ధ్రువతార!
ఆమె మరణం సినీ జగత్తుకు తీరని లోటు!
ఆమె చిరునవ్వుమోము ఇక ఒక జ్ఞాపకమే!
ఆమె పాటల మధురాలు అజరామరాలే!
--------------------------------------------

Bahukala Prajnavanthudu Bapu - New Telugu Poem Written By Goparaju Venkata Suryanarayana Published In manatelugukathalu.com On 15/12/2025
బహుకళా ప్రజ్ఞావంతుడు బాపు - తెలుగు కవిత
రచన: గోపబరాజు వెంకట సూర్యనారాయణ
బొమ్మలు గీసే కళలో ప్రజ్ఞావంతుడు. బాపు!
అందమైన అమ్మాయికి మరో పేరు బాపు బొమ్మ!!
ఆంధ్రుల అభిమాన చిత్రకారుడు బాపు!
అందం ఒద్దికగా బాపు చిత్రాలలో ఒదిగిపోవు!!
కేప్షన్ వివరణ అవసరం లేని బాపు కార్టూన్లు కోకొల్లలు!
గిలిగింతలు పెట్టి, కవ్వించి కడుపుబ్బ నవ్వించు!!
బాపు గీసిన ఆధ్యాత్మిక దేవతామూర్తుల చిత్రాలు అజరామరాలు!
బాపు చేతివ్రాత తెలుగు లిపికే మురిపించే ఫాంటు!!
రామకథల స్ఫూర్తి తో బాపు తీసిన సినిమాలు కళాఖండాలు!
కధానాయికలను బాపుబొమ్మకు ధీటుగా మలచడం బాపూ నైపుణ్యం!
చెరగని నవ్వు, మితభాషణ, బాపుకు పెట్టని ఆభరణాలు!
ముళ్లపూడి రమణతో మైత్రి బాపు ఔదార్యానికి తార్కాణం!!
అట్టి మహనీయుడు ఆంధ్రుడు కావడం తెలుగు జాతికే గర్వ కారణం!!
@@@@@@@@
గోపరాజు వెంకట సూర్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
ముందుగా మన తెలుగు కథలు.కామ్ నిర్వాహకులకు నమస్కారం, అభినందనలు. మీరు తెలుగు కథలను, కథకులను ప్రోత్సహిస్తున్న తీరు ఈ మధ్యనే తెలిసింది!
నా పేరు: గోపరాజు వెంకట సూర్యనారాయణ, తల్లిదండ్రులు: గోపరాజు కృష్ణమూర్తి, అనసూయ దంపతులు.నివాసం: కూకట్ పల్లి, హైదరాబాదు.
వృత్తి రీత్యా M.Tech. Machine design చదివిన నేను, HMT Hyd. లో, దాదాపు ముప్పై ఏళ్ళు పైన పనిచేసి డిప్యూటీ జనరల్ మేనేజరు స్థాయిలో వాలంటరీ పదవీ విరమణ చేసిన ఇంజనీరును.
ఆ తర్వాత పేరున్న విజ్ఞాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ప్రొఫెసర్ గానూ, మరికొన్ని ఇంజనీరింగు సంస్థల్లో డిజైన్ కన్సల్టెంటు గానూ పనిచేసిన అనుభవం.
ప్రస్తుతం విశ్రాంత సీనియర్ సిటిజన్ ను.స్వతహాగా సాహిత్యాభిమానిని, కళాభిమానిని. కథలంటే బాగా ఇష్టపడతాను.ఈ మధ్యనే, రిటైర్మెంట్ తర్వాత స్వీయరచనా వ్యాసాంగానికి, స్వీయ పెయింటింగ్సు వేయడానికి సాహసిస్తున్నాను. పలు అంతర్జాల సమూహలకు, సంకలనాలకు కవితలు, చిన్నగా కథలు రాస్తున్నాను, ప్రచురిస్తున్నారు, అభినందిస్తున్నారు!
